Nuvvu Naaku Nachav Re Release Review: నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, సుహాసిని, చంద్రమోహన్, సునీల్, ఆశా సైనీ, పృథ్వీ, సిజ్జు, తనికెళ్ల భరణి, బ్రహ్మనందం, ఎంఎస్ నారాయణ, హేమ తదితరులు
దర్శకత్వం: కే విజయ భాస్కర్
నిర్మాత: స్రవంతి రవికిషోర్
సినిమాటోగ్రఫి: కే రవీంద్రబాబు
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: కోటి
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
రిలీజ్ డేట్: 2001-09-06
రీ రిలీజ్ డేట్: 2026-01-01

అనకాపల్లికి చెందిన వెంకీ అలియాస్ వెంకటేశ్వర్లు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు. వెంకీ తండ్రి శేఖర్ (చంద్రమోహన్) హైదరాబాద్‌లోని తన స్నేహితుడు శ్రీనివాస మూర్తి (ప్రకాశ్ రాజ్) వద్దకు పంపుతాడు. అప్పటికే మూర్తి కూతురు నందు అలియాస్ నందినికి ఎన్నారై (సిజ్జు)తో నిశ్చితార్థం జరుగుతుంది. అయితే వెంకీతో పరిచయం నందుని ప్రేమలో పడేలా చేస్తుంది. అయితే తన మూర్తితో తన తండ్రి స్నేహం చెడిపోకూడదని నందూ ప్రేమను నిరాకరించేందుకు ప్రయత్నిస్తుంటాడు.

మూర్తి ఇంటికి వచ్చిన తర్వాత వెంకీ చేసిన సందడి ఏమిటి? ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా వెంకీకి నందూ చేరువ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? నందూ ప్రేమను నిరాకరించడానికి ప్రయత్నించే క్రమంలో వెంకీ పడిన మానసిక సంఘర్షణ ఏమిటి? నందూ తన ప్రేమను గెలిపించకొన్నదా? నందూ, వెంకీ ప్రేమ విషయం తెలిసి మూర్తి రియాక్షన్ ఏమిటి? నందూ పెళ్లి ఎన్నారైతో జరిగిందా? తండ్రి స్నేహం కోసం వెంకీ తన ప్రేమను త్యాగం చేశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే నువ్వు నాకు నచ్చావు సినిమా కథ.

Nuvvu Naaku Nachav Re Release Review

2001 సంవత్సరంలో రిలీజైన ఈ చిత్రం అనూహ్యమైన విజయాన్ని బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకొన్నది. ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్ ఇప్పటికీ మీడియాలోను, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గానే ఉంటాయనే విషయం ఈ మూవీకి ఉన్న ఆదరణ, గొప్పతనాన్ని తెలియజేస్తాయి. అలాంటి చిత్రాన్ని మరోసారి ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేయడానికి, వారిలో గొప్ప అనుభూతిని పంచడానికి నిర్మాత స్రవంతి రవికిషోర్.. ప్రస్తుత టెక్నాలజీ 4K, డాల్బీ అట్మాస్ లాంటి సాంకేతిక అంశాలను అద్ది ఈ సినిమాను అందమైన పెయింటింగ్ క్వాన్వాస్‌లో తెరపైకి తెచ్చారు.

అయితే లేటేస్ట్ టెక్నాలజీతో నువ్వ నాకు నచ్చావ్ సినిమా చూస్తుంటే కళ్లు తిప్పుకోలేనంతగా కలర్‌ఫుల్‌గా సన్నివేశాలు కనిపించాయి. సౌండ్ విషయంలో తీసుకొన్న శ్రద్ద, డీఐతో సన్నివేశాలకు సరికొత్తగా జీవం పోశారా? అనే విధంగా అనిపిస్తాయి. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఎన్నోసార్లు విని ఉన్నప్పటికీ.. తెర మీద చూస్తుంటే.. వింటుంటే.. మళ్లీ కొత్తగా అనిపించాయి. అనుక్షణం వినోదం అందిస్తూనే, కథలోని భావోద్వేగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ సినిమా లేటేస్ట్ మాస్టరింగ్ ప్రాసెస్ బ్రిల్లియెంట్‌గా ఉంది. కొత్త సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలిగించింది.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సిరివెన్నెల రాసిన పాటలు, త్రివిక్రమ్ చేసిన మాటల మ్యాజిక్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందే ఏమీ ఉండదు. కానీ ఈ సినిమా కోసం ఉపయోగించిన క్యాస్టూమ్స్ ఇప్పటి ట్రెండ్‌కు తగినట్టుగా ఉండటం ఈ చిత్ర యూనిట్ దూరదృష్టికి అద్దం పట్టింది. పాటలు చిత్రీకరించిన లొకేషన్లు, పాటల కోసం డిజైన్ చేసిన కాన్సెప్ట్‌ ఇంకా కొత్తదనం ఉట్టిపడేలా చేసింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, కోటి మ్యూజిక్ ఈ సినిమా మాస్టర్ పీస్‌లా మార్చింది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ ఈ తరం నిర్మాతలకు విజన్ డాక్యుమెంట్‌లా ఉన్నాయనిపిస్తుంది.

ఫైనల్‌గా ఈ సినిమాలోనే పాత్రలు తెర మీద నటించాయనే కంటే.. ఫ్యామిలీలో మన కుటుంబ సభ్యులు, బంధువులు బిహేవ్ చేసేలా ఉంటాయి. వెంకటేష్, ఆర్తీ ఆగర్వాల్ మధ్య కెమిస్ట్రీ, సున్నితమైన రొమాన్స్, చిలిపిగా కయ్యాలు, సయ్యాటలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతాయి. ఈ సినిమా నేటి ప్రమాణాలకు తగిన సాంకేతిక అంశాలతో మళ్లీ కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి అనుభూతినే కాకుండా ఉల్లాసాన్ని, వినోదాన్ని అందిస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న రిలీజైన ఈ సినిమా మీ దగ్గర్లోని థియేటర్‌లో తప్పకకుండా చూడండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X