Odela 2 Twitter Review: ఓదెల 2 ట్విట్టర్ రివ్యూ
ఓటీటీలో రిలీజై భారీ విజయం అందుకొన్న ఓదెల వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ఓదెల 2. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సంపత్ నంది సమర్పకుడిగా వ్యవహారించారు. ఈ సినిమాకు డీ మధు నిర్మాతగా వ్యవహరించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 17వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలను, రివ్యూల వివరాల్లోకి వెళితే..
తమన్నా భాటియా నాగసాధువుగా నటించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సోల్ వర్సెస్ సూపర్ నేచురల్ పవర్స్. ఆత్మ వర్సెస్ పరమాత్మ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సంపత్ నంది గ్రామంలో, కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రూపొందించారు.

ఓదెల 2 సినిమా మంచి మూవీ. ఒకసారి చూడొచ్చు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కథ, సన్నివేశాలు ఎంగేజింగ్‌గా ఉంటాయి అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఓదెల 2 బాగుంది. ఓదెల సిరీస్ చూసిన వాళ్లు.. ఈ చిత్రంలో తమన్నా నటన కోసం చూడొచ్చు. ఓసారి ఓదెల 2 చూడొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఓదెల 2 సినిమాలో తమన్నా డివైన్ లుక్, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఫస్టాఫ్ టెర్రిఫిక్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సెకండాఫ్ ఎమోషన్స్ బాగున్నాయి. తమన్నా యాక్టింగ్, క్లైమాక్స్ సీన్లు బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఓదెల 2 హారర్ ఫిలిం. విలన్ అల్లకల్లోలం సినిమాకు ప్లస్ పాయింట్. శివ శక్తిగా తమన్నా భాటియా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. విలన్‌గా వశిష్ట బాగా చేశాడు. కొన్ని సీన్స్ డల్‌గా ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నాగసాధువుగా తమన్నా చేసిన క్యారెక్టర్ బాగాలేదు. ఆ క్యారెక్టర్‌కు ఆమెను తీసుకోవాలన్న ఆలోచనతోనే సినిమా చచ్చిపోయింది అంటూ ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు.
ఓదెల సినిమా కథ 2 గంటల 29 నిమిషాల రన్ టైమ్. సెన్సార్ టాక్ అయితే బ్లాక్ బస్టర్ అని చర్చించుకుంటున్నారు.. తమన్నాకు ఏ రేంజ్ హిట్ వస్తుందో అనే విషయం రిలీజ్ తర్వాత థియేట్రికల్‌లో ప్రేక్షకులు తెల్చాల్సిందే.
ఇంటర్నల్ రిపోర్టుల ప్రకారం ఓదెల 2 సినిమా ప్రామిసింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 29 నిమిషాలు. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగున్నాయి. ఈ సినిమాలో తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట పెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉంటాయి అని నెటిజన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











