twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునకు హిట్‌ను తెచ్చే 'నువ్వు వస్తావని'

    By Staff
    |

    Nuvvu vastavani
    -సౌమిత్‌
    చిత్రం: 'నువ్వు వస్తావని'
    నటీనటులు: నాగార్జున, సిమ్రాన్‌, కోట శ్రీనివాసరావు
    సంగీతం: ఎస్‌.ఎ. రాజ్‌కుమార్‌
    నిర్మాత: ఆర్‌.బి.చౌదరి
    దర్శకత్వం: ప్రతాప్‌

    చాలారోజుల తర్వాత నాగార్జునకు హిట్‌ లభించే చిత్రంగా 'నువ్వు వస్తావని' ని అభివర్ణించొచ్చు. కథలో కొత్తదనం లేకపోయినా, కథనంలో నూతనత్వం వల్ల చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్స్‌ తారసపడ్డప్పుడల్లా అల్లిన సన్నివేశాలు కథను ఎలివేట్‌ చేసే విధంగా, కొత్తగా ఉండటంతో సినిమా పట్టుగా నడుస్తుంది. ప్రధమార్ధభాగం సాఫీగా నడిచి ద్వితీయార్ధంలో సుమారు అరగంటకు పైగా స్లోగా ఉండడంతో కొద్దిసేపు బోర్‌ కొట్టిస్తుంది. అయితే క్లయిమాక్స్‌కు చేరేకొద్ది ప్రేక్షకులు సినిమాలో లీనమైపోయేలా నూతన దర్శకుడు ప్రతాప్‌ సఫలీకృతులయ్యారు. ప్రారంభంలో కోట శ్రీనివాసరావు మందోపాఖ్యానం, ఆలీ పాత్రను మలిచిన తీరు హాస్యాన్ని గుమ్మరించాయి.

    ఇక కథ విషయానికి వస్తే... చిన్నికృష్ణ (నాగార్జున) సంగీత ప్రియుడు. గాయకుడు కావాలనే ఆశతో పట్నానికి వచ్చి అవకాశాలు కోసం ఎదురుచూస్తూ ఓ బస్తీలో కేబుల్‌ టీవీ కనెక్షన్స్‌ కాంటాక్ట్‌ తీసుకుంటాడు. అతని స్నేహితులు సుధాకర్‌, శివాజీరాజా, ఆలి. కాలేజీలో చదువుకోవడానికి వచ్చిన సిమ్రాన్‌ బస్తీలోని పక్కవీధిలో అద్దెకు ఉంటూ చిన్ని గానాన్ని విని అభిమానిగా మారుతుంది. కానీ చిన్నిని మాత్రం ప్రత్యక్షంగా చూడలేకపోతుంది.

    నాగార్జున, ఆమె ఎదురుపడ్డ ప్రతిసారి ఆమె దృష్టిలో అతనో రౌడీగా ముద్ర పడే సన్నివేశాలు ఎదురవుతుంటాయి. కాలేజీలో తన పాటని ఆమె పాడుతున్న సందర్భంగా కాంపౌండ్‌వాల్‌ ఎక్కి లేడీస్‌ బాత్‌రూం పైగుండా చూస్తూ ఆ పాటతో లీనమైపోయిన సందర్భం కూడా అందులో ఒకటి. తనలోని గాయకుణ్ణి ఆమె ఆరాధిస్తూ, అభిమానిస్తోందని తెలిసీ ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వల్ల తానే చిన్నిని అని చెప్పలేకపోతాడు. సూర్య అనే జులాయి ఫ్రెండ్‌ మూలంగా ఆమె దృష్టిలో కృష్ణగా మిగిలిపోతాడు చిన్ని కృష్ణ. తన తల్లికి డబ్బు పంపబోతున్న తరుణంలో ఆ పర్సును దొంగిలించిన వ్యక్తిని తరుముకుంటూ మహిళా కాలేజ్‌లోకి ఎంటరై లేబరేటరీలో యాసిడ్‌ బాటిల్‌తో టెస్ట్‌లు చేసుకుంటున్న సిమ్రాన్‌ తగలటం ఆ బాటిల్‌ బ్రద్దలై తద్వారా ఆమె కళ్ళను పోగొట్టుకోవడం జరుగుతుంది.

    తన ద్వారా ఆమె కళ్ళను పోగొట్టుకుందని తెలిసి వ్యధ చెందుతున్న హీరో ఆమెకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని తట్టుకోలేక ఇంటికి తీసుకువస్తాడు. చిన్నిగా భావించిన హీరోయిన్‌ కూడా అందుకు అభ్యంతరం చెప్పదు. తెలిసిన డాక్టర్‌ ద్వారా మరుసటిరోజే ఊరెళుతున్న ఆస్ట్రేలియాకు చెందిన కంటి డాక్టర్‌ ఉన్నాడని తెలిసి ఆమెను చూపించడానికి హీరో సిద్ధమవుతున్న తరుణంలో ఊర్లో అమ్మ చనిపోయిందని టెలిగ్రామ్‌ వస్తుంది. గుండె దిటవు చేసుకున్న హీరో ఆమెను డాక్టర్‌కి చూపిస్తే ఆపరేషన్‌ తప్ప మరో మార్గం లేదంటాడు. అక్కడినుంచి ఊరెళ్లేసరికి చివరి చూపు దక్కకుండానే తల్లి అంత్యక్రియలు జరిగిపోతాయి. ఎప్పటికప్పుడు తన సంగతులన్నింటినీ ఉత్తరాల ద్వారా తల్లికి తెలియచేస్తుండడం వల్ల ఆమె చనిపోయేముందు తన కళ్ళను సిమ్రాన్‌కు డొనేట్‌ చేస్తుంది.

    అయితే ఆపరేషన్‌కు లక్ష రూపాయలు అవసరమవడంతో కిడ్నీని అమ్మటానికి సిద్ధపడతాడు-హీరో. ఆపరేషన్‌కు అన్నీ సిద్ధం చేసి కిడ్నీ దానం చెయ్యటానికి పూనా వెళతాడు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే తిరుగు ప్రయాణం అయిన హీరోకి స్టేషన్‌లో సూట్‌కేస్‌ను చూస్తుండమని ఓ వ్యక్తి చెప్పి వెళతాడు. అందులో బాంబు ఉందని పోలీస్‌కుక్కలు పసిగట్టడంతో అది తనది కాదని ఎంత మొత్తుకున్నా వినని పోలీస్‌వారు అరెస్ట్‌ చేయడంతో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఆ శిక్షను పూర్తి చేసుకున్న తర్వాత ట్రైన్‌లో వస్తుండగా మొత్తాన్ని ఫ్లాష్‌బ్యాక్‌ రూపంలో చెబుతారు హీరో. ఊళ్ళోకి అడుగుపెట్టిన తర్వాత రూపురేఖలు మారిన కాలనీని పోల్చుకోలేక పోతున్న తరుణంలో కలెక్టర్‌ అయిన హీరోయిన్‌ కారులో కన్పిస్తోంది. ఆ కారు వెంట వెళ్ళిన అతనిని కృష్ణగా భావించి పోలీస్‌లతో కొట్టిస్తుంది. కోట జోక్యంతోను, ట్రైన్‌లో కథను విన్న స్టూడెంట్స్‌ పాటతోను కృష్ణే చిన్ని అని తెలుసుకుని ఇద్దరూ ఏకం కావడంతో చిత్రం ముగుస్తుంది.

    ఈ చిత్రానికి జీవం పోసింది సంగీత దర్శకుడు యస్‌.ఏ.రాజకుమార్‌ అని చెప్పవచ్చు. రీరికార్డింగ్‌ పరంగా ఆయన తీసుకున్న జాగ్రత్తే సినిమాను చాలావరకు నిలబెట్టింది. ప్రేక్షకుల్ని వెంటాడేలా మధురమైన సంగీతాన్ని అందించారు. 'కలలోనైన అనుకోలేదు నువ్వు వస్తావని' 'పాటల పల్లకివై' వంటి పాటలు పదే పదే వినాలనిపించేలా వున్నాయి. డైలాగ్స్‌ విషయంలో రచయిత మరుధూరి రాజా అక్కడక్కడా మెరుపులు మెరిపించినా ఆద్యంతం కొనసాగించడంలో విఫలం అయ్యాడు. నటీనటులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకు కీలకమైన రెండు సన్నివేశాల్లో నాగార్జున నటన పేలవంగా ఉంది. అందులో ఒకటి తన మూలంగా కథానాయకి కళ్ళు పోగొట్టుకుంది అన్న విషయం తెల్సినపుడు, రెండు హాస్పిటల్‌కి వెళుతూ తల్లి చనిపోయిందని తెలిసి బాత్‌రూమ్‌లో ఏడ్చే సన్నివేశం. నాగార్జున నుంచి సరైన నటనను దర్శకుడు రాబట్టలేకపోయాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X