RGV's Obsession Review: రాంగోపాల్ వర్మ అబ్సెషన్ మూవీ రివ్యూ

అమెరికన్ సూపర్ నేచురల్ సైకాలజికల్ హారర్ మూవీ అబ్సెషన్ (Obsession) రిలీజై భారీ వసూళ్లను సాధించడమే కాకుండా సగటు ప్రేక్షకులను, క్రిటిక్స్, సినీ వర్గాలను ఆకట్టుకొంటున్నది. మైఖేల్ జాన్సస్టన్, ఇందే నవరెట్టే, కూపర్ టోమిలిన్‌సన్, మేఘన లాలెస్, ఆండీ రిచర్, కర్రీ బార్కర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కర్రీ బార్కర్ దర్శకత్వం వహించారు. జేమ్స్ హారిస్, హ్యాలీ నికోల్ జాన్సన్ తదితరులు నిర్మాతలుగా వ్యవహరించారు.

సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: టైలర్ క్లెమాన్స్, ఎడిటింగ్: కర్రీ బార్కర్ మ్యూజిక్: రాక్ బుర్వెల్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం మే 15వ తేదీన ఇండియాలో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో రివ్యూ చేశారు. ఆయన ఈ మూవీ గురించి ఏం చెప్పారంటే?

Obsession Review by Ram Gopal Varma

అబ్సెషన్ (Obsession) సినిమా చూసిన తర్వాత ఆ సినిమాకు అడిక్షన్ అయ్యాను. కొద్ది రోజుల క్రితం వరకు బిగ్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు, వీఎఫ్ఎక్స్‌తో కూడిన సినిమాలే ఆడియెన్స్‌కు రప్పిస్తాయని భావించారు. కానీ ఆ భావనను ఈ సినిమా ఓ బటన్‌ను రీసెట్ చేసింది. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేరు. గ్రాండ్ లోకేషన్లు లేవు. విలాసవంతమైన ప్రొడక్షన్ వాల్యూస్ లేవు. విదేశాల్లో షూటింగ్ చేయలేదు. టాప్ టెక్నిషియన్స్ లేరు. ఈ సినిమా కేవలం భారతీయ కరెన్సీలో 7 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాను కేవలం మూడు లోకేషన్లలో అంటే.. రెండు గదులు, ఇంటీరియర్ కారులో, ఇంటీరియర్ స్టోర్‌లో చిత్రీకరించారు అని తన రివ్యూ ఆర్జీవి చెప్పారు.

అబ్సెషన్ (Obsession) సినిమా విషయంలో డైరెక్టర్ విజన్ సిప్లిస్టిక్‌గా ఉంది. కానీ యూనిక్‌గా ప్రజెంట్ చేశారు. చాలా సన్నివేశాల్లో హెడ్ స్పేస్ జొప్పించిన విధానం నన్ను ఎంతో ఆకట్టుకొన్నది. అది సినిమా మూడ్‌ను క్రియేట్ చేసింది. ఎడిటింగ్ విభాగం పనితీరు చూస్తే కేవలం టెక్నికల్ వర్క్‌గా భావించలేదు. ఎడిటింగ్‌ను సైకలాజికల్ వెపన్‌లా వాడటం ద్వారా రాపిడ్ కట్స్‌తో ఆకట్టుకొన్నాడు. నిక్కి అనే పాత్ర ముఖంపై ఇంటర్వెల్ షాట్ పెట్టిన విధానం చూస్తే ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది అని వర్మ తెలిపారు.

సినిమాలో లాంగ్ టేక్స్ భరించలేని టెన్షన్‌ను క్రియేట్ చేస్తుంది. క్యారెక్టర్ దృక్కోణంలో ఆడియెన్ ట్రాప్ అవుతాడు. ఆ ట్రాప్ నుంచి తప్పించుకోలేని పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. సౌండ్ డిజైన్ విషయానికి వస్తే.. డోర్ కొట్టుకొనే విధానం, ఉన్నట్టు నవ్వడం, గుండె చప్పుడు షార్ప్‌గా కట్ చేశాడు. ఎడిటింగ్ విషయంలో ఆయన అనుసరించిన పంథా వినూత్నమైనది. సినిమా చూస్తే ఆ టాలెంట్‌ను ఎంజాయ్ చేయగలం అని అన్నారు.

ఇలాంటి సాంకేతిక అంశాల బలాబలాల ఫలితమే.. కథలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని గ్రహించలేం. సన్నివేశాలను లైవ్లీగా మార్చాయి. ఎడిటింగ్ పనితీరే హారర్‌ను క్రియేట్ చేసింది. లైటింగ్ విషయానికి వస్తే.. సింగిల్ సోర్స్ లైటింగ్‌ను వాడుకొన్నాడు. ఇండివిడ్యువల్ షాట్స్‌ డేవిడ్ ఫిచర్ మదిరిగా చిత్రీకరించారు. 1 మిలియన్ డాలర్ కంటే తక్కువ బడ్జెట్‌తో 179 మిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్షన్ వాల్యూస్‌ను చూపించారు. ఈ సినిమాకు క్యారెక్టర్ డిజైన్, ఎఢిటింగ్, సౌండ్ డిజైన్ విభాగాల పనితీరు అమోఘంగా ఉన్నాయి అని రాంగోపాల్ వర్మ ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు.

Read more about: rgv Obsession ram gopal varma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X