twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇవివి ఫ్యామిలీ సినిమా

    By Staff
    |

    Nuvvante Naakistam
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: నువ్వంటే నాకిష్టం
    విడుదల తేదీ: 12-8-2005
    నటీనటులు: ఆర్యన్‌ రాజెష్‌, అల్లరి నరేష్‌, అనూ మెహతా,
    సుమన్‌, చంద్రమోహన్‌, చలపతిరావు, తులసి, భువనేశ్వరి,
    ఎల్బీ శ్రీరాం, అలీ, మల్లికార్జునరావు, కృష్ణభగవాన్‌,
    కొండవలస, లక్ష్మీపతి, సంగీత, హేమ తదితరులు
    సంగీతం: కోటి
    మాటలు: వేగేశ్న సతీష్‌
    కెమెరా: వి శ్రీనివాసరెడ్డి
    కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: ఇవివి సత్యనారాయణ

    దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఫ్లాపుల పరంపర నుండి తనను, తన కొడుకులిద్దరినీ బయటపడేయడానికి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి తరహా ముక్కోణపు ప్రేమ కథలు మనకి కొత్తేమీ కాదు. ఈ ప్రేమ కథకు గ్రామీణ నేపధ్యం ఎంచుకోవడం, హాస్య సన్నివేశాలపై మంచి పట్టు ఉండడం ఈ చిత్రాన్ని విజయ పథం వైపు నడిపిస్తాయి.

    అమెరికాలో ఉంటున్న కోటీశ్వరుడు యువరాజు ( ఆర్యన్‌ రాజేష్‌). నానమ్మ సంరక్షణలో పెరుగుతున్న యువ ఆమె సలహాపై పెళ్ళికి తెలుగు అమ్మాయిలే ఉత్తమమని నిర్ణయించుకుంటాడు. పెళ్ళిళ్ళ బ్రోకరు శాస్త్రి ఎమ్మెస్‌ను కలిసి ఫోటోలు తీసుకుంటాడు. అందులో హీరోయిన్‌ అను మెహతా ఫోటో చూసి ఇష్టపడతాడు. పెళ్ళిచూపులకు ఇండియాలోని కోరుమామిడికి వస్తాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆమె తనని ఇష్టపడడం లేదని వేరే వాళ్ళతో ప్రేమలో పడిందని తెలుసుకుని ఆమె తండ్రిని కలుసుకుని ఆమె తండ్రిని నిలదీస్తాడు. ఆమె తండ్రి సుబ్బయ్య చౌదరి (సుమన్‌) అసలు విషయం చెబుతాడు.

    హీరోయిన్‌ను ప్రేమించిన కుర్రాడు డబ్బు సంపాదించడానికి వెళ్ళి దొంగతనం చేసి, తప్పించుకుంటూ లారీ కింద పడి మరణించాడని చౌదరి చెబుతాడు. ఈ విషయం కూతురికి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదంటాడు. యువ ఆమెకు ఆ సత్యాన్ని చెబుతాడు. ఆమె తట్టుకోలేదు. యువ అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు. అయినా ఆమె ఆమె ప్రేమలో పడిన అతను ఆమెను ఒప్పించి పెళ్ళి చేసుకుందామని ఇండియాకు బయలుదేరుతాడు. ప్రయాణంలో దేముడు (అల్లరి నరేష్‌) పరిచయమవుతాడు. హీరోయిన్‌ ప్రేమించిన అతను నిజానికి చనిపోడు. అతని అమాయకత్వం నచ్చిన యువ అతని ఫ్లాష్‌బ్యాక్‌ అడుగుతాడు. దేముడు ఎవరో కాదు, హీరోయిన్‌ ఇంట్లో పాలేరు. హీరోయిన్‌ ప్రేమలో పడిన అతను సింగపూర్‌లో డబ్బు సంపాదించి బయలుదేరి వస్తున్నాడు. సుబ్బయ్య చౌదరి అబద్ధం ఎందుకు చెప్పాడు? ఇంతకీ హీరోయిన్‌కు అసలు విషయం ఎలా తెలుస్తుంది? ఆమె ఎవరిని చేసుకుంటుంది అన్నది తెర మీద చూడాల్సిందే.

    ఇవివి తరహా గ్రామీణ ముతక హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాలేరు వీరబాబుగా సత్యం రాజేష్‌, బిందెల బాబూరావుగా ఎల్బీ శ్రీరాం, మోడ్రన్‌ పెళ్ళి బ్రోకర్‌గా ఎమ్మెస్‌ నారాయణ, సెకండ్‌ సెటప్‌ పెట్టే కృష్ణ భగవాన్‌ పూర్తి స్ధాయిలో కామెడీని పండించారు. ముఖ్యంగా సెల్‌ ఫోన్లపై కామెడీ చాలా బాగుంది. సాధారణ ముక్కోణపు ప్రేమ కథను 'భాషా' తరహా స్క్రీన్‌ప్లేని తెలివిగా తయారు చేశారు. ఫస్టాఫ్‌లో అర్యన్‌ క్లాస్‌ ప్రేమికుడిగా, సెకండాఫ్‌లో అల్లరి నరేష్‌ మాస్‌ లుక్‌తో ప్రేమను పండించారు. 'నీ నవ్వు పూలవనం, తేనెల్లో తియ్యదనం' పాట , 'ఎందుకీ పరువం పరుగులిప్పుడు' పాట బాగున్నాయి. సినిమా సాంకేతికంగా గొప్పగా లేకపోయినా దర్శకుడు కథను పరుగులు పెట్టించగలిగారు. బ్యాక్‌గ్రౌండులో సందర్భానికి అనుగుణంగా సంప్రదాయ కీర్తనలు విన్పించడం బాగుంది.

    కథకి కీలకమైన పాలేరు పెద్దింటి అమ్మాయి ప్రేమలో పడడానికి దారి తీసిన చనువు సన్నివేశాలు కృత్రిమంగా ఉన్నాయి. వయసులో ఉన్న కూతురిని పాలేరుతో అంతగా రాసుకుని పూసుకుని తిరగడాన్ని ఏ కుటుంబం హర్షించదు. అప్పటి వరకు తన ప్రేమను బతికించుకోడానికి కష్టపడ్డ నరేష్‌ ఒక్క డైలాగుతో అపరిచితుడి కోసం ప్రేమను త్యాగం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సినిమాలో సెంటిమెంట్‌, హాస్యం గ్రామీణ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X