twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫర్వాలేని చిత్రం

    By Staff
    |

    Okariki Okaru
    -జలపతి గూడెల్లి
    చిత్రం: ఒకరికి..ఒకరు
    నటీనటులు: శ్రీరామ్‌, ఆర్తి చాబ్రియా
    సంగీతం: కీరవాణి
    నిర్మాత: పి.కిరణ్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: రసూల్‌

    ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రసూల్‌ దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలో అనేక తప్పటడుగులు వేశాడు. టెక్నిషియన్‌ గా సక్సెస్‌ అయినా, స్క్రీన్‌ ప్లేపై, కథాగమనంపై పట్టులేకపోవడంతో ఆయన తొలి ప్రయత్నం ఆకట్టుకోలేకపోయింది. కీరవాణి అందించిన చక్కటి సంగీతం, అందమైన దృశ్యాలున్నా..సినిమాలో ప్రేక్షకుడు ఇన్వాల్వ్‌ అయ్యేవిధంగా స్క్రీన్‌ ప్లే లేదు. దీనికి తోడు సినిమా మరీ స్లోగా నడుస్తుంటుంది. తొలి 20 నిమిషాల ఉపోద్ఘాతం అనవసరం. ఆ తర్వాత కథలో పట్టు పెరిగినా..అది ఒకే తీరుగా సాగలేదు. చివర్లో క్లైమాక్స్‌ మాత్రం బాగా తీశాడు. ఓ మోస్తారు ప్రేమకథా చిత్రం.

    కామేశ్వరరావు (శ్రీరామ్‌)కు తన పేరంటే మొరటుగా అన్పిస్తుంది. ఒకసారి ప్రయాణంలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడుతాడు. ఆ అమ్మాయికి తన పేరు రాహుల్‌ అని చెపుతాడు. ఆమె కూడా తన పేరు సుబ్బలక్ష్మి(ఆర్తి చాబ్రియా) అని అబద్దం చెపుతుంది. వీరు ప్రయాణించే రైలు పలాసలో తుఫాన్‌ కారణంగా ఆగిపోతుంది. సో..వీరంతా అక్కడే రెండు రోజులు ఉండాల్సి వస్తుంది. దీంతో..ఇరువురి మధ్య ప్రేమ చిగురిస్తుంది. హీరోయిన్‌ తన ప్రయాణం మధ్యలోనే ఆపేసి..తిరిగి అమెరికా వెళ్ళాళ్సి వస్తుంది. ఇక సెకాండాఫ్‌ అంతా హీరో అమెరికాలో జాబ్‌ సంపాదించడం, అక్కడ ఆమెను వెతకడం..వంటి సీన్లతోనే సాగుతుంది. చివరికి వారు ఎలా కలుసుకున్నారనేది క్లైమాక్స్‌.

    శ్రీరామ్‌ కిది తొలి తెలుగు స్ట్రెయిట్‌ చిత్రం. హీరో బాగా చేశాడు. హీరోయిన్‌ ఆర్తి ఓకే. ఈ సినిమాలో కామెడీ ఏ మాత్రం లేకపోవడం ప్రధాన లోపం. ఒక కామెడీ క్యారెక్టర్‌ ఉన్నా అది పెద్దగా నవ్వు తెప్పించదు. కీరవాణి సంగీతమే ఈ సినిమా పెద్ద ప్లస్‌ పాయింట్‌. సినిమాటోగ్రాఫర్‌ సునీల్‌ రెడ్డి చిత్రీకరణ మరో హైలెట్‌. కోన వెంకట్‌ డైలాగ్స్‌ లో పసలేదు. కొన్ని డైలాగ్‌ లైతే మరీ గ్రాంథికంగా ఉన్నాయి. రసూల్‌ దర్శకుడిగా నిరూపించుకోవాలంటే కథ, కథనంపై మరింత దృష్టిసారించాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X