OG Movie Review: OG తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: పవన్ కల్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్, శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, రాహుల్ రవీంద్రన్, అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజిత్
నిర్మాత: డీవీవీ దానయ్య
మ్యూజిక్: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫి: రవి కే చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలీ
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2025-09-25
జపాన్ నుంచి భారీగా బంగారం తీసుకొచ్చిన సత్యనారాయణ అలియాస్ సత్య దాదా (ప్రకాశ్ రాజ్) తన ఇద్దరు కొడుకులు (వెంకట్, శ్యామ్)తోపాటు తన పెంపుడు కొడుకు OG అలియాస్ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్)ను తీసుకొని ముంబైలో పోర్టును ఏర్పాటు చేసి భారీగా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అయితే సత్యదాదా పెద్ద కొడుకు (శ్యామ్)ను హత్య చేసి అక్కడ నుంచి వెళ్లిపోయి భార్య కణ్మని (ప్రియా అరుళ్ మోహన్) కూతురు తారతో నాసిక్‌లో స్థిరపడుతాడు. విదేశాల నుంచి ఓమీ (ఇమ్రాన్ హష్మీ) పంపిన కంటైనర్‌ను సత్య దాదా టీమ్ కబ్దా చేస్తుంది. ఆ వివాదంలో ముంబైలో సత్యదాదా చిన్న కొడుకు పార్థూ (వెంకట్)ను ప్రత్యర్థి వర్గం ఓమీ (ఇమ్రాన్ హష్మీ) వర్గం చంపేస్తుంది. అంతేకాకుండా సత్యదాదాను చంపేయడానికి ప్లాన్ వేస్తాడు. నాసిక్‌లో ఉన్న ఓజీ వద్దకు సత్యదాదా వెళ్లిన సమయంలో ఓమీ వర్గం దాడి చేస్తుంది.

సత్య దాదా పెద్ద కొడుకును ఓజీ ఎందుకు చంపాడు? ముంబైని వదలిసే 15 ఏళ్ల ఎక్కడికి వెళ్లాడు? నాసిక్‌లో కణ్మనితో పెళ్లి ఎలా జరిగింది? నాసిక్‌లో కణ్మనితో ఓజీ ఎలాంటి జీవితం గడిపాడు? కొడుకు మరణం తర్వాత ఓజీ వద్దకు సత్యదాదా ఎందుకు వెళ్లాడు? ఓమీ వర్గం సత్యదాదా పోర్టును ఎందుకు కబ్దా పెట్టింది? సత్యదాదా కుటుంబానికి, వ్యాపారానికి ఓమీ నుంచి ముప్పు వాటిల్లిన నేపథ్యంలో తిరిగి వచ్చిన ఓజీ ముంబైలో ఏం చేశాడు? ఓజీ కూతురును ఓమీ ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఓజీని చంపడానికి సత్య దాదా మనవడు అర్జున్ (అర్జున్ దాస్) ప్రయత్నించాడు? ముంబైలో ఓమీ ఎలాంటి మారణ హోమం సృష్టించాలని అనుకొన్నాడు? ఓమీ మారణ హోమాన్ని ఓజీ ఎలా అడ్గుకొన్నాడు? 15 ఏళ్ల పాటు ముంబైకి దూరమైన ఓజీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఓజీకి జపాన్ సమురాయ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే OG సినిమా కథ.
రెండో ప్రపంచయుద్ధం తర్వాత జపాన్‌లో సమురాయ్‌లకు కలిగిన ముప్పుతో కథకు మూల బీజం వేసి ఆసక్తిగా కథను ముంబైలో ల్యాండ్ చేయడం బాగుంది. కథలో క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు సుజిత్ కొంత సమయం ఎక్కువగా తీసుకోవడం ఫస్టాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ ల్యాగ్ అనిపిస్తాయి. కానీ పవన్ కల్యాణ్ ఎంట్రీ, యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్‌తో సుజిత్ కేక పెట్టించాడు. దాంతో ఫస్టాఫ్‌ను ఎక్ట్రార్డినరీగా క్లోజ్ చేసి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు. కణ్మని, ఓజీ మధ్య ఇంకా కొన్ని సీన్ల ఉంటే మరింత ఫీల్ గుడ్‌గా ఉండేది. సింగిల్ ఎజెండాతో గ్యాంగ్‌స్టర్ డ్రామాను నడిపించడం రొటీన్, రెగ్యులర్‌గా కథ సాగినట్టు అనిపిస్తుంది.

భారీ అంచనాలతో సెకండాఫ్ మొదలైన తర్వాత డాటర్ సెంటిమెంట్‌తో కథను మరింత బలంగా మార్చాడు. ముంబైకి తిరిగి వచ్చి ఓజాస్ గంభీర.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్స్‌పెక్టర్ (అభిమన్యు సింగ్నను బెదిరించే ఎపిసోడ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఇక ఓమీ, ఓజీ మధ్య జరిగే ఫేస్ టూ ఫేస్ సీన్లు, అలాగే.. అర్జున్, ఓజీల మధ్య ఛేజింగ్ సీన్లు సినిమాలో హైలెట్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో వాషి ఓ వాషితో ఫినిషింగ్ టచ్ బాగుంది. ఇక పార్ట్ కోసం ఇచ్చిన ట్విస్ట్ అంచనాలు పెంచింది. అయితే సెకండాఫ్‌లో అంతా ఊహించినట్టే సాగడం వల్ల కొంత మేరకు థ్రిల్లింగ్ మూమెంట్స్ తగ్గినట్టు అనిపిస్తాయి. కథ పాతదే అయినప్పటికీ.. జపాన్‌లోని సమురాయ్ పాయింట్ సినిమాకు కొత్తదనం తీసుకొచ్చిందనిపిస్తుంది.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ స్వాగ్, స్టయిల్, ఫైట్స్ స్పెషల్ ఎట్రాక్షన్. ఇలాంటి సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు పవర్ స్టార్ ఫుల్ మీల్స్ అందించాడు లవ్, ఎమోషన్స్ సీన్లలో పవన్ కొత్తగా కనిపించాడు. ఫస్ట్ టైమ్ పవన్ మీనింగ్ ఫుల్ యాక్షన్ డ్రామాలో క్రేజీగా కనిపించాడు. ప్రియాంక మోహన్ కనిపించేది కొంతసేపైనా ఫుల్ మార్కులు కొట్టేసింది. శ్రీయారెడ్డి కొన్ిన సీన్లలో తన మార్కును చూపించింది. ఇమ్రాన్ హష్మీ ఓమీగా పవర్ ఫుల్ విలన్‌గా నటించి పవర్ స్టార్‌కు సవాల్ విసిరాడా? అనేంతగా నటించాడు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇతర పాత్రలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో కనిపించిన ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేలా దర్శకుడు డిజైన్ చేశాడనిపిస్తుంది.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. రెగ్యులర్ రివేంజ్ గ్యాంగ్‌స్టర్ కథను దర్శకుడు సుజిల్ స్టైలిష్‌గా తెర మీద ఆవిష్కరించిన తీరు అద్బుతంగా ఉంది. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా తీర్చిదిద్దాడు. ఎంచుకొన్న కలర్ ప్యాటర్ సినిమాను క్లాస్‌గా, రిచ్‌గా మార్చింది. ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణంగా మారింది. టోటల్‌గా ఆయన తన మ్యూజిక్ విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. పలు సన్నివేశాలను ఓ రేంజ్‌లో ఆడించేశాడు. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. డీవీవీ దానయ్య అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్, నటీనటుల ఎంపిక బాగుంది.
OG సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీకి సుజిత్, తమన్, పవన్ కల్యాణ్ ముగ్గురు హీరోలుగా కనిపిస్తారు. ఈ ముగ్గురు సినిమాకు మూలస్థంభాలుగా నిలిచి టీమ్ వర్క్ చేశారనిపిస్తుంది. రెగ్యులర్ గ్యాంగ్ వార్ డ్రామా అయినప్పటికీ.. రెండో ప్రపంచయుద్దం, జపాన్‌లో జరిగిన సంఘటనలు ఈ స్టోరిని డ్రైవ్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పటి వరకు తెలుగు తెర మీద రానుటువంటి స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా అభిమానులకు పండుగ లాంటి సినిమా. ఆకలితో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులకు ఫుల్స్ మీల్స్ లాంటింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్, డాటర్ సెంటిమెంట్ ఉన్న గ్యాంగ్‌స్టర్ సినిమా ఇది. మీరు అలాంటి సినిమాలను ఇష్టపడితే డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











