twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో టీనేజ్‌ ప్రేమకథ

    By Staff
    |

    Nuvvu Nenu
    -జలపతి
    చిత్రం: నువ్వు-నేను
    నటీనటులు: ఉదయ్‌ కిరణ్‌, అనిత, తనికెళ్ళభరణి, తెలంగాణశకుంతల..
    సినిమాటోగ్రఫీ: రసూల్‌
    సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
    నిర్మాత: కిరణ్‌
    కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: తేజ

    ప్రేమకథలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయనడానికి నువ్వునేను ఉదాహరణ. తరాలుగా అందరికీ తెలిసిన ప్రేమకథను కొత్తగా చెప్పడంతో బాగుందనిపిస్తుందీ చిత్రం. పేద, ధనిక అంతరం ఆధారంగా రూపొందించిన టీనేజ్‌ ప్రేమకథ ఇది. ప్రేమించుకునే దృశ్యాల కన్నా హీరో, హీరోయిన్లు విడిపోయి కలిసేదానిమీదే కథనం అంతా నడవడంతో ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు తేజ(తెలంగాణ విషయంలో ఆయన ఇమెచ్యురిటీని పక్కన పెడితే) ఈ చిత్రాన్ని బోర్‌ కొట్టకుండా, ప్రేక్షకులు లీనమయ్యేలా చిత్రీకరించాడు. రాంగోపాల్‌ వర్మ మాదిరిగానే స్టైలిస్‌ గా తేజ ఈ చిత్రాన్ని తీశాడు. హైదరాబాద్‌ లోని సందులగొందులలో పరుగెత్తె దృశ్యాలు, అనేక హిందీ సినిమాల స్క్రీన్‌ ప్లే, అన్నింటిని కలగలపి తీసినప్పటికీ సినిమా పాతగా ఉంది అనిపించకపోవడం విశేషం.

    టెక్నికల్‌ గా, ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంబంధించినంతవరకూ ఈ చిత్రం మంచి చిత్రం అనే చెప్పొచ్చు. అయితే ఈ చిత్రంలో ఉన్న అతిపెద్ద లోపం ఏమిటంటే తెలంగాణ శకుంతల క్యారెక్టర్‌. ఈ చిత్రానికి అవసరం లేని క్యారెక్టర్‌ ద్వారా తేజ తన ఇమ్యెచ్యురిటీని ప్రదర్శించాడు. విలన్‌ పాత్రలకు తెలంగాణ యాస పెట్టి తెలంగాణ అత్తలు అంత దారుణంగా ఉంటారనేట్లు ప్రొజెక్ట్‌ చేశాడు. పాశ్యత్య దేశాల వారు తరుచుగా ఉపయోగించే పదం ఒకటుంది. అది ఎక్సోటికా. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతో....న్న దేశాల్లోని కల్చర్‌ వారికి ఎక్సోటికా. స్వాములు, బాబాలు, ఇక్కడి ఆచారాలు...అన్నీ వారికి ఎక్సైట్‌ చేస్తాయి. అదో రకమైన ఎక్సోటికా. ఇప్పుడు తెలుగు సినిమా వాళ్ళకు తెలంగాణ ఎక్సోటికా. ఇదోరకమైన మత్తు వారికి.

    ఉదయ్‌ కిరణ్‌, అనితలు ప్రేమించుకుంటారు. ఉదయ్‌ కిరణ్‌ తండ్రి 200 కోట్ల ఆస్తిపరుడు. వ్యాపారస్తుడు. అనిత కుటుంబం మూసారాం బేగ్‌ లో పాల వ్యాపారం(దందా) చేసుకుంటూ గడుపుతుంటుంది. ఆస్తుల అంతరం వారిని విడదీస్తుంది. చివరికి వారిద్దరు ఎలా కలుసుకుంటారు. అసెంబ్లీ ఎదుట ఎలా పెళ్ళి చేసుకుంటారు అనేది ఈ చిత్ర కథ. టీనేజర్లుగా ఉదయ్‌ కిరణ్‌, అనితల నటన బాగుంది. మిగతా వారి గురించి చెప్పుకోవాల్సినదేమీ లేదు. తెలంగాణ శకుంతల మరీ ఓవర్‌ గా చేసి ప్రేక్షకులను భయపెడుతుంది. ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం హాయిగా, వినసొంపుగా ఉంది. ఈ చిత్రానికి అదే పెద్ద ఎస్సెట్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X