Oh Bhama Ayyo Rama Movie Review: ఓ భామ అయ్యో రామ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సుహాస్, మాళవిక మనోజ్, అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నాయని పావని మరియు ఇతరులు
దర్శకత్వం: రామ్ గోధాల
నిర్మాత: హరీష్ నల్లా
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్రఫి : ఎస్ మణికందన్
ఎడిటర్ : భవిన్ ఎం షా
బ్యానర్: V ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2025-07-11
మూవీ ఇండస్ట్రీలో పనిచేసే రామ్ (సుహాస్)కు సినిమాలంటే అయిష్టం. అలాంటి వ్యక్తి జీవితంలోకి సత్యభామ (మాలవిక మనోజ్) అతడి జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకొంటారు. రామ్‌కు ఇష్టం లేకున్నా.. డైరెక్టర్ హరీష్ శంకర్ వద్ద అతడిని అసిస్టెంట్‌గా చేర్పిస్తుంది. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో రామ్‌కు సత్యభామ ఓ పెట్టకూడని కండిషన్ పెడుతుంది. అయితే గత్యంతరం లేని కారణంగా ఆమె కండిషన్‌కు తలవంచాల్సి వస్తుంది.

ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే రామ్‌కు సినిమాలంటే అంటే ఎందుకు ఇష్టం ఉండదు? రామ్ జీవితంలోకి సత్యభామ ఎలా ప్రవేశించింది. వారిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? రామ్‌ను హరీష్ శంకర్ వద్ద ఎందుకు చేర్పించింది? రామ్ గత జీవితం ఏమిటి? తన తల్లి (అనిత)తో ఉన్న జర్నీ ఏమిటి? రామ్‌కు సత్యభామ పెట్టిన కండీషన్ ఏమిటి? రామ్ ఎందుకు ఆ కండిషన్‌ను ఒప్పుకొన్నాడు? ఇంతకు సత్యభామ ఎవరు? చివరకు రామ్ తన ముందు ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఓ భామ అయ్యో రామ సినిమా కథ.
మదర్ సెంటిమెంట్, లవ్, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు రామ్ గోధాల ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ ఆ బలమైన కథకు అంతే బలంగా ఉన్న సన్నివేశాలను రాసుకోవడంలో తడబాటు కనిపిస్తుంది. రామ్, సత్యభామ మధ్య లవ్ ట్రాక్ కొత్తగా అనిపించదు. చాలా రొటీన్‌గా కథ, కథనాలు ఉన్నాయి. కానీ ఇంటర్వెల్‌లో ఓ మంచి ట్విస్ట్ ఇచ్చి.. ఫస్టాఫ్‌ను ముగించడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా చేశాడు.
సినిమా సెకండాఫ్‌పై ప్రేక్షకులు పెట్టుకొన్న అంచనాలకు తగినట్టుగానే దర్శకుడు రామ్ కథను నడిపించాడు. హీరోయిన్ పెట్టిన కండీషన్ తర్వాత రామ్ పరిస్థితి అదోలా మారడం.. ఆ తర్వాత మదర్ సెంటిమెంట్‌తో కథను ఎమోషనల్‌గా నడిపించాడు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు స్టోరిని నడిపించిన తీరు.. ట్విస్ట్‌తో క్లైమాక్స్‌ను ముగించిన విధానం బాగుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కామన్ మ్యాన్‌గా రామ్ క్యారెక్టర్‌లో సుహాస్ మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకొన్నాడు. పలు అంశాల మధ్య నలిగిపోయే పాత్రలో ఒదిగిపోయారు. లవర్, కొడుకుగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మరోసారి మెప్పించే విధంగా నటించాడు. సత్యభామగా మాళవిక మనోజ్ తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశారు. సుహాస్ తల్లిగా నువ్వు నేను ఫేమ్ అనిత సర్‌ప్రైజ్ క్యారెక్టర్‌లో కనిపించారు. భారమైన, భావోద్వేగమైన పాత్రలో ఒదిగిపోయారు. సుహాస్ తండ్రి పాత్రలో రవీంద్ర విజయ్, మాళవిక మనోజ్ తండ్రిగా బబ్లూ పృథ్వీ, సుహాస్ స్నేహితుడిగా సాత్విక్, నయని పావని తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. మణికందన్ సినిమాటోగ్రఫి, బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్, రధన్ మ్యూజిక్, ఈ సినిమాకు ప్లస్ పాయింట్, ఈ సినిమాలోని సన్నివేశాలకు రథన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథ డిమాండ్ చేయడంతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాత హరీష్ నల్లా ఉత్తమ నిర్మాణ విలువలను పాటించారు. సినిమా రిచ్‌గా క్వాలిటీగా కనిపిస్తుంది.
ఈ సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాల్సి వస్తే.. ఈ సినిమాకు సుహాస్, అనిత, మాళవిక మనోజ్ నటన, సాంకేతిక అంశాలు ప్లస్ పాయింట్. బలమైన కథ లేకపోవడం, ఎంచుకొన్న కథను రొటీన్‌గా, రెగ్యులర్‌గా చెప్పడం మైనస్‌గా కనిపిస్తుంది. ఇంకా ఎమోషన్స్ మరింతగా పండి ఉంటే.. ఈ సినిమా డెఫినెట్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అయి ఉండేది. ప్రజెంట్ జనరేషన్ ఆడియెన్స్ మామూలు కథలు అంతగా రుచించడం లేదు. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయితే మంచి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. సుహాస్ సినిమాలను, అలాగే మదర్ సెంటిమెంట్ ఆధారంగా ఉండే చిత్రాలను ఇష్టపడే వారు ఈ సినిమాను థియేటర్‌లో ఈ వారం చూసే సినిమాల జాబితాలో చేర్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications











