Oh..! Sukumari First Review: ఓ.. సుకుమారి! మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ హీరో, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఓ సుకుమారి. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్ రెడ్డి మూలీ నిర్మించారు. సంతోషి, శబరీష్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆనంద్, ఝాన్సీ, విష్ణు ఓఐ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ గవిరెడ్డి, సురభి ప్రభావతి తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సీహెచ్ కుషేందర్ రెడ్డి, మ్యూజిక్: భరత్ మాచిరాజు, ఎఢిటర్: శ్రీ వరప్రసాద్, ప్రోడక్షన్ డిజైనర్: తిరుమల ఎం, తిరుపతి, కొరియోగ్రాఫర్: జేడీ మాస్టర్, కాస్టూమ్ డిజైనర్: అనురెడ్డి అక్కటి, యాక్షన్: వింగ్ చున్ అంజి తదితరులు తమ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 17వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Oh    Sukumari Review by Censor Board

సీతాపురం గ్రామంలో మగరాయడిలా అల్లరి చేస్తూ వీరంగం చేసే సుకుమారి (ఐశ్వర్య రాజేశ్)‌తో గ్రామస్థులు ఇబ్బందులు పడుతుంటారు. పెళ్లి చేస్తే గానీ ఆమె చిలిపి చేష్టల నుంచి బయటపడలేమని గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. ఆ క్రమంలో యాదగిరి (తిరువీర్)తో పెళ్లి చూపులు జరుగుతాయి. అయితే సుకుమారి గురించి తెలియని యాదికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సుకుమారి మగరాయుడిలా బిహేవ్ చేయడానికి కారణం ఏమిటి? సుకుమారికి ఉన్న సమస్య ఏమిటి? సుకుమారితో యాది, గ్రామస్థుల ప్రయాణం ఎలా సాగింది? అనేది ఈ సినిమా కథ.

ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో సాగే రూరల్, యాక్షన్, కామెడీ డ్రామాను సెన్సార్ సభ్యులు, ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. ఈ సినిమాలో కంటెంట్‌కు పెద్దగా అభ్యంతరం తెలియజేయకుండానే క్లియరెన్స్ ఇచ్చారు. సినిమాను వినోదభరితంగా రూపొందించిన తీరుపై, అలాగే ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ పాత్రల గురించి చిత్ర యూనిట్‌ను ప్రత్యేక అభినందించారు అని తెలిసింది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు యూఏ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమా క్లీన్ ఎంటర్‌టైనర్ అని క్లియెరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 13 ఏళ్లకుపైబడిన వారందరూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది. ఈ సినిమా కథ, కథనాలు డిమాండ్ మేరకు ఈ మూవీ నిడివి సాధారణ స్థాయిలోనే ఫిక్స్ చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 17 నిమిషాలు. అంటే ఈ చిత్రం 137 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు సెన్సార్ సర్టిఫికెట్ వెల్లడించింది.

లేడీ ఓరియెంటెడ్ కథగా ఐశ్వర్య రాజేశ్ చుట్టు అల్లుకొన్న కథలో తిరువీర్ ఎమోషనల్ క్యారెక్టర్ ఆకట్టుకొనేలా ఉంటుంది. విష్ణు, జీవన్, ఝాన్సీ, మురళీధర్ గౌడ్ కామెడీ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంటుంది. ఈ ఎలిమెంట్స్ వర్కవుట్ అయితే ప్రేక్షకుల ఆదరణకు గురి అవ్వడం ఖాయమనే అభిప్రాయంతో సినిమా యూనిట్ ఉంది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X