అలరించే ఒక్కడు

By Staff

Okkadu
-జలపతి
చిత్రం: ఒక్కడు
నటీనటులు: మహేష్‌ బాబు, భూమిక ప్రకాష్‌ రాజ్‌,
ముఖేష్‌ రుషి, సంగీత, రాజన్‌.పి.దేవ్‌
సంగీతం: మణిశర్మ
నిర్మాత: ఎం.ఎస్‌.రాజు
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్‌

కమర్షియల్‌ పంథాలో, హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూనే ఒక్కడు చిత్రాన్ని ఆకట్టుకునే విధంగా రూపొందించడంలో దర్శకుడు గుణశేఖర్‌ విజయం సాధించాడు. మహేష్‌ బాబు హీరోయిజానికి, రాయలసీమ నేపథ్యంతో జోడించి తీసిన ఈ చిత్రంలోనూ లోపాలున్నా, చివరికి కథనంలో చూపించిన నవ్యత వల్ల సినిమా బోర్‌ కొట్టకుండా సాగుతుంది. రాయలసీమ ముఠా కక్షల మీద ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. కాబట్టి వాటి మీద మళ్ళీ సినిమా తీయడం సాహసమే అవుతుంది.

అందుకే దర్శకుడు గుణశేఖర్‌ కేవలం దాన్ని బ్యాక్‌ డ్రాప్‌ గా మాత్రమే వాడుకొని మహేష్‌ బాబు హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ సినిమాను సాగించాడు. సినిమాల్లో ఎక్కడా హీరో, హీరోయిన్ల మధ్య రోమాంటిక్‌ సీన్లు లేని ప్రేమకథా చిత్రం ఇది. గుణశేఖర్‌ కథనం, మహేష్‌ బాబు నటన, శేఖర్‌ ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణం అయితే, పరుచూరి బ్రదర్స్‌ పేలవమైన డైలాగ్స్‌, ప్రధాన లోపం. ఇవి మినహాయిస్తే ఈ సినిమా చూడదగ్గ చిత్రం.

మహేష్‌ బాబు కబడ్డీ క్రీడాకారుడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు కర్నూలు వెళతాడు. భూమికను ప్రేమించిన ఓబుల్‌ రెడ్డి(ప్రకాష్‌ రాజ్‌) ఆమెను పెళ్ళి చేసుకునేందుకు ఆమె సోదరిలిద్దరిని చంపేస్తాడు. దీంతో భూమిక తల్లితండ్రులు ఆమెను హైదరాబాద్‌ పారిపోయి అమెరికాలోని తన బాబాయ్‌ దగ్గరికి వెళ్ళి సెటిల్‌ కావాల్సిందిగా కోరుతారు. భూమిక పారిపోతుండగా ప్రకాష్‌ రాజ్‌ మధ్యలోని పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తాడు. అక్కడే ఉన్న మహేష్‌ బాబు ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని భావించి ప్రకాష్‌ రాజ్‌ ను కొట్టి భూమికను కాపాడుతాడు.

వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌ పారిపోతారు. భూమికకు పాస్‌ పోర్ట్‌ వచ్చి, స్టూడెంట్‌ వీసా వచ్చేంతవరకు తన ఇంటిలోనే రహస్యంగా ఉంచుతాడు. (భూమిక ప్రమేయం లేకుండానే కర్నూలు అమ్మాయికి మహేస్‌ పాస్‌ పోర్ట్‌ ఇప్పిస్తాడు. స్టూడెంట్‌ వీసా కూడా సంపాదిస్తాడు. ఇదెలా సాధ్యమని అమాయకంగా అడగకూడదు. మనక్కుండా అంత ఈజీగా వీసా వస్తే బాగుండు అని కోరకూడదు. అదీ సినిమా. జీవితం వేరు.)

కానీ ఓబుల్‌ రెడ్డి అన్న హోంమంత్రి(రాజన్‌ పి.దేవ్‌). హోంమంత్రి ఆదేశాల మేరకు సిటీ అంతా గాలిస్తారు మహేష్‌ కోసం. మహేష్‌ తండ్రి కూడా పోలీసాఫీసర్‌. చివరికి వీళ్ళద్దరూ పట్టుబడుతారు. మహేష్‌ ను జైల్లో వేస్తారు. భూమికును పెళ్ళిచేసుకునేందుకు ప్రకాష్‌ రాజ్‌ సిద్దపడుతుండగా ఆమె అతని మగతనాన్ని ప్రశ్నిస్తుంది. మహేష్‌ ను నిజంగా ఓడించి మగవాడివని నిరూపించుకుంటే పెళ్ళి చేసుకుంటానని సవాల్‌ విసురుతుంది. ఇక క్లైమాక్స్‌ లో ఎవరూ మగతనాన్ని నిరూపించుకుంటారో తెలిసిందే కదా!

సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకునే మహేష్‌ ఈ చిత్రంలోనూ చక్కటి నటన ప్రదర్శించాడు. కానీ తన ట్రేడ్‌ మార్క్‌ నవ్వును అధికంగా చిందిస్తే బాగుండేది. భూమిక భయాన్ని, టెన్సన్‌ ప్రకటించడమే పని. సింపుల్‌ నటన. మణిశర్మ సంగీతం బాగుంది. కానీ ఈ సినిమాల్లో పాటలే కథనంలో ఒదగలేదు. ప్రకాష్‌ రాజ్‌ నటన సాధారణమే.

ముఖేష్‌ రుషి నటన బాగుంది. శేఖర్‌ జోషెఫ్‌ పోటోగ్రఫీ, అశోక్‌ కుమార్‌ కళాదర్శకత్వం ఈ సినిమాకు ఎస్సెట్స్‌. మొత్తం చార్మినార్‌ ఏరియా సెట్‌ నిజమనిపించేలా అశోక్‌ కుమార్‌ రూపొందించాడు. గుణశేఖర్‌ కథనం బాగున్నా, సినిమాలో ఇంకా ఎడిట్‌ చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఆకట్టుకునే కమర్షియల్‌ చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X