Odum Kuthira Chaadum Kuthira First Review: ఒడుమ్ కుథిరా చాడుమ్ కుథిరా ఫస్ట్ రివ్యూ.. ఫాహద్ ఫాజిల్ పెర్ఫార్మెన్
స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఒడుమ్ కుథిరా చాడుమ్ కుథిరా. హూ లెట్ ది హార్స్ అవుట్ అనేది సినిమా సబ్ టైటిల్. ఈ సినిమాకు అల్తాఫ్ సలీమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రేవతి పిళ్లై, వినయ్ ఫోర్ట్, తదితరుటు నటిస్తున్నారు. ఈ సినిమాకు జింటో జార్జ్ సినిమాటోగ్రఫి, జస్టిన్ వర్గీస్ మ్యూజిక్, నిధిన్ రాజ్ అరోల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన కథ ఏంటి? ఈ సినిమా సెన్సార్ రిపోర్టు ఉంది? సెన్సార్ బోర్డు అధికారులు ఎలాంటి రివ్యూను ఇచ్చారు అనే వివరాల్లోకి వెళితే..
ఒడమ్ కుథిరా చాడమ్ కుథిరా సినిమా కథ విషయానికి వస్తే.. అభి (ఫాహద్), నిధి (కల్యాణి ప్రియదర్శన్) ఇద్దరు ప్రేమించుకొంటారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటారు. అయితే పెళ్లి సమయంలో ఓ అభిని నిధి ఓ కోరిక కోరుతుంది. పెళ్లి బరాత్‌లో గుర్రం ఎక్కి రావాలి. దానిపై కూర్చొని దానిని వెనక్కి నడిపించుకొంటూ రావాలి అని కోరుతుంది. దాంతో అభి ఎలాగో గుర్రాన్ని సంపాదించి.. దానిపై కూర్చొని అది వెనక్కి నడుస్తుంటే.. ఊరేగింపుగా వస్తుంటాడు. ఆ సమయంలో పెళ్లి బాజాలు, కెమెరా ఫ్లాష్‌లకు బెదిరిపోయిన గుర్రం అటు ఇటు పరిగెత్తడంతో అభి కిందపడిపోతాడు. తలకు బలమైన గాయమై కోమాలోకి జారుకొంటారు.
అభి, నిధి ప్రేమ కథ ఎలా సాగింది? గుర్రాన్ని తీసుకు రావడానికి అభి ఎలాంటి కష్టాలు పడ్డాడు? పెళ్లిలో గుర్రం చేసిన హంగామా ఏంటి? గుర్రంపై నుంచి పడిన తర్వాత అభి, నిధి పరిస్థితి ఏమైంది? అభి, నిధి మధ్య వచ్చిన మరో భామ ఎవరు? కోమా నుంచి అభి బయటకు వచ్చాడా? అభి పెళ్లి జరిగిందా? అనేది సినిమా కథ.

ఫాహద్ ఫాజిల్ నటించిన రొమాంటిక్ కామెడీ నటించిన ఈ చిత్రానికి తిరువనంతపురంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను చూసిన అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. వినోదం, ఎమోషన్స్ బాగున్నాయనే విషయాన్ని చెప్పారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆవేశం మూవీ తర్వాత ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ మరోసారి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కల్యాణి ప్రియదర్శన్‌తో రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. కామెడీ పార్ట్ పార్టులుగా వర్కవుట్ అయింది అనే టాక్ సోషల్ మీడియాలో కనిపించింది.
ఫాహద్ ఫాజిల్ లవర్ బాయ్, మధ్య వయసు యువకుడిగా నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (సీబీఎఫ్‌సీ) క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రానికి యూఏ (UA) 13+ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. క్లీన్ మూవీ కావడంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా 13 ఏళ్లు నిండిన వారు ఈ సినిమాను చూడొచ్చు అనే నిబంధనతో సర్టిఫికెట్‌ను ఇచ్చారు అని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక భావోద్వేగాలతో సాగే ఈ సినిమాలో కామెడీకి పెద్ద పీట వేశారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌కు కావాల్సిన అన్ని హంగులను జొప్పించారు. ఓనమ్ పండుగ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా మార్చే ప్రయత్నం జరిగింది. ఈ సినిమా నిడివి 153 నిమిషాలు. అంటే.. 2 గంటల 33 నిమిషాల రన్ టైమ్‌గా నిర్ణయించారు. ఈ సినిమా ద్వారా ఫాహద్ ఫాజిల్ మరోసారి దక్షిణాది ప్రేక్షక్షలను మెప్పించగలరనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ అప్ డేట్స్, ఇతర విశేషాల గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











