twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ పిట్ట కథ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు
    Director: చెందుముద్దు

    సస్పెన్స్, థ్రిల్లర్, లవ్ అండ్ రొమాంటిక్ జోనర్‌తో చిన్న సినిమాగా జర్నీ ప్రారంభించిన ఓ పిట్ట కథ చిత్రం.. ఆ తర్వాత ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు తొలి పరిచయం కావడంతో మీడియా అటెన్షన్ క్రియేట్ అయింది. మహేష్ బాబు, చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, అనిల్ రావిపూడి లాంటి ప్రముఖులు సినిమాకు చేయూత ఇవ్వడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య మార్చి 6వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఓ పిట్ట కథ‌ను సమీక్షించాల్సిందే.

    ఓ పిట్ట కథ స్టోరీ

    ఓ పిట్ట కథ స్టోరీ

    కాకినాడలో ఓ థియేటర్‌ యజమాని కూతురు వెంకటలక్ష్మీ ఉరఫ్ వెంకీ (నిత్యాశెట్టి). తల్లిలేని బిడ్డ కావడంతో గారాబంగా పెరుగుతుంది. తమ థియేటర్‌లో పనిచేసే ప్రభు (సంజయ్ రావు)తో చనువుగా ఉంటుంది. అదే సమయంలో చైనా నుంచి కాకినాడలో అడుగుపెట్టిన మేన బావ క్రిష్ (విశ్వంత్)‌కు దగ్గరవుతుంది. అయితే అనూహ్య పరిస్థితుల్లో వెంకటలక్ష్మీ కిడ్నాప్‌కు గురి అవుతుంది. ఆ క్రమంలో ప్రభు, క్రిష్‌లపై అనుమానాలు రేకెత్తుతాయి. దాంతో ఇన్స్‌పెక్టర్ అజయ్ రావు (బ్రహ్మాజీ) రంగంలోకి దిగుతాడు.

    ఓ పిట్ట కథలో ట్విస్టులు

    ఓ పిట్ట కథలో ట్విస్టులు

    వెంకటలక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఇష్టంగా ప్రేమించే ప్రభు, క్రిష్‌పై ఎందుకు అనుమానాలు కలుగుతాయి? వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేయడానికి అసలు కారణమేమిటి? అజయ్ రావు చేసే దర్యాప్తు ఎలా సాగింది? వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేసిన వారిని ఎలా గుర్తించారు? వెంకటలక్ష్మి క్షేమంగా తిరిగి వచ్చిందా? క్రిష్, ప్రభులో ఎవరు వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే ఓ పిట్టకథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేసే సీన్‌తో చిన్న ట్విస్టు ఇవ్వడం ద్వారా సినిమా కథలోకి వెళ్తుంది. ఆ తర్వాత క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడం నిదానంగా సాగడంతో చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో సాదాసీదా సినిమానా అనే అనుమానం కలుగుతుంది. అయితే ఇంటర్వెల్‌కు 20 నిమిషాల ముందు అసలు కథ మొదలు కావడంతో కథపై అలర్ట్‌నెస్ పెరుగుతుంది. ఇక విశ్వంత్, నిత్యాశెట్టి మధ్య సీన్లు, ప్రభు ఎంట్రీ లాంటి అంశాలు ఫీల్‌గుడ్‌‌గా మారిపోవడంతో కథలో వేగం పెరుగుతుంది. బ్రహ్మాజీ ఇన్వెస్టిగేషన్ మరింత జోష్‌ను పెంచుతుంది. ఒక చిన్న ట్విస్టుతో తొలి భాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    రెండో భాగమే ఓ పిట్ట కథకు ప్రధాన ఆకర్షణగా మారుతుంది. వేగంగా చోటుచేసుకొనే సంఘటనలు, వాటికి తగినట్టుగా ఉండే మలుపులు సినిమాను పరుగులు పెట్టిస్తాయి. ప్రభు, క్రిష్‌ మధ్య సాగే డ్రామా బాగుంటుంది. బాలరాజుతో ప్రభు కామెడీ సీన్లు పండటంతో సినిమా వినోదభరితంగా మారుతుంది. ఇక చివర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉంటాయి. చివర్లో వెంకటలక్ష్మి కిడ్నాప్ డ్రామా మరింత రక్తికట్టిస్తుంది. ఓవరాల్‌గా ఓ పిట్ట కథ హ్యాపీ మూడ్‌తో ఎండ్ కావడం సినిమాకు పాజిటివ్‌గా మార్చిందని చెప్పవచ్చు.

    డైరెక్టర్‌గా చెందు ముద్దు

    డైరెక్టర్‌గా చెందు ముద్దు

    తొలి చిత్ర దర్శకుడిగా చెందు ముద్దు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలనుకొన్న ప్రయత్నం సఫలమైనట్టే చెప్పవచ్చు. కాకపోతే కథపై మరింత దృష్టిపెట్టాల్సిందేనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో కొన్ని నాసిరకమైన, రొటీన్ సీన్లు ఇబ్బందిని కలిగించేలా ఉంటాయి. కాకపోతే సెకండాఫ్‌లో కామెడీని, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను జోడించి చేసిన ప్రయత్నం చెందు ప్రతిభకు అద్దం పట్టింది. రచయితగా అక్కడక్కడా డైలాగ్స్ పేల్చడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్‌గా సినిమాను క్లీన్ ఎంటర్‌టైనర్‌గా మార్చడంలో తన సత్తాను చాటుకొన్నాడు. తొలి చిత్ర దర్శకుడికి ఉంటే తడబాటును ఏ దశలోనూ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో చెందు పూర్తి మార్కులను కొట్టేశాడని చెప్పవచ్చు.

    లీడ్ యాక్టర్ల ప్రతిభ

    లీడ్ యాక్టర్ల ప్రతిభ

    ఇక తొలిసారి కెమెరాను ఫేస్ చేసిన సంజయ్ రావులో ఎలాంటి బెరుకు కనిపించలేదు. డైలాగ్ డెలీవరి, హావభావాల విషయంలో ఫర్వాలేదు. కానీ ఇంకా నటనపరంగా మెరుగులు దిద్దుకొవాల్సిన అవసరం కనిపించింది. విశ్వంత్ విషయానికి వస్తే మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో క్రిష్‌గా ఒదిగిపోయాడు. గత చిత్రాల కంటే భిన్నంగా కనిపించడమే కాకుండా యాక్టింగ్ పరంగా మెచ్యురిటీ కనిపించింది. నిత్యాశెట్టి అల్లరి పిల్లగా ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. కాకపోతే గ్లామర్ పరంగా ఇంకా కొంత జాగ్రత్త పడాల్సింది. బాలరాజు కొత్త తరహాలో వినోదాన్ని పండించాడు. నిత్యాశెట్టి తండ్రి పాత్రను పోషించిన నటుడు గత చిత్రాల కంటే భిన్నంగా ఆకట్టుకొన్నాడు. నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్‌ను చక్కగా పండించాడు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ప్రవీణ్ లక్కరాజు అందించిన మ్యూజిక్ బాగుంది. సెకండాఫ్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సీన్లను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. పాటలు కూడా ఫీల్‌గుడ్‌గా ఉన్నాయి. గోదావరి, కోనసీమ అందాలను సునీల్ కుమార్ చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. ప్రతీ ఫ్రేమ్‌ను చాలా పచ్చదనంతో నింపడం ఆహ్లాదకరంగా మార్చారు. ఫస్టాఫ్‌లో కొంత ఎడిటింగ్‌కు స్కోప్ ఉంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    టాలీవుడ్‌లో క్లీన్ ఇమేజ్ ఉన్న చిత్రాలను నిర్మించే సంస్థగా భవ్య క్రియేషన్స్‌కు మంచి పేరు ఉంది. నిర్మాత ఆనంద ప్రసాద్ తన అభిరుచికి తగినట్టుగా ఆహ్లాదకరమైన కథను ప్రేక్షకులకు అందించడంలో సఫలమయ్యారు. ఇక చిన్న చిత్రాలను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఈ సినిమా వరకు నటీనటులు ఎంపిక చాలా యాప్ట్‌గా ఉంది. ఓ పిట్ట కథ మూవీ విజయం భవ్యక్రియేషన్ ఖాతాలో చేరినట్టే అనిచెప్పవచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సస్సెన్స్, థ్రిల్లర్ జోనర్‌తో రూపొందిన ప్రేమ కథా చిత్రం ఓ పిట్టకథ. కొత్త తారలు, దర్శకుడు కలయికలో వచ్చిన ఈ చిత్రానికి ప్రధాన బలం స్క్రీన్ ప్లే. కథలో ఊహించని మలుపుల ప్రేక్షకులకు థ్రిల్‌ను కలిగించే విధంగా ఉంటాయి. తొలి భాగం రొటీన్‌గా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో ట్విస్టులు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మెదడుకు పదునుపెట్టేలా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బీ, సీ సెంటర్లలో ప్రేక్షకాదరణ లభిస్తే... మంచి విజయాన్ని సొంతం చేసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    నటీనటులు పెర్ఫార్మెన్స్
    స్క్రీన్ ప్లే
    మ్యూజిక్
    సినిమాటోగ్రఫి
    సెకండాఫ్
    కథలో ట్విస్టులు

    మైనస్ పాయింట్స్
    ఫస్టాఫ్ రొటీన్‌గా ఉండటం

    Recommended Video

    O Pitta Katha Movie Full Interview | Brahmaji About Trivikram Srinivas Talent || Filmibeat Telugu
    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు
    నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌
    ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి
    పాటలు: శ్రీజో
    ఆర్ట్: వివేక్‌ అన్నామలై
    ఎడిటర్‌: డి.వెంకటప్రభు
    కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌
    సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు

    English summary
    O Pitta Katha movie review and rating: O Pitta Katha is a suspense, Thriller with Triangle love story. Actor Brahmaji son Sanjay Rao introduced as an actor with this movie. This move hits the screens on March 6th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X