Ambati OG Movie Review: ఓజీ మూవీపై అంబటి రాంబాబు రివ్యూ.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన They Call Him OG మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ వసూళ్లను రాబడుతున్నది. డీవీవీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తున్నది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీమియర్లు, తొలి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది. అయితే ఈ సినిమాపై ముందు నుంచి ఉత్సాహం చూపిస్తున్న వైసీపీ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో రివ్యూను అందించారు. ఆయన రివ్యూపై నెటిజన్లు ఘాటుగా స్పందించి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇంతకు ఈ సినిమా గురించి అంబటి ఇచ్చిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

OG సినిమా రిలీజ్‌కు ఓ వీడియోను రిలీజ్ చేస్తూ.. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 1 గంటలకు సినిమా రిలీజ్ అవుతున్నది. నాకు ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకొంటున్నాను. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే? గతంలో పవన్ నటించిన బ్రో, హరిహర వీరమల్లు సినిమాలు సరిగా ఆడలేదు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కసితో పవన్ కల్యాణ్ గారు.. పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం. దానితోపాటు డైరెక్టర్‌కు ఆయన తీసిన రెండు సినిమాలు విజయం అందించలేకపోయాయి. కాబట్టి ఈ సినిమాతో హిట్టు కొట్టాలని కసితో కృషి చేసి ఉంటారు. ఇక ఈ సినిమా నిర్మాత దానయ్య .. ఎంత ఖర్చైనా పెట్టి ఈ సినిమాను తీయాలి. ఘన విజయం సాధించేలా చేయాలనే గట్టి పట్టుదల కనిపించింది. ఈ పట్టుదల మధ్య ఈ మధ్య జరిగిన షూటింగ్ వల్ల ఖచ్చితంగా మెరుగై ఫలిత వస్తుందనే నమ్మకం కలిగింది. ఆయన అన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉంటారని నేను భావిస్తున్నాను అని అంబటి అన్నారు.

OG Movie Review by Ambati Rambabu

ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు సినిమా ఆడలేదు. ఆ సినిమాకు సరిగా గ్రాఫిక్స్ చేయలేదు. చివరకు ఈ సినిమా రిలీజై చాలూ అనే వరకు వచ్చారు. అలాంటి పద్దతిలో సినిమా షూటింగ్ జరిగింది. కానీ OG సినిమా విషయంలో రాష్ట్ర బాధ్యతలను, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను పక్కన పెట్టి ఈ సినిమా షూటింగ్ చేశారు. పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు ఫ్లాప్ కావాలని మేము కోరుకోవడం లేదు. ఆయన మాకు రాజకీయంగా ప్రత్యర్థి కావొచ్చు. మాకు కొన్ని విమర్శలు చేయాల్సి ఉంటుంది. అవి కూడా సద్విమర్శలే చేస్తాం అని ఆయన అన్నారు.

ఓజీ సినిమా రిలీజ్ తర్వాత అంబటి మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులకు మంచి జరగకూడదు అని ఎవరికైనా అనుకోవడం సరికాదనేది నా ఉద్దేశం. కానీ ఓజీ రిలీజ్ తర్వాత నేను కోరుకొన్నట్టు జరగలేదు. నేను కోరుకొన్నట్టు ప్రజాదరణ పొందలేకపోయింది. కేవలం అభిమానులకు కొద్దిగా రుచించినా.. న్యూట్రల్ ప్రేక్షకులకు నచ్చలేదని థియేటర్లలో కొందరు వ్యక్తీకరిస్తున్నారు. ఈ సినిమా అనుకొన్నంత స్థాయిలో విజయం సాధించలేదని నిర్మోహమాటంగా చెప్పాలని అనుకొంటున్నాను. ఇలా చెప్పగానే.. జనసైనికులు గానీ, పవన్ కల్యాణ్ వీరాభిమానులు నాపై మండిపడటం ఖాయం. నేనోదే రాజకీయ కక్ష్యతో చెప్పానని అంటారు. అది వారికి మూర్ఖత్వానికి అర్ధం. ఈ సినిమా దానయ్యకు ధనాన్ని చేకూర్చుతుందని అనుకొన్నాను. కానీ దానయ్యకు దండగ చేకూర్చుతుందని చెప్పదలచుకొన్నాను అని అంబటి అన్నారు.

అంబటి చెప్పిన వీడియో రివ్యూపై నెటిజన్లు, పవర్ స్టార్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. జగన్ మింగినట్టు ఉన్నాడు. అందుకే మాట మార్చాడు. మీరు సినిమా ఫీల్డ్‌కు వచ్చేయండి.. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు అవుతారు. ఈడు సినిమా రివ్యూలకు ఎక్కువ.. రాజకీయాలకు తక్కువ అని.. నవరంధ్రాలు మూసుకొని ఉండటం బెటర్. బయట ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. నేను కూడా ఈ సినిమా చూశాను. బాగుంది. ఎవరి వద్దకైనా వెళ్లి ఈ మాట ఇంకోసారి చెప్పకు.. అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: og ambati rambabu pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X