సాధారణ చిత్రం!

By Staff

Nuvvu Naku Nachhavu
-జలపతి
చిత్రం: నువ్వు నాకు నచ్చావ్‌
నటీనటులు: వెంకటేష్‌, ఆర్తి ఆగర్వాల్‌, ఆశాషైనీ,
చంద్రమోహన్‌, ప్రకాష్‌ రాజు, సుహాసిని..
సంగీతం: కోటి
కథ, మాటలు: త్రివిక్రమ్‌
నిర్మాత: స్రవంతి రవికిషోర్‌
దర్శకత్వం: కె.విజయభాస్కర్‌

చిరునవ్వుతో చిత్రాన్ని తిరగేసి కొద్దిగా అటు, ఇటుగా మార్చేసి తీసిన చిత్రం-నువ్వు నాకు నచ్చావ్‌. నువ్వేకావాలి టీం చేసిన ఈ రెండో ప్రయత్నం అతి సాధారణంగా ఉంది. చాలా సందర్భాల్లో నవ్వించే ఈ చిత్రంలో కొత్తదనం మాత్రం లేదు. అంతా పాత సీన్‌ లే, పాత జోక్‌ లే. ప్రేమతో తర్వాత వెంకటేష్‌ చేసిన మరో తప్పటడుగు. కథ, మాటల రచయిత త్రివిక్రమ్‌ అన్యోపదేశంగా ఇచ్చిన ఉపదేశాలు, కొంత సెంటిమెంట్‌ చిరాకు పుట్టిస్తాయి. అంతేకాకుండా త్రివిక్రమ్‌ ప్రాస కోసం అతిగా ప్రయాస పడ్డాడు. కథ, కథనంలో వెరైటీ లేకున్నా, అక్కడక్కడా ఉన్న కామెడీ అతిపెద్ద రిలీఫ్‌.

వెంకీ అనకాపల్లిలో డిగ్రీ పూర్తిచేసుకొని హైదరాబాద్‌ వస్తాడు. అక్కడ ఆవారాగా తిరుగుతున్నాడని వెంకీ నాన్న(చంద్రమోహన్‌) తన ఫ్రెండ్‌(ప్రకాష్‌ రాజ్‌) దగ్గరికి పంపిస్తాడు. ప్రకాష్‌ రాజ్‌ కూతురు ఆర్తి. ఈమెకు వేరే అబ్బాయితో పెళ్ళి సెటిల్‌ అవుతుంది. కానీ వెంకీ తన పాటలతో, నవ్వులతో ఈమె మనసును దోచుకుంటాడు. ఎంగేజ్‌ మెంట్‌ అయ్యాక కూడా ఆర్తి వెంకీ ప్రేమలో పడుతుంది. తన తండ్రి, ప్రకాష్‌ రాజ్‌ ల మధ్య స్నేహం చెడిపోతుందని వెంకీ ఈ ప్రేమను ఒప్పుకోడు. ఐనా ఆర్తి ప్రేమిస్తూనే ఉంటుంది. కొన్ని ఉత్కంఠ కలిగించినట్లు అనిపించే సీన్స్‌ తర్వాత వీరిద్దరికి పెళ్ళి అవతుంది.

సుహాసిని అనవసరమైన క్యారక్టర్‌ ఈ చిత్రంలో. దానికితోడు ఆమె చేత పుట్టింటి గొప్పతనం, ఆడవారి మనసు అంటూ డైలాగ్‌ ల మీద డైలాగ్‌ లు చెప్పించడం శుద్ద దండగ. 'ప్రేమ ఎప్పుడు కలుగుతుందో, ఎందుకు కలుగుతుందో' అన్న చిరునవ్వుతో లోని డైలాగ్‌ లు ఇందులోనూ ఉన్నాయి. ఆ చిత్రంలో పెళ్ళి సెటిల్‌ అయిన హీరోయిన్‌ ను హీరో ప్రేమిస్తే, ఇందులో ఆ పని హీరోయిన్‌ చేస్తుంది.

వెంకీ నటన సాధారణం. కోటి సంగీతం ఫర్వాలేదు. బ్రహ్మనందం కామెడీ, బాబూమోహన్‌, మల్లికార్జున్‌ రావు పాత్రలు సినిమా కథనానికి అవసరం లేనివి. సినిమా విడుదలకు ముందు దర్శక, నిర్మాతలు చెప్పినట్లుగా ఇందులో వెంకీ నటన సూపర్బ్‌ గా లేదు. అలాగే రీరికార్డింగ్‌ కూడా అతి సాధారణమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X