Odela 2 Movie Review: ఓదెల 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: తమన్నా భాటియా, వశిష్ట ఎన్ సింహ, మురళీ శర్మ, హెబ్బా పటేల్, శరత్ లోహితశ్వ, నాగ మహేశ్, శ్రీకాంత్ అయ్యాంగర్, పూజారెడ్డి తదితరులు
దర్శకత్వం: అశోక్ తేజ
సమర్పణ: సంపత్ నంది
నిర్మాత: డీ మధు
సినిమాటోగ్రఫి: సౌందర్ రాజన్
ఎడిటింగ్: అవినాష్
మ్యూజిక్:అజనీష్ లోక్‌నాథ్
బ్యానర్: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌
రిలీజ్ డేట్: 2025-04-17

ఓదెల గ్రామంలో అమ్మాయిలను శోభనం రోజు పైశాచికత్వంగా అనుభవించిన తిరుపతి (వశిష్ట సింహా) భార్య చేతిలో దారుణ హత్యకు గురవుతాడు. అయితే గ్రామానికి నరకం చూపించిన తిరుపతికి మరణం తర్వాత కూడా శిక్ష విధించాలని గ్రామస్థులు తీర్మానిస్తారు. ఆ తర్వాత తిరుపతి శవానికి సమాధి శిక్ష వేస్తారు. అయితే సమాధి నుంచి బయటకు వచ్చి మళ్లీ గ్రామానికి పీడగా మారుతాడు. ఆ క్రమంలో శివ నామస్మరణలో జీవితాన్ని కొనసాగిస్తున్న నాగసాధువు అలియాస్ భైరవి (తమన్నా భాటియా) ఓదెల గ్రామానికి వస్తుంది.

తిరుపతి శవానికి సమాధి శిక్ష ఎందుకు వేశారు? సమాధి నుంచి మళ్లీ ఎలా తిరుపతి ఆత్మ లేచింది? తిరుపతి ఆత్మ ఓదెల గ్రామంలో సృష్టించిన అల్లకల్లోలం ఏమిటి? తిరుపతి ఆత్మకు నాగసాధువు చేసిన కట్టడి ఏమిటి? తిరుపతి ఆత్మకు వేసిన బంధనం ఎందుకు విఫలమైంది? ఓదెల గ్రామ క్షేమం కోసం నాగసాధువు భైరవి ఎలాంటి త్యాగం చేయడానికి సిద్దపడింది? ఆత్మకు పరమాత్మకు జరిగిన సంఘర్షణలో న్యాయం ఎటువైపు నిలిచింది? ఓదెల గ్రామానికి పట్టిన పీడ ఎలా వదిలింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఓదెల 2 సినిమా కథ.

Odela 2 Movie Review in Telugu

క్రైమ్, హారర్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఓదెల అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ సిరీస్ సాధించిన సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న కాన్సెప్ట్ బాగుంది. కానీ పూర్తిస్థాయి కథగా, సన్నివేశాలుగా విస్తరించుకొనే విధానం గాడి తప్పిందనిపిస్తుంది. ఈ సినిమాకు పునాదిగా మారిన ఫస్టాఫ్‌లోనే స్క్రిప్టు పరంగా చాలా లోపాలు, కొన్ని సీన్లు చాలా సిల్లీగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.

ఫస్టాఫ్‌ను సాగదీసిన దర్శకుడు అశోక్ తేజ.. సెకండాఫ్‌కు కుదురుకొన్నారనిపిస్తుంది. తమన్నా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో కొంత వైవిధ్యం, స్క్రీన్ ప్లేలో చలనం వచ్చినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో రాసుకొన్న సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయని చెప్పవచ్చు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు సన్నివేశాలను ఇంకాస్త బాగా రాసుకొని ఉంటే ఈ సినిమా ఫలితం మరింత బాగుండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా ఓదెల 2 ఫర్వాలేదనే ఫీలింగ్‌ కలుగుతుంది.

నటీనటులు విషయానికి వస్తే.. తమన్నా భాటియా పాత్ర తప్ప.. మరో క్యారెక్టర్‌కు అంతగా ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించదు. నాగసాధవుగా క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌ను చక్కగా పలికించేందుకు తమన్నా చేసిన ప్రయత్నం బాగుంది. సెకండాఫ్‌లో సినిమా భారాన్ని తన భుజాలపై మోయడం ఈ సినిమాకు బ్యూటీగా నిలిచింది. హెబ్బా పటేల్ క్యారెక్టర్‌ను అంతగా పట్టించుకొన్నట్టు కనిపించదు. తమన్నా షాడోలో హెబ్బా కనిపించకుుండా పోయిందనిపిస్తుంది. అక్కడక్కడ వశిష్ట, మురళీ శర్మ మెప్పించే ప్రయత్నం చేశారు. బేసిక్‌గా వశిష్ట క్యారెక్టర్ ఇంకాస్త బెటర్‌గా డిజైన్ చేయాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారంతా ఫర్వాలేదనిపిస్తారు.

ఓదెల 2 సినిమా కంటెంట్ పరంగా కాకుండా టెక్నికల్‌గా ఎక్కువ మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు. సౌందర్ రాజన్ చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఓదెల గ్రామం నేటివిటి, వాతావరణం చక్కగా చూపించారు. గ్రామస్థుల మూడ్‌ను చాలా సహజంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ అసెట్‌గా నిలిచింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు ఒకే అనిపిస్తాయి. నిర్మాత డీ మధు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రొడక్షన్ వైజ్‌గా లావీష్ చేశారు. కానీ కంటెంట్ పరంగా రిచ్‌నెస్‌ను మిస్ అయ్యారనే ఫీలింగ్ కలుగుతుంది.

దైవభక్తి, క్రైమ్, హారర్ అంశాలను జోడించి చేసిన ఎమోషనల్ డ్రైవ్ ఓదెల 2. అయితే ఈ సినిమాపై అరుంధతి, అమ్మోరు సినిమాల ప్రభావం భారీగా పడిందనే చెప్పాలి. ముఖ్యంగా వశిష్ట, మురళీశర్మ క్యారెక్టర్లు చూస్తే అరుంధతి 2 మాదిరిగా అనిపిస్తుంది. కంటెంట్ వీక్‌గా ఉన్నప్పటికీ.. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాను తమ ప్రతిభతో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం ప్లస్ పాయింట్. దైవభక్తి, దుష్టశక్తికి మధ్య సంఘర్షణ ఆధారంగా వచ్చే సినిమాలను ఇష్టపడేవారికి ఓదెల 2 కూడా తప్పకుండా నచ్చుతుంది. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రమిది. ఈ వారం ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X