twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్: మహానాయకుడు రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    NTR Mahanayakudu Movie Review And Rating | Filmibeat Telugu

    Rating:
    2.5/5
    Star Cast: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కల్యాణ్ రాం, సుమంత్, రానా దగ్గుబాటి
    Director: క్రిష్ జాగర్లమూడి

    నందమూరి తారక రామారావు అంటే ఓ చరిత్ర.. తెలుగు వాడి ఆత్మగౌరవం.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయని ధీరత్వం.. అలాంటి మహనీయుడి గురించి ఎన్ని మాటలు చెప్పినా.. రాసిన తక్కువే. అతి సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి భారతీయ సినిమా పరిశ్రమలో తొలి సూపర్‌స్టార్, వెండితెర ఇలవేల్పు అనే మాటలను సొంత చేసుకొన్న వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న గొప్ప సినీ, రాజకీయ నాయకుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్.. తొలిభాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాగా, రెండో భాగం ఎన్టీఆర్: మహానాయకుడు ఫిబ్రవరి 22న రిలీజైంది. తెలుగువాడి వాడివేడిని ఢిల్లీకి చూపిన ఎన్టీఆర్ వెండితెర జీవితం వెండితెర మీద ఎలా ఆవిష్కరించారంటే..

    ఎన్టీఆర్: మహానాయకుడు స్టోరీ

    ఎన్టీఆర్: మహానాయకుడు స్టోరీ

    నందమూరి తారక రామారావు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆ తర్వాత పార్టీ జెండాకు రూపకల్పన చేసి జనంలోకి వెళ్లిపోతారు. ఎన్టీఆర్ ప్రభంజనం చూసిన కేంద్రం వేసిన ఎత్తుగడలు, వ్యూహాలకు ఎన్టీఆర్ అడ్డుకట్ట వేశాడు. ప్రజల అండదండలను ఎలా కూడగట్టారు అనేది సినిమాలో ప్రధానాంశాలు.

    ఎన్టీఆర్ మహానాయకుడులో మలుపులు

    ఎన్టీఆర్ మహానాయకుడులో మలుపులు

    రాజకీయ రంగంలో ఎన్టీఆర్ దూకుడును ప్రదర్శించే సమయంలో క్యాన్సర్ వ్యాధి సోకడంతో భార్య బసవతారకంకు అమెరికాలో చికిత్స, తనకు హార్ట్ సర్జరీ చేసుకొన్న సమయంలో నాదెండ్ల భాస్కరరావు అధికారాన్ని లాక్కోవడం సినిమాలో ప్రధానమైన ట్విస్ట్. నాదెండ్ల, కేంద్రం చేసిన నమ్మక ద్రోహానికి ఎన్టీఆర్ ఎలా బుద్ది చెప్పారనేది ఓ అంశంగా కనిపిస్తుంది. ఇక క్యాన్సర్‌‌తో బాధపడుతున్న బసవతారకం ఎలాంటి ఉద్వేగానికి గురయ్యారనే రెండో ప్రధానమైన ఘట్టంగా కనిపిస్తుంది.

    తొలిభాగం

    తొలిభాగం

    ఎన్టీఆర్ పుట్టుక, బాల్యం, పెళ్లి లాంటి అంశాలతో సినిమా చకచకా కథలోకి వెళ్లిపోతుంది. రాజకీయ పార్టీ పెట్టిన క్రమంలో ఎన్టీఆర్ చేసే ప్రసంగాలు చాలా ఉద్వేగంగా తెరపైన కనిపించేలా ఉంటాయి. బసవతారకంకు క్యాన్సర్ వ్యాధి సోకిన సమయంలో ఎన్టీఆర్ ఎమోషనల్‌కు గురికావడం తొలిభాగానికి హైలెట్ అనిచెప్పవచ్చు. తొలిభాగం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. నాదెండ్ల, ఎన్టీఆర్‌కు మధ్య చోటుచేసుకొన్న వైరుధ్యం, విభేదాలు ప్రభావవంతంగా చెప్పలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక సెకండాఫ్‌లో అమెరికాలో చికిత్స ఎపిసోడ్ చాలా భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇక నాదెండ్ల ఎపిసోడ్‌ ప్రారంభమైన తర్వాత చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రాక్ పక్కన పెట్టి చంద్రబాబు పాత్రను ఎలివేట్ చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ను అమితంగా అభిమానించే కొన్ని వర్గాలకు ఇది రుచించకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు లేకపోతే ఎన్టీఆర్ రాజకీయ జీవితం లేదనే విధంగా ప్రొజెక్ట్ చేయడం కథను తప్పుదారి పట్టించేలా కనిపిస్తుంది.పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన దగ్గుబాటి, ఉపేంద్ర లాంటి పాత్రలు నామమాత్రంగానే కనిపిస్తాయి. ఇలాంటి అంశాలు కథలో బలాన్ని బలహీనపరిచాయనడానికి ఆస్కారం ఏర్పడింది.

    డైరెక్టర్ క్రిష్ టేకింగ్

    డైరెక్టర్ క్రిష్ టేకింగ్

    ఎన్టీఆర్ జీవితంలోని భావోద్వేగ సన్నివేశాలకే దర్శకుడు క్రిష్ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎన్టీఆర్‌లోని సంఘర్షణ, ముక్కుసూటితనం, ఆవేశం తదితర అంశాలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకోలేకపోయిందనే ఫీలింగ్ కల్పిస్తుంది. కథ, కథనంలో సాగదీత, అనవసర విషయాలను ఎక్కువగానే జొప్పించారా అనిపిస్తుంది. ఎన్టీఆర్ మహానాయకుడిగా ఎలా మారాడానికి కారణమైన అంశాలను ఎలివేట్ చేయలేకపోయడం దర్శకత్వ పటిమకు ప్రశ్నార్థకంగా మారాయని చెప్పవచ్చు.

    బాలకృష్ణ విశ్వరూపం

    బాలకృష్ణ విశ్వరూపం

    ఎన్టీఆర్‌ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి బాలకృష్ణ చేసిన కృషి అభినందనీయం. తండ్రి పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. బసవతారకంను ఉద్దేశించి సంతానం గురించి చెప్పే సీన్లలో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంటుంది. అలాగే అసెంబ్లీలో గ్రంధి మాధవి, నన్నపనేని రాజకుమారి రెచ్చగొట్టే సీన్లలో బాలయ్య నటన అమోఘంగా ఉంటుంది.

    విద్యాబాలన్ పెర్ఫార్మెన్స్

    విద్యాబాలన్ పెర్ఫార్మెన్స్

    బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయింది. పార్టీ ప్రచారంలో ఎన్టీఆర్‌కు గాయమైన సమయంలో, అలాగే మహిళలకు ఆస్తిలో సగభాగం అనే పథకాన్ని ప్రకటించిన సమయంలో విద్యాబాలన్ నటన హైలెట్‌ అని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ స్వామిగా మారిన సమయంలో విద్యాబాలన్ పలికించిన హావభావాలు సూపర్. అమెరికాలో చికిత్స సమయంలో హార్మోనియంతో పాట పాడటం మరింత ఆకట్టుకొన్నది. క్యాన్సర్‌ కారణంగా ఆమె జీవితపు చివరి క్షణాలకు సీన్లలో విద్యాబాలన్ నటన సినిమాను మరోస్థాయికి చేర్చింది.

    చంద్రబాబు పాత్రలో రానా

    చంద్రబాబు పాత్రలో రానా

    చంద్రబాబు పాత్రలో రానా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఆ పాత్రను మొత్తంగా పాజిటివ్‌గా చూపించడంతో చరిత్ర తెలిసిన వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు వాస్తవాలకు అతీతంగా జీర్ణించుకోలేని విధంగా ఉంటాయి. వాస్తవాలు, అవాస్తవాలను పక్కన పెడితే తనకు లభించిన పాత్రను రానా మరోస్థాయికి తీసుకెళ్లాడు.

     మిగితా నటీనటులు

    మిగితా నటీనటులు

    హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ జీవించాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే ఎన్టీఆర్ జీవితంలో హరికృష్ణ పాత్ర చాలా గొప్పది.. పెద్దది. అయితే ఆ పాత్ర నిడివి పెద్దగా కనిపించకపోవడంతో కల్యాణ్ రామ్ నటనను ప్రదర్శించడానికి అవకాశం దక్కలేదనిపిస్తుంది. చంద్రబాబు పాత్ర కంటే హరికృష్ణ రోల్‌కు మరింత ప్రధాన్యం ఇచ్చి ఉంటే ఆయన జీవితానికి ఘన నివాళి అర్పించినట్టుగా ఉండేది.

    సాయిమాధవ్ డైలాగ్స్

    సాయిమాధవ్ డైలాగ్స్

    తొలిభాగం, రెండో భాగం అనే తేడా లేకుండా సాయి మాధవ్ బుర్రా తన మాటలకు మరింత పదునుపెట్టాడు. కొన్ని సన్నివేశాలకు ఆయన మాటలు బలంగా మారాయి. కొన్ని సీన్లలో బుర్రా ప్రయోగించిన మాటలు బుల్లెట్లలా దూసుకెళ్లాయి. ఓ జెండా మరో జెండాకు వందనం చేస్తున్నదని, ఢిల్లీ నన్ను కదిలించింది. నేను ఢిల్లీని కదిలిస్తా అంటూ రాసిన డైలాగ్స్ ఆవేశాన్ని కలిగిస్తాయి. బసవతారకం గురించి ఎన్టీఆర్‌తో చెప్పించిన ‘నాకు 12 సార్లు జన్మనిచ్చింది' అని చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి.

    సినిమాటోగ్రఫి, ఇతర విభాగాలు

    సినిమాటోగ్రఫి, ఇతర విభాగాలు

    జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్, కలర్ ప్యాటర్న్ తదితర అంశాలు బాగున్నాయి. అప్పటి వాతావరణాన్ని తెర మీదకు తీసుకువచ్చిన ఆర్ట్ విభాగం పనితీరు సూపర్ అని చెప్పవచ్చు. రామకృ‌ష్ణ ఎడిటింగ్ క్రిస్పిగా ఉంది. సెకండాఫ్‌లో పాత్రల బిహేవ్ కారణంగా కొంత ల్యాగ్ అనిపిస్తాయి.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఎన్టీఆర్ లాంటి మహనీయుడి జీవితాన్ని ఆవిష్కరించడానికి వారు అనుసరించిన నిర్మాణ విలువలు ప్రతిష్ఠాత్మకమైన రీతిలోనే ఉన్నాయి. నటీనటుల ఎంపికలోనూ, సాంకేతిక నిపుణుల సమకూర్పులోనూ వారి అభిరుచి ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ ప్రతి పేదవాడి ఇంటిలో ఓ కుటుంబ సభ్యుడయ్యానేది సత్యం. ఆ విషయాన్ని బలంగా చెప్పడానికి ప్రయత్నించినా, ప్రభావవంతంగా చెప్పలేకపోవడం సినిమాకు మైనస్. ఎన్టీఆర్ బయోపిక్ కంటే చంద్రబాబు జీవిత చరిత్రనా అనే అనుమానం కలుగుతుంది. ఓవరల్‌గా భావోద్వేగాలు, చరిత్ర పలికిన సత్యాలు కొన్ని తెర మీద సాక్షాత్కరిస్తాయి. ఈ తరం ప్రేక్షకులు ఎన్టీఆర్ మహోన్నత జీవితం తెలుసుకోవడానికి వివాదాలకు చోటులేని డిక్షనరీగా ఉపయోగపడే సినిమా అని చెప్పవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    ఫస్టాఫ్‌లో ఎన్టీఆర్, బసవతారకం మధ్య సీన్లు
    బాలకృష్ణ, విద్యాబాలన్ పెర్ఫార్మెన్స్
    క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్
    సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్
    సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్స్
    మిగితా క్యారెక్టర్లను పెద్దగా ఎలివేట్ చేయలేకపోవడం
    ఎన్టీఆర్ పాత్రపై కాకుండా చంద్రబాబుపై ఫోకస్ చేయడం
    సినిమాటిక్‌గా ఉండటం
    రీరికార్డింగ్
    పాటలు ఆకట్టుకోలేకపోవడం

    నటీనటులు, సాంకేతికవర్గం

    నటీనటులు, సాంకేతికవర్గం

    నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కల్యాణ్ రాం, సుమంత్, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ తదితరులు
    దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
    నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
    రచన: సాయి మాధవ్ బుర్రా
    సంగీతం: ఎంఎం కీరవాణి
    సినిమాటోగ్రఫి: జానశేఖర్
    ఎడిటర్: అర్రమ్ రామకృష్ణ
    ప్రొడక్షన్ కంపెనీ: ఎన్‌బీకే ఫిల్మ్స్, వరాహి చలన చిత్రం, విబ్రి మీడియా
    రిలీజ్: ఫిబ్రవరి 22, 2019

    English summary
    NTR: Mahanayakudu review and Rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X