వచ్చాడు కానీ... ( 'రామయ్యా వస్తావయ్యా ' రివ్యూ)

By Srikanya

Rating:
2.0/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

"ఏంటిరా రికార్డులు రికార్డులు అని ఎగురుతున్నావు... నిక్కర్లు వేసుకున్న వయస్సులోనే రికార్డులు మడిచి జేబులో పెట్టుకున్న వాడిని " అంటూ 'రామయ్యా వస్తావయ్యా ' కౌంటర్స్ ఇస్తూ వచ్చేసాడు. 'గబ్బర్ సింగ్ ' వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తదుపరి చిత్రం అంటే మంచి అంచనాలే ఉన్నాయి.... అందులోనూ ఎన్టీఆర్ హీరో అంటే మరీనూ.... దాంతో ఈ చిత్రం ఆకాశాన్ని అంటిన ఆ అంచనాలు ను అందుకుందాలేదా అనేది అందరికీ ఆసక్తికరమే. అయితే హరీష్ శంకర్ తన మ్యాజిక్ ఈ చిత్రంలో చూపించలేకపోయారనిపిస్తుంది. ఫస్టాఫ్ ఫన్ తో,ఇంటర్వెల్ ట్విస్ట్ తో సేఫ్ గా నడిచిపోయనా సినిమాకు కీలకమైన సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సోసోగా ఉండి నిరాశకలిగించింది. ముఖ్యంగా హరీష్ శంకర్ ..పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరించటానికి ఎంచుకునే ఎలిమెంట్స్ మీదే దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ గత చిత్రాల కన్నా గ్లామర్ గా కనిపించారు... డైలాగ్ డెలవరీలోనూ ఒక రకమైన ఈజ్ చూపిస్తూ వేరియేషన్ చూపించారు. అలాగే సినిమా మొత్తం ఎన్టీఆర్ భుజాలపైనే నడిచింది.

ముఖేష్ రుషి తన పెద్ద కూతురు పెళ్లి చేయటానికి సన్నాహాలు చేస్తూంటే అతనిపై రైవల్ బ్యాచ్ అజయ్ గ్రూఫ్ ఎటాక్ చేస్తుంది. దాన్ని నుంచి తప్పించుకున్న ముఖేష్ రుషి పెళ్లి కి టైట్ సెక్యూరిటీ పెడతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కాలేజీలో చదువుకుంటున్న నందు(ఎన్టీఆర్) మరో కాలేజీలో చదువుతున్న అమ్మాయి అక్షర (సమంత)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను కూడా ప్రేమలో పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఆమె మొదట కాదన్నా...తర్వాత ఓకే అంటుంది. అంతేకాకుండా తన అక్క పెళ్లికి రమ్మంటుంది. ఇంతకీ సమంత ఎవరో కాదు ముఖేష్ రుషి రెండో కూతురు. ఆ పెళ్లికి వెళ్లిన ఎన్టీఆర్ ఏం చేసాడు. ముఖేష్ రుషి కి ... ఎన్టీఆర్ కి ఏంటి సంభంధం...శృతి హాసన్ పాత్ర ఏమిటి... అనేది మిగతా కథ.

కేవలం ఇంటర్వెల్ ట్విస్ట్ ని నమ్ముకుని చేసిన ఈ చిత్రం కథ కి సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ దెబ్బ కొట్టింది. ముఖ్యంగా దాదాపు ప్రీ క్లైమాక్స్ దాకా ప్లాష్ బ్యాక్ ఉండటంతో అది సాగిన ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు తర్వాత ఏం జరుగుతుందనే ప్రెడిక్టుబులిటీ సెకండాఫ్ లో బాగా ఎక్కువైంది. తర్వాత ఏం జరిగిందేనేది చాలా ఈజీగా ఊహించేలా తయారుచేసారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా లేకుండా పోయింది. ఉన్న కొద్ది జోకులూ పేలలేదు. ఆ మాత్రమైనా చూడగలిగామంటే అది ఎన్టీఆర్ నటనా గొప్పతనమని నిశ్శందేహంగా చెప్పవచ్చు. ఇక హరీష్ శంకర్ నుంచి ఆశించే పంచ్ లు సైతం ఫస్టాఫ్ లో బాగా పేలాయి కానీ...సెకండాఫ్ లో అవీ లేవు. అంతేకాక ఈ రోజుల్లో ఇంకా జమీలు లేని ఈ రోజుల్లో జమీందారు వారసుడు అని ఎన్టీఆర్ ని చెప్పడం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే సినిమాకు హైలెట్ అవుతుందనుకున్న శృతి హాసన్ పాత్ర కూడా తేలిపోయింది.

ఇక సినిమాలో హైలెట్స్ స్లైడ్ షో లో...

ఆ డైలాగ్ సూపర్...

ఆ డైలాగ్ సూపర్...

దుర్యోధనుడు గెటప్ లో కనిపించి..దానవీర శూర కర్ణలో చెప్పే పెద్ద డైలాగుని హీరో ఇంట్రడక్షన్ సీన్ లో చెప్పి అదరకొట్టారు. తన తాతగారి లాగే పౌరాణానిక పాత్రల్లోనూ రాణిస్తాడని చెప్పినట్లైంది. ఈ సీన్ లో ఎన్టీఆర్ ఆహార్యం...డైలాగు చెప్పే తీరు చాలా బాగుంటుంది.

కామెడీ కేక...

కామెడీ కేక...

ప్రస్తుతం ట్రెండ్ గా మారిన కామెడీని కంటిన్యూ చేస్తూ ఎన్టీఆర్ పై ఫస్టాఫ్ మొత్తం కామిడీ ప్లే చేసారు. ఆ సీన్స్ బాగా పేలాయి. ముఖ్యంగా సమంత బామ్మ(రోహిణి హట్టంగిడి)కి, ఎన్టీఆర్ కి మధ్య వచ్చే సీన్స్ బాగా పండాయి. కామెడీలోంచి ఎమోషన్ లోకి ట్రాన్సిక్షన్ బాగా చేసారు.

రొమాన్స్...

రొమాన్స్...

సమంతకు ఎన్టీఆర్ కి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా పాటల్లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఇళయరాజా సాంగ్స్...ని సమంత కనపడినప్పుడల్లా ప్లే చేయటం చాలా బాగుంది.

శృతిహాసన్

శృతిహాసన్

సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే శృతిహాసన్ మనకు ఎన్టీఆర్ గత చిత్రం నరసింహుడు ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసినా...ఆమెపై తీసిన పాట,కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో ఎంటర్టైన్మెంట్ పెంచి, లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది.

టెక్నికల్ గా...

టెక్నికల్ గా...

సాంతేకికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫి చాలా రిచ్ ఫీల్ తీసుకువచ్చింది. పాటల్లో విజువల్స్ కూడా చాలా శ్రద్ద పెట్టి చేసారు. ఎన్టీఆర్ గ్లామర్ ని బాగా ప్రాజెక్టు చేసారు. సమంత క్యూట్ గా ఎప్పటిలాగే ఉంది.

సంగీతం

సంగీతం

థమన్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్ కాదు కానీ ఓకే అనిపించింది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. పాటల్లో నేనెప్పుడైనా కలగన్నానా, జాబిల్లీ నువ్వే... రెండు ఇప్పటికే హిట్టయి ఉన్నాయి. తెరపై కూడా వాటిని బాగా చిత్రీకరించారు.

కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్

కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్

"ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడతీసి కొడతా." అంటూ రాసిన డైలాగు కి థియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ..ఆ డైలాగు సినిమాలో సింక్ కాలేదు. డైలాగు కోసం సీన్ రాసినట్లైంది. నిజానికి హరీష్ శంకర్ బలం డైలాగులు అని మిరపకాయ, గబ్బర్ సింగ్ నిరూపించాయి. దాన్ని కొనసాగిస్తూ ఈ చిత్రంలోనూ వన్ లైనర్స్ ని బాగా పేల్చాడు. ఎమోషన్ డైలాగ్స్ సైతం బాగున్నాయి. హీరో చేత..రికార్డుల గురించి డైలాగ్ చెప్పించి ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించాడు.

మిగతా పాత్రలు...

మిగతా పాత్రలు...

సినిమాలో మిగతా పాత్రలలో ముఖేష్ రుషి పాత్ర బ్యాడ్ ఛాయిస్ అనిపిస్తుంది. ముఖేష్ రుషి అనగానే నెగిటివ్ పాత్ర అనే ఇమేజ్ ఉంది. హీరో అతనికి సాయిం చేయడని అర్దమైపోతుంది. దాంతో ఈ ఎలిమెంట్ ఇంటర్వెల్ ట్విస్ట్ కి పెద్ద కిక్ రాకుండా అడ్డుపడింది. అజయ్ పాత్ర బాగా పేలింది. తణికెళ్ల భరిణి డైలాగు సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేది టప్పట్లు కొట్టించింది. విలన్ రవి శంకర్ పాత్ర కూడా బిల్డప్ కే గానీ పెద్దగా ఉపయోగపడలేదు.

డాన్స్ లు...

డాన్స్ లు...

ఎన్టీఆర్ సినిమా అంటే డాన్స్ లు ఆశిస్తారు. ఆ విషయంలో చిత్రం నిరాశపరచదు. ఎన్టీఆర్ తన శక్తి మేరకు వైవిధ్యైమైన స్టెప్స్ తో అలరించే ప్రయత్నం చేసాడు. శృతి,సమంతలతో ఫెరఫెక్ట్ జోడి అనిపించాడు.

టీమ్ లో ...ఎవరెవరు...

టీమ్ లో ...ఎవరెవరు...

నటీనటులు : జూ.ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్, రావు రమేష్, కోటశ్రీనివాసరావు, ముఖేష్‌ రుషి, తనికెళ్ల భరణి, ప్రగతి, అజయ్, భరత్, రవిశంకర్‌ తదితరులు
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్,
నృత్యాలు : దినేష్, గణేష్, శేఖర్ బాను,
పాటలు : సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి,
సంగీతం : థమన్,
ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు,
కూర్పు: గౌతంరాజు,
కళ: బ్రహ్మ కడలి,
స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్,
పోరాటాలు: కనల్‌ కణ్ణన్‌.
సహ నిర్మాతలు : శిరీష్- లక్ష్మణ్,
కథ, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్.
నిర్మాత: దిల్‌ రాజు

"తను 100 కి ప్రిపేర్ అయ్యి...99 తెచ్చుకుంది ...నేను పాస్ మార్క్ 36 కి ప్రిపేర్ అయ్యి...37 తెచ్చుకున్నాను...కనుక నేనే గొప్ప " వంటి చిత్రమైన లాజిక్ తో కూడిన ఫన్

డైలాగ్స్ తో వచ్చిన ఈ చిత్రం డైలాగ్స్,పాటలు పరంగా ఓకే అనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ నుంచి ఆశించే రేంజిలో ఈ చిత్రం లేదనే చెప్పాలి.

కథ,కథనం ఇవ్వన్నీ ప్రక్కన పెడితే పాటలు బాగున్నాయి..ఎంజాయ్ చెయ్యచ్చు....ఫస్టాఫ్ లో కామెడీ బాగుంది కాస్సేపు నవ్వుకోవచ్చు అనుకుంటే ఈ చిత్రం ఓ ఛాయిస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X