O Saathiya Review ఫ్రెష్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ.. ఓ సాథియా ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు: ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ, చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా, బుల్లెట్‌ భాస్కర్, యాదమ్మ రాజు, అంబరీష్‌ అప్పాజీ తదితరులు
దర్శకత్వం: దివ్య భావన
నిర్మాతలు: చందన కట్టా, సుభాష్‌ కట్టా
సినిమాటోగ్రఫి: ఈజే వేణు
ఎడిటర్: కార్తీక్‌ కట్స్
సంగీతం: విన్నూ
మాటలు: ఈశ్వర్ చైతన్య
లిరిక్స్: భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల,
కొరియోగ్రఫి: రఘు, బాబా భాస్కర్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్: చంద్ర తివారి
లైన్‌ ప్రొడ్యూసర్‌- వంశీకృష్ణ జూలూరి
బ్యానర్: తన్వికా, జశ్వికా క్రియేషన్స్‌
రిలీజ్ డేట్: 2023-07-07

వైజాగ్‌లో ఒకే కాలేజీలో చదువుకొనే అర్జున్ (ఆర్యన్ గౌరా), కీర్తి (మిస్త్రీ చక్రవర్తి) స్టూడెంట్స్. మిస్త్రీని తొలి చూపులోనే అర్జున్ ప్రేమిస్తాడు. అయితే అప్పటికే కీర్తిపై మరో స్టూడెంట్‌ మనసు పారేసుకొంటాడు. అయితే కీర్తి ప్రేమను ఎవరు పొందాలనే విషయంలో అర్జున్ ఫ్రెండ్ (చైతన్య గరికపాటి) సలహా ఇస్తాడు. అయితే కీర్తి, అర్జున్ ఒకరినొకరు ఇష్టపడుతారు. కానీ అనుకోకుండా అర్జున్‌కు కీర్తి దూరమవుతుంది.

O Saathiya movie Review and Rating: Divya Bhavans Feel Good love Story

కీర్తి ప్రేమను దక్కించుకోవడానికి అర్జున్ స్నేహితుడు ఇచ్చిన సలహా ఏమిటి? కీర్తి మనసును అర్జున్ ఎలా గెలుచుకొన్నాడు? పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అర్జున్‌కు కీర్తి ఎందుకు దూరమైంది. మళ్లీ కీర్తిని అర్జున్ కలిశాడా? కీర్తిపై ప్రేమ పెంచుకొన్న అర్జున్‌ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? ఎలాంటి అడ్డంకులను అధిగమించి కీర్తి ప్రేమను పెళ్లిగా మార్చుకొన్నాడనే ఎమోషనల్ ప్రశ్నలకు సమాధానమే ఓ సాథియా సినిమా కథ O Saathiya movie Review.

ఫన్, హ్యుమర్ అంశాలతో కాలేజీలో అర్జున్, కీర్తి ప్రేమ కథ మొదలవుతుంది. అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో కీర్తి అనుకోకుండా దూరం కావడంతో కథలో ఓ ట్విస్టు మొదలవుతుంది. ప్రేయసి దూరమైన నేపథ్యంగా అర్జున్ పడే ఆవేదన ఎమోషనల్‌గా సాగుతుంది. O Saathiya movie Review ఇంటర్వెల్‌ ముందు కథలో చోటు చేసుకొన్న్ కీలక మలుపు సినిమా రెండో భాగంపై ఆసక్తిని రేపుతుంది. కీర్తీని కలిసిన తర్వాత బ్రేకప్ కావడం.. కీర్తికి మరో పెళ్లి నిశ్చయం కావడంతో కథ మరింత ఎమోషనల్‌గా మారుతుంది. చివర్లో ఫీల్ గుడ్ అంశాలతో కథ ఎమోషనల్‌గా ముగుస్తుంది.

O Saathiya movie Review and Rating: Divya Bhavans Feel Good love Story

దర్శకురాలు దివ్య భావన ట్రాయంగిల్ లవ్ స్టోరిని రెగ్యులర్‌ పాయింట్‌తోనే మొదలుపెట్టినప్పటికీ. . కథలో ఎమోషన్స్ జొప్పించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. కథ నిదానంగా సాగడం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల కొంత రొటీన్ సినిమా అనిపిస్తుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథను నడిపిన విధానం దర్శకురాలిగా నూటికి నూరు మార్కులు సాధించిందనే చెప్పాలి.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే. అర్యన్ గౌరా కొత్త హీరో అయినప్పటికీ.. పూర్తిగా మెచ్యురిటీతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. డ్యాన్స్‌, యాక్టింగ్, ఎమోషన్స్ పలికించి తీరు బాగుంది. O Saathiya movie Review మిస్త్రీ చక్రవర్తి గ్లామర్ పరంగాను, యాక్టింగ్ పరంగాను మెప్పించిందని చెప్పాలి. ఇక దేవీ ప్రసాద్ బరువైన పాత్రలో కనిపించారు. హీరో స్నేహితుడిగా చైతన్య గరికపాటి మంచి హ్యుమర్‌ను అందించాడు. శివన్నారాయణ, బుల్లెట్ భాస్కర్, యాదమ రాజు ఉన్నంతలో మంచి కామెడిని పండించారు.

O Saathiya movie Review and Rating: Divya Bhavans Feel Good love Story

స్వచ్చమైన, క్లీన్ లవ్ స్టోరికి సంబంధించిన ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అదమైన ప్రేమ కథకు డైలాగ్స్ మరింత ఎమోషన్ కంటెంట్‌ను అందించాయి. ఈజే వేణు సినిమాటోగ్రఫి బాగుంది. విన్నూ వినోద్ సంగీతం, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల అందించిన సాహిత్యం క్లీన్‌గా ఉంది. O Saathiya movie Review సభాష్ కట్టా, చందన కట్టా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతీ ఫ్రేమ్‌లో వారు రాజీ పడలేదనే విషయం కనిపిస్తుంది.

లవ్, ఎమోషన్స్, కాలేజ్ డ్రామా అంశాలుగా ఓ సాథియా రూపొందింది. ఫస్టాఫ్ స్లోగా సాగడం, కథకు అవసరమైన రీతిలో పేరున్న నటీనటులు లేకపోవడం మైనస్‌గా కనిపిస్తుంది. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే ఫ్రెష్ లవ్ స్టోరి అయి ఉండేది. అయితే అశ్లీల, అసభ్యత చోటు లేకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌గా ఈ సినిమా ఫీల్ ఇస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు హార్ట్‌ను టచ్ చేస్తాయి. ఫ్రెష్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఓ సాథియా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X