For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Oh! Baby సినిమా రివ్యూ అండ్ రేటింగ్

|
Oh Baby Movie Review And Rating || ఓ బేబీ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

Rating:
2.5/5
Star Cast: సమంత అక్కినేని, లక్ష్మీ, నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు
Director: బీవీ నందినీరెడ్డి

అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత కెరీర్‌లో మరో హిట్ పడిందా? సమంత స్టార్‌డమ్‌కు ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడింది.. నందినీరెడ్డికి ఖాతాలో మరో హిట్ చేరిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను సమీక్షించాల్సిందే.

 ఓ బేబీ మూవీ కథ

ఓ బేబీ మూవీ కథ

బేబీ (లక్ష్మీ) కల్మషం లేని వృద్ధురాలు. విధి ఆడిన నాటకంలో బలైన ఓ మధ్య తరగతి యువతిగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడుతుంది. భర్త చనిపోతూ చేతిలో పెట్టిన కుమారుడు (రావు రమేష్) ఆమెకు సర్వస్వం. అలాంటి కొడుకుకు తల్లి భారంగా మారుతుంది. తప్పని పరిస్థితిలో ఇంటిని వీడిపోవాల్సి వస్తుంది. అయితే అనూహ్యమైన పరిస్థితిలో 24 ఏళ్ల యువతి స్వాతి (సమంత)గా మారిపోతుంది. చిట్టి (రాజేంద్ర ప్రసాద్)తో కలిసి జీవితాన్ని ఆస్వాదించే సమయంలో ఓ సమస్య ఎదురు పడుతుంది.

 ఓ బేబీలో మలుపులు

ఓ బేబీలో మలుపులు

అత్యంత ఇష్టంగా ప్రేమించిన కుమారుడికి బేబీ ఎందుకు దూరమైంది? ఏ పరిస్థితుల్లో బేబీ 24 ఏళ్ల యువతిగా మారింది? 70 ఏళ్ల నుంచి పడుచు అమ్మాయిలా మారిన తర్వాత ఎదురైన సమస్యలు ఏమిటి? ఆ తర్వాత స్నేహితుడు (రాజేంద్ర ప్రసాద్)తో కెమిస్ట్రీ తెరపైన ఎలా పడింది? నాగశౌర్య క్యారెక్టర్ ఏంటి? దూరమైన తల్లి కోసం శేఖర్ ఎలాంటి ఆవేదనకు గురయ్యాడు. శేఖర్ కుటుంబం బేబీ విషయంలో ఎలా రియలైజ్ అయిందనే ప్రశ్నలకు సమాధానం ఓ బేబీ కథ.

ఫస్టాఫ్‌ అనాలిసిస్

ఫస్టాఫ్‌ అనాలిసిస్

గడుసుతనం, పొగరుబోతు తనం, భోళాతనం, దయ అంశాలు కలబోసిన 70 ఏళ్ల బేబీ క్యాంటిన్ నిర్వాహకురాలిగా కథ మొదలవుతుంది. రాజేంద్ర ప్రసాద్ సహాయకుడి జత కలవడంతో మాటలు తూటల్లా, సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగిపోతుంటాయి. కథలో కాన్‌ఫ్లిక్ట్ కారణంగా బేబీ (లక్ష్మీ' స్థానంలోకి సమంత (స్వాతి)గా ప్రవేశిస్తుంటుంది. అప్పటి వరకు ఆహ్లాదకరంగా సాగుతున్న నదీ ప్రవాహం సమంత ఎంట్రీతో కుదుపుకు లోనైనట్టు అనిపిస్తుంది. సమంత హైపర్ యాక్టివ్, ఎనర్జీ కొత్త కోణాన్ని చూపిస్తుంది. తొలిభాగంలో సమంత ఒంటిచేత్తో కథను ఫీల్‌గుడ్‌గా ముందుకు తీసుకెళ్తుంది. ఓ చిన్న ట్విస్టుతో తొలిభాగానికి తెరపడుతుంది.

సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

ఇక సెకండాఫ్‌లో కథలోకి అనేక అంశాలు ప్రవేశించడంతో కొంత గందరగోళంగా అనిపిస్తుంది. మ్యూజిక్ కాంపిటీషన్స్ పెద్ద పీట వేయడం ద్వారా ఎమోషనల్‌గా ఉండే స్టోరి పక్కదారి పట్టినట్టు కనిపిస్తుంది. అయితే రాజేంద్ర ప్రసాద్ తన సహజమైన నటనతో మళ్లీ ట్రాక్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు చాలా సార్లు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో సహజ నటనకు, ఆర్టిఫియల్ యాక్టింగ్‌కు పోటీ జరుగుతుందా అనే ఫీలింగ్ కలగకమానదు. సెకండాఫ్‌ అంతో ఇంతో ఎమోషనల్‌గా ఉందంటే.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ పుణ్యమే అనిపిస్తుంది. కథను సాగదీసి చివరకు సుఖాంతం చేయడం సాదాసీదాగా ముగింపు పలికారనే ఫీలింగ్ కలుగుతుంది. నాగశౌర్య, సమంత ఎపిసోడ్స్‌లో భావోద్వేగం లోపించినట్టు కనిపిస్తున్నది. అలాగే సమంత తన మళ్లీ వాస్తవ రూపంలోకి వెళ్లే సీన్ హడావిడిగా ఉండటం రక్తికట్టించలేకపోయిందనే ఫీలింగ్ కలుగుక మానదు.

నందినిరెడ్డి టేకింగ్

నందినిరెడ్డి టేకింగ్

సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న దర్శకురాలు నందిని రెడ్డి సరైన కథను పట్టుకోవడంలోనే సగానికిపైగా విజయం సాధించిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఓ బేబీ కోసం ఎంపిక చేసుకొన్న నటీనటులు, రాసుకొన్న సన్నివేశాలతో సక్సెస్ మరికొంత ఈజీ అయిపోయింది. తెరపైన సమంతలో కనిపించే హైపరాయక్టివిటీని తగ్గించి ఉంటే మరీ బాగుండేదనిపిస్తుంది. లక్ష్మీ ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇలాంటి ఇబ్బంది కలగడం సహజమే. కానీ తొలిభాగంలో కథను పరుగులు పెట్టించిన నందినీ రెడ్డి.. సెకండాఫ్‌కు వచ్చే సరికి స్టోరిలో యాంగిల్స్ ఎక్కువ కావడం కొంత గందరగోళానికి, తడబాటుకు గురయ్యారా అనిపిస్తుంది. నిడివి కూడా కథ చెప్పే వేగానికి కళ్లె వేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక రావు రమేష్, సమంత మధ్య సీన్లు, లక్ష్మీతో రావు రమేష్, రాజేంద్రప్రసాద్ సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఓవరాల్ నందినీ రెడ్డి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు.

లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ నటన అదుర్స్

లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ నటన అదుర్స్

ఓ బేబీ చిత్రం గురించి చెప్పుకోవాలంటే.. లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ ఫెర్ఫార్మెన్స్ గురించి ముందుగా చెప్పుకోవాలి. టాలీవుడ్‌కు మా లాంటి నటులు ఎంత ముఖ్యమో అనే విషయాన్ని వీరిద్దరూ తెర మీద చూపించారు. బేబీగా తొలి 30 నిమిషాలు అదరగొట్టారు. తన నటన, డైలాగ్స్, ఎమోషన్స్ పలికించడంలో లక్ష్మీ తెరపైన అద్భుతంగా కనిపించింది. ఇలాంటి అమ్మమ్మో, నానమ్మో ఉంటే బాగుండేదని.. ఒకవేళ లేకపోతే వారి మొమోరీస్ ప్రేక్షకులను వెంటాడే రేంజ్‌లో లక్ష్మీ మెప్పించారు. ఇక రాజేంద్ర ప్రసాద్‌ను నట కిరీటీ ఎందుకు అంటారో మరోసారి ఓ బేబీ సినిమాలోని పాత్ర ద్వారా చూపించారు. ఈ సినిమాకు రాజేంద్ర ప్రసాద్ ఓ ఎసెట్. 60 వృద్దుడి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన ఆహార్యం (లుక్) తెర మీద చూస్తుంటే ముచ్చటేసిందనే చెప్పాలి. సినిమాను పూర్తిగా నిలబెట్టారనే ఫీలింగ్ వీరిద్దరూ కలిగించారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

సమంత యాక్టింగ్

సమంత యాక్టింగ్

ఇక సమంత ఫెర్ఫార్మెన్స్ విషయంలో ఎలాంటి తప్పులు వెతకే అవసరం లేదు. కాకపోతే కాస్తా హైపర్ యాక్టివ్‌ను కాస్త తగ్గిస్తే స్వాతి పాత్ర మరింత మెప్పు సాధించేదేమో అనిపిస్తుంది. కమర్షియల్ హంగుల కోసం ప్రయత్నించకపోయి ఉంటే ఎమోషనల్‌గా పాత్రను దిద్ది ఉంటే సమంత మరింత ఆకట్టుకొనేదేమో అనిపిస్తుంది. లుక్, గ్లామర్ విషయంలో అదరగొట్టింది. చుట్టూ బలమైన క్యారెక్టర్లు ఉండటం వలన సమంత ఫెర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ కావడానికి ఛాన్స్ దక్కింది.

మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో రావు రమేష్ మరోసారి భావోద్వేగమైన నటనతో ఆకట్టుకొన్నాడు. నాగశౌర్య తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు. ఊర్వశి తనకు లభించినవి కొన్ని సీన్లయినప్పటికీ.. గుర్తుండిపోతుంది. ప్రగతి రొటీన్ పాత్రలో మరోసారి కనిపించింది. ఐశ్వర్య (నాగశౌర్య తల్లి) ఫర్వాలేదనిపించింది. రాజా రవీంద్ర, తదితరులు సినిమాలో భాగమమయ్యారు.

మాటలు తూటల్లా..

మాటలు తూటల్లా..

తెర వెనుక విషయాలకు వస్తే.. నటీనటులు తెరపైన అద్భుతంగా రాణించడానికి ప్రధాన కారణం లక్ష్మీ భూపాల మాటలు. గోదావరి భాష యాస, సామెతలతో కేక పెట్టించాడు. భావోద్వేగమైన మాటలను లక్ష్మీ, రావు రమేష్, సమంత, రాజేంద్ర ప్రసాద్ చేత చెప్పించిన డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా రావు రమేష్, సమంత మధ్య ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్‌ వరకు సన్నివేశాలకు డైలాగ్స్ మరింత బలం చేకూర్చాయి. ఇక ఆరంభంలో లక్ష్మీ కోసం రాసిన డైలాగ్స్ కూడా చాలా సహజంగా ఉండటమే కాదు.. ఫీల్ గుడ్‌ను కలిగిస్తాయి. రిలీజ్‌కు ముందు సమంత ఇచ్చిన కాంప్లిమెంట్స్‌లో 100 శాతం నిజాయితీ కనిపిస్తుంది. మరోసారి లక్ష్మీ భూపాల తన కలం పవర్ చూపించాడు.

ఎడిటింగ్, మ్యూజిక్

ఎడిటింగ్, మ్యూజిక్

ఓ బేబీ సినిమాకు ప్రధాన ప్రతికూల అంశాలు సంగీతం, ఎడిటింగ్. అద్భుతమైన కథకు ఆహ్లాదకరమైన పాటలను అందించడంలో మిక్కీ జే మేయర్ పూర్తిగా విఫలమయ్యాడు. సెకండాఫ్‌లో మ్యూజిక్ కాంపిటీషన్స్ ప్రధాన అంశం. అలాంటి ఎపిసోడ్స్‌లో ఎమోషనల్‌గా రీరికార్డింగ్ కనిపించదు. పాటలు కూడా మనసును హత్తుకునేలా లేవు. సినిమా నిడివి ప్రధానమైన లోపం. ఈ లోపానికి కారణం ఎడిటరా? అందులో దర్శకురాలికి కూడా భాగముందా అనేది వాళ్లకే తెలియాలి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

వృద్ధులు కుటుంబానికి భారం కాదు.. ఓ సంపద లాంటి వాళ్లు అనే భావోద్వేగమైన పాయింట్‌తో చెప్పిన కథ ఓ బేబీ. లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అద్భుతమైన నిధిలా కనిపిస్తారు. సమంత ఎప్పటిలానే హైపర్‌యాక్టివ్ బిహేవియర్‌తో తన సత్తాను చాటుకున్నది. సెకండాఫ్‌లో రకరకాల అంశాలు సినిమాను పట్టు తప్పేలా చేశాయి. కొన్ని లాజిక్‌లకు అతీతంగా సినిమా తెరకెక్కించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే, వీకెండ్‌లో కుటుంబంతోపాటు చక్కగా చూడగలిగే సినిమా. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఆదరిస్తే.. కమర్షియల్ సక్సెస్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.

బలం, బలహీనత

బలం, బలహీనత

ప్లస్ పాయింట్స్

  • లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ ఫెర్ఫార్మెన్స్
  • సమంత గ్లామర్, రావు రమేష్, ఇతర నటీనటుల యాక్టింగ్
  • ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్
  • నిడివి
  • మ్యూజిక్ కాంపిటీషన్ ఎపిసోడ్స్
  • మ్యూజిక్, ఎడిటింగ్

తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు

సమంత అక్కినేని, లక్ష్మీ, నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, రావు రమేష్, తేజ సజ్జా, ప్రగతి, ఐశ్వర్య, ఉర్వశి, ప్రియదర్శి, ధనరాజ్, అడివి శేషు, నాగచైతన్య (గెస్ట్) తదితరులు

స్క్రీన్ ప్లే, డైరెక్టర్: బీవీ నందినీరెడ్డి

నిర్మాతలు: డీ సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వ ప్రసాద్, థామస్ కిమ్

మాటలు: లక్ష్మీ భూపాల

సంగీతం: మికీ జే మేయర్

సినిమాటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్

ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ

రిలీజ్: 2019-07-05

English summary
Samantha Akkineni is facing a critical situation after marriage. She said, I am not getting offers after Marriage. film offers dried up when she announced her marriage with Naga Chaitanya. Now She is doing Oh! baby and Manmadhudu movies.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more