Odela 2 First Review: ఓదెల 2 ఫస్ట్ రివ్యూ.. తమన్నా శివశక్తిగా మెప్పించిందా?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. 2021 సంవత్సరంలో రిలీజై భారీ విజయం అందుకొన్న ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది సమర్పణలో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డీ మధు నిర్మించారు. నాగ సాధువుగా తమన్నా కనిపిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించిన సెన్సార్ రిపోర్టు, ఫస్ట్ రివ్యూ గురించిన వివరాల్లోకి వెళితే..
ఓదెల సినిమా రూపొందించినప్పుడు సీక్వెల్ ఆలోచన లేదు. హెబ్బా పటేల్ చేసిన క్యారెక్టర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. సెకండ్ పార్ట్ గురించి అందరూ అడిగిన సమయంలో సీక్వెల్ తీస్తే.. మరో బలమైన హీరోయిన్ క్యారెక్టర్ ఉండాలని అనుకొన్నాం. ఆ దిశగా ఆలోచిస్తూ కథ రాయడం మొదలుపెట్టాం. ఫస్ట్ పార్ట్ లో ఒక దుష్ట శక్తిని అంతం అవుతుంది. దాని ఆత్మని కంట్రోల్ చేయాలంటే మరో శక్తి కావాలి. శివశక్తి లాంటి క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందని ఆలోచన పుట్టింది అని సంపత్ నంది తెలిపారు.

ఓదెల 2 సినిమా కథ గురించి చెప్పాలంటే.. సోల్ వర్సెస్ సూపర్ నేచురల్ పవర్స్. ఆత్మ వర్సెస్ పరమాత్మ. నేను శివశక్తి లాంటి క్యారెక్టర్లు మా ఊరి ప్రాంతాల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చూశాను. మా నాన్నమ్మ శివశక్తిగా ఉండేవారు. చిన్నప్పుడు తనకి పూనకం రావడం నేను చూశాను. తెలిసి తెలియని వయసులో కామెడీ కూడా చేసుకునే వాళ్ళం. నానమ్మ ఆ చుట్టుపక్కల చాలా పాపులర్. ఎవరికైనా కష్టం వస్తే వచ్చి చెప్పుకునే వాళ్ళు. ఆ విజువల్స్ అన్ని నాకు గుర్తున్నాయి. అది స్క్రీన్ కి కొత్తగా ఉంటుందని భావించాను. శివశక్తులు నాగసాధువులుగా మారతారని శివాలయాలను పునరుద్ధరణ చేస్తారని ఇలా చాలా సమాచారం తెలిసింది. అలా నాగసాధు క్యారెక్టర్ పుట్టింది అని సంపత్ నంది వెల్లడించారు.
ఇలాంటి కథతో రూపొందించిన ఓదెల 2 సినిమా టీజర్, ట్రైలర్లు ఆసక్తిని పెంచేలా చేశాయి. ఈ క్రమంలో ఈ సినిమాను సెన్సార్ బోర్డు అధికారులు వీక్షించారు. అయితే కథలో ఉండే కొన్ని సీన్లు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయని, కథలో భాగంగా కొంత అడల్డ్ కంటెంట్, హారర్ అంశాలు కూడా ఉండటం వల్ల సెన్సార్ అధికారులు కొన్ని సున్నితమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ వాటిని తొలగించాలని పట్టుబట్టలేదని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. దాంతో ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ లభించిందని తెలిసింది.
ఓదెల 2 సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. ఈ మూవీ నిడివి మొత్తం 149 నిమిషాల 50 సెకన్ల మేర్ కట్ చేశారు. అంటే దాదాపు ఈ సినిమా నిడివి 2.30 గంటలు ఉంటుంది. అయితే ఈ సినిమా ఆద్యంతం పరుగులుపెట్టే విధంగా స్క్రీన్ ప్లే రాశారు. కొన్ని సన్నివేశాలు సహజత్వంగా ఉన్నాయి అనే మాటను సెన్సార్ సందర్భంగా అధికారులు చెప్పినట్టు తెలిసింది. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (సీబీఎఫ్‌సీ) ఇచ్చింది అని చిత్ర యూనిట్ వెల్లడించారు.
ఓదెల 2 సినిమాను ఖర్చుకు వెనుకడాకుండా భారీగా రూపొందించారు. సినిమా ఆరంభం, టీజర్ రిలీజ్ కార్యక్రమం కాశీ, కుంభమేళాలో జరగడం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని సీన్లు చాలా రిచ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫి, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ప్లస్ పాయింట్ అని తెలిసింది. అలాగే తమన్నాను కొత్తగా చూడటానికి అవకాశం ఉంటుంది. వశిష్ట క్యారెక్టర్ గుర్తుండి పోతుందని చెప్పారు. ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చాక.. ఎలాంటి టాక్ సొంతం చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











