నువ్వువస్తానంటే నేనొద్దంటానా రివ్యూ

సినిమా: నువ్వు వస్తానంటే నేనొద్దంటానా
నటీనటులు: సిద్ధార్ధ, త్రిష, శ్రీహరి, వేద, సంతోషిని,
నందిత, ప్రకాష్‌రాజ్, సునీల్, తనికెళ్ళ భరణి, గిరిబాబు,
పరుచూరి వెంకటేశ్వరరావు, గీత, జయప్రకాష్ రెడ్డి, ధర్మవర్పు సుబ్రమణ్యం,
చంద్రమోహన్, నర్సింగ్ యాదవ్, గుండు హనుమంతరావు తదితరులు
కథ: వీరు పోట్ల
మాటలు: పరుచూరి బ్రదర్స్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
పాటలు: సిరివెన్నెల
కెమెరా: వేణు గోపాల్
నిర్మాత -స్క్రీన్‌ప్లే: ఎంఎస్ రాజు
దర్శకత్వం: ప్రభుదేవా
కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్టరుగా ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు. ఫస్టాఫ్ గొప్పగా ఉంది. సెకండాఫ్ ఫర్వాలేదు. లొకేషన్లలో సౌందర్య దృష్టి, మంచి స్క్రీన్‌ప్లే, చక్కటి హాస్యం ఈ సినిమాకు జీవం పోశాయి.
కథ: శివరామయ్య (శ్రీహరి)కి చెల్లెలు (త్రిష) అంటే ఎంతో ఇష్టం. సిరి స్నేహితురాలు వేద పెళ్ళి కోసం ఆమె సిటీకి వెళ్ళి పదిహేను రోజులు ఉంటుంది. అదే పెళ్ళికి లండన్ నుంచి సంతోష్ (సిద్ధార్ధ) అతని తల్లి వస్తారు. సంతోష్, సిరి ప్రేమలో పడతారు. సిరి అన్న శ్రీహరికి లండన్ కుర్రాడికి తన చెల్లెల్ని ఇచ్చి పెళ్ళి చేయడం ఇష్టముండదు. అలాగే హీరో తల్లికి ఒక పల్లెటూరి అమ్మాయిని కొడుకు పెళ్ళి చేసుకోవాలనుకోవడం నచ్చదు. సినిమా ఇక్కడ ఉత్కంఠ భరితంగా మారుతుంది. వచ్చిన పెళ్ళి అయిపోతుంది. తన ప్రేమను పండించుకునేందుకు హీరో పల్లెటూరు వెళ్తాడు. వ్యవసాయం చేసి తనకంటే ఎక్కువ పండిచినప్పుడే తన చెల్లిని ఇచ్చి పెళ్ళి చేస్తానని లండన్ బాబుకు శ్రీహరి షరతు పెడతాడు. కాయకష్టం ఎరుగని లండన్ బాబు వ్యవసాయం చేసి ప్రేమ పంటను ఎలా పండించుకుంటాడన్నది తర్వాత కథ.
తొలిసారి దర్శకత్వం వహించినా ప్రభుదేవా తన సత్తా నిరూపించుకున్నాడు. హీరో క్యారెక్టర్‌లో ఉండే ఎనర్జీని పూర్తి స్ధాయిలో ప్రెజెంట్ చేయగలిగాడు. జాగ్రత్త అన్న డైలాగ్ వచ్చినప్పుడల్లా శ్రీహరి ఇంట్లో పనమ్మాయి ఏదో ఒకటి పగలగొట్టడం వినోదభరితంగా ఉంది. హీరో పల్లెటూరికి వచ్చినప్పుడు ఒకపాట చిత్రీకరణ హృదయానికి హత్తుకునేలా ఉంది. పకడ్బందీ స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద బలం. కెమెరా పని అద్భుతం. సిద్దర్ధ నుంచి మంచి నటనను రాబట్టడంలో దర్శకుడు సఫలమయ్యారు. కథ పాతదైనా కథనం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.
మైనస్ పాయింట్: ఈ సినిమా చూస్తున్నప్పుడు హిందీ సినిమా 'ప్యార్ కియాతో డర్నా క్యాహై' గుర్తుకు వస్తుంది. అదే స్టోరీలైన్. సిద్దార్ధతో మొదట నర్సింగ్ యాదవ్ వ్యవహరించే తీరు శ్రీహరి పాత్రను బలహీనపరిచింది. సిరి తన కొడుకును బుట్టలో వేసుకుందని హీరో తల్లి ఆడిపోసుకోవడంతో ఇంటర్వల్ వస్తుంది. క్లెయిమాక్స్‌లో హీరో తల్లిలో వచ్చిన పరివర్తనపై రెండు సీన్లు వేసి ఉంటే క్లెయిమాక్స్ సంపూర్ణంగా ఉండేది.
దట్స్ తెలుగు రిమార్క్స్: ఈ సినిమా యువతరాన్ని బాగా ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ : సిస్టర్ సెంటిమెంట్, సెకండాఫ్: లవ్ ట్రీట్‌మెంట్. ఈ సినిమా సంక్రాంతి సినిమాలన్నిటిలోకీ విజేతగా నిలిచింది.
nuvvu vastanante nenu vaddabtaana siddharth trisha sri hari prakash raj geetha veda సిద్ధార్ధ త్రిష శ్రీహరి వేద సంతోషిని నందిత ప్రకాష్‌రాజ్ సునీల్


Click it and Unblock the Notifications