twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ తరపు ప్రేమకథ చిత్రం

    By Staff
    |

    Nuvvekavali
    చిత్రం: నువ్వే కావాలి
    నటీనటులు: తరుణ్‌, రిచాశర్మ, సాయికిరణ్‌, ఎం.ఎస్‌.నారయణ
    మాటలు: త్రివిక్రమ్
    సంగీతం: కోటి
    కెమెరా: హరిఅనుమోలు
    సహనిర్మాత: రవికిషోర్
    నిర్మాత: రామోజీరావు
    దర్శకత్వం: విజయ్‌ భాస్కర్

    పరభాషలో రూపొందిన చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీయడం కొంచెం కష్టమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్కడో ఒక చోట లోపం ఉంటూనే ఉంటుంది. కానీ ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ రూపొందించిన తాజా చిత్రం నువ్వే కావాలిలో అలాంటి లోపాలేవీ లేవు. మళయాళంలో సూపర్‌ హిట్‌ అయిన నిరమ్‌ చిత్రం ఈ చిత్రానికి మాతృక. కొత్త నటీనటులను ఎంపిక చేసుకొని తెలుగు వాతావరణం ప్రతిబింబించేలా నువ్వేకావాలి చిత్రాన్ని రూపొందించడంలో దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ విజయం సాధించాడు. కథ కొత్తదేమీ కాకపోయినా, హాస్యం జోడించడంతో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

    తరుణ్‌, రీచా చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఎదురెదురు ఇళ్లలో ఉండే వీరి మధ్య ఎటువంటి రహస్యాలు లేవు. కాలేజ్‌ కి చదువులకు వచ్చినా వీళ్ళ అల్లరికి హద్దు అనేది ఉండదు. కాలేజ్‌ లో కొత్తగా జాయినైన సాయికిరణ్‌ రిచా పట్ల ఆకర్షితుడవుతాడు. అదేవిధంగా తరుణ్‌ పట్ల ప్రేమను పెంచుకుంటుంది మరో అమ్మాయి మాధవీశ్రీ. రిచాతో తనది కేవలం స్నేహమని ప్రేమకాదని సాయికిరణ్‌ కు తరుణ్‌ చెపుతాడు. అయితే అనుకోకుండా వారం రోజులు ఆమెను విడిచి ఉండాల్సి రావడంతో అనీజీ ఫీలవుతాడు. తనది స్నేహం కాదని ప్రేమని గ్రహిస్తాడు. కానీ ఈ విషయం చెపితే తమ మధ్య స్నేహం దెబ్బతింటుదని తన ప్రేమను మనసులోనే దాచుకుంటాడు.

    మరో వైపు ప్రకాష్‌ తనను ప్రేమిస్తున్నట్లు రిచా చెపుతుంది తరుణ్‌ కు. తరుణ్‌ సలహా అడుగుతుంది. ఇష్టం ఉంటే ప్రొసీడ్‌ కావాల్సిందిగా సలహా ఇస్తాడు. దాంతో ప్రకాష్‌, రిచాలకు నిశ్చితార్ధం జరుగుతుంది. కానీ ఆమె మనసు మాత్రం తరుణ్‌ వైపే లాగుతుంటుంది. తాను అతన్ని ప్రేమిస్తున్నట్లు గ్రహిస్తుంది. చివరికి ఇద్దరు స్నేహితుల-కమ్‌-ప్రేమికులు ఒకటవడంతో చిత్రం ముగుస్తుంది.

    కథలో ఏమీ కొత్తదనం లేకున్నా కథకు తగ్గట్లు బలమైన సన్నివేశాలను అల్లడం వల్ల నువ్వే కావాలిలో కొత్తదనం కన్పిస్తుంది. ఎం.ఎస్‌.నారయణ పండించిన హాస్యం, కోటి సంగీతం ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌. చాలా కాలం తర్వాత కోటి మెలోడియస్‌ సంగీతం అందించాడు. హీరో, హీరోయిన్‌ లు కొత్తవాళ్ళే ఐనా నటనలో పరిణతి ఉండడం విశేషం. అనేక చిత్రాల్లో బాలనటుడిగా నటించిన తరుణ్‌ హీరోగా నటించడం ఇదే మొదటిసారి. ఐతే సాయికిరణ్‌ ఇంకా రాటుదేలాల్సి ఉంది. స్వయంవరం చిత్రంతో రంగప్రవేశం చేసిన దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ కు మరో సక్సెస్‌ ను తెచ్చిపెట్టే చిత్రం ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X