హాయిగొలిపే చిత్రం!

By Staff

 Nuvvu Leka Nenu Lenu
- జలపతి
నటీనటులు: తరుణ్‌, ఆర్తి ఆగర్వాల్‌, లయ, చంద్రమోహన్‌,
శరత్‌ బాబు, కిరణ్‌ రాథోడ్‌, విశ్వనాథ్‌
సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
మాటలు: పరుచూరి బ్రదర్స్‌
నిర్మాత: డి. సురేష్‌బాబు
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వై.కాశీవిశ్వనాథ్‌

ఫీల్‌ గుడ్‌ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అంతా మనమంచికే అనిపించే ఇలాంటి చిత్రాలు హాయిగా చూడడానికి బాగుంటాయి. వినోదమే ప్రధానమైన ఇలాంటి చిత్రాల కోవలో మరో చిత్రం - నువ్వు లేక నేను లేను. ఆద్యంతం ఆహ్లాదంగా చూడగలిగేలా రూపొందించడం ఈ చిత్రం ప్రత్యేకత. ప్రేక్షకుడ్ని ఏ మాత్రం నిరాశపర్చదు. కుటుంబంతో హాయిగా వీక్షించొచ్చు. సాధారణ ప్రేమకథకు ఒకింత ట్విస్ట్‌ ను జోడించి నూతన దర్శకుడు వై.కాశీనాథ్‌ అందంగా తీర్చిదిద్దాడీ చిత్రాన్ని. ఆర్‌.పి.పట్నాయక్‌ మధురమైన సంగీతం మరో ఎస్సెట్‌. పాటలు, చిలిపితనం, మరికొంచెం కామెడీతో చిత్రాన్ని మొత్తం నడపడంతో బోర్‌ కొట్టదు.

సినిమా ప్రారంభంలోనే మనకు తెలిసిపోతుంది- తరుణ్‌, ఆర్తి పెళ్ళి చేసుకుంటారని. కానీ మధ్యలో చిన్న, చిన్న ట్విస్ట్‌ లు, పాటలు పెట్టి కొత్త తరహాలో రూపొందించాడు. గుణశేఖర్‌ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రఫర్‌ శేఖర్‌ వి.జోసెఫ్‌ చిత్రీకరించిన కేరళ అందాలు ప్రేమకథ మూడ్‌ కు సరిపోయాయి.

శరత్‌ బాబు, చంద్రమోహన్‌ ఇద్దరూ మంచి మిత్రులు. బిజినెస్‌ పార్టనర్స్‌. వీరి పిల్లలే తరుణ్‌, ఆర్తి. వీరిద్దరికీ పెళ్ళి చేయాలని వారు అనుకుంటారు. కానీ తరుణ్‌, ఆర్తికి ఇష్టం ఉండదు. దాంతో తరుణ్‌ కు వేరే సంబంధం చూస్తారు. లయతో సంబంధాన్ని కుదురుస్తారు. కానీ తర్వాతే వీరి ఇద్దరూ ప్రేమలో పడుతారు. చివరికి వీరిద్దరికీ ఎలా పెళ్ళి అవుతుందనేది మిగతా కథ.

తరుణ్‌ ఈ చిత్రంలో చాలా అందంగా ఉన్నాడు. చక్కగా నటించాడు కూడా. నువ్వు నాకు నచ్చావ్‌ చిత్రంలో కన్నా ఈ చిత్రంలోనే ఆర్తి బాగుంది. లయ, కిరన్‌ రాథోడ్‌ పాత్రలు చాలా చిన్నవి. బ్రహ్మనందం కామెడీ బాగుంది. ముఖ్యంగా Co2 కచేరి కడుపుబ్బ నవ్విస్తుంది. పాటలు ఈ చిత్రానికి ప్రాణం. అన్ని పాటలు బాగున్నాయి. మరోసారి ఆర్పీ తన ప్రతాపాన్ని చూపించాడు. సురేష్‌ ప్రోడక్షన్స్‌ సంస్థ చిత్రంలో ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన కాశీవిశ్వనాథ్‌ తొలి చిత్రంతోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X