For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Oke Oka Jeevitham Review ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించిన శర్వానంద్.. కానీ.. ఆ ఒక్కటే మైనస్!

  |

  Rating:
  3.0/5
  Star Cast: Sharwanand, Amala Akkineni, Ritu Varma
  Director: Shree Karthick

  నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అమలా అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు
  దర్శకత్వం: శ్రీకార్తీక్
  నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాశ్ ప్రభు, ఎస్ఆర్ ప్రభు
  డైలాగ్స్: తరుణ్ భాస్కర్
  మ్యూజిక్: సుజిత్ సారంగ్
  మ్యూజిక్: జేక్స్ బిజోయ్
  ఆర్ట్ డైరెక్టర్: ఎన్ సతీష్ కుమార్
  స్టంట్స్: సుదేశ్ కుమార్
  పీఆర్వో: వంశీ శేఖర్
  రిలీజ్ డేట్: 2022-09-09

  ఒకే ఒక జీవితం కథ ఏమిటంటే?

  ఒకే ఒక జీవితం కథ ఏమిటంటే?


  మ్యూజిక్ రంగంలో రాణించాలని కలలుకనే ఆది (శర్వానంద్) చిన్నతనంలోనే తన తల్లి (అమల అక్కినేని)ని యాక్సిడెంట్‌లో కోల్పోతాడు. దాంతో ఆత్మస్థైర్యం సడలి ఈవెంట్స్‌లో విఫలం చెందుతుంటాడు. ఆది స్నేహితులు చైతూ (ప్రియదర్శి), శ్రీను (వెన్నెల కిషోర్) తమ వ్యక్తిగత సమస్యలతో బాధపడుతుంటాడు. తల్లి మరణంతో ఓ రకమైన బాధలో ఉన్న ఆదికి, జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడే శ్రీను, చైతూకు ఓ సైంటిస్టు (నాజర్) తారసపడుతాడు. టైమ్ మిషన్‌ ద్వారా వారి బాల్యంలోకి తీసుకెళ్తానని ఓ ప్రయోగం చేస్తాడు.

  కథలో ట్విస్టులు ఇలా..

  కథలో ట్విస్టులు ఇలా..


  టైమ్ మిషన ద్వారా బాల్యం నాటి రోజులకు వెళ్లిన ఆది తన తల్లిని కలిశాడా? చిన్నతనంలో బాగా చదువుకొని ఉంటే బ్రోకర్ గిరి చేయకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉండేవాడనిననే భావించే శ్రీను తిరిగి తన బాల్యానికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? చిన్ననాటి స్నేహితురాలిని ఇష్టపడిన చైతుకు తిరిగి తన ప్రేమను పొందాడా? తన తల్లిని యాక్సిడెంట్ కాకుండా కాపాడే ప్రయత్నంలో ఆది సఫలమయ్యాడా? టైమ్ మిషిన్ ద్వారా బాల్యంలోకి వెళ్లిన ఆది, శ్రీను, చైతూ తిరిగి వచ్చారా? బాల్యం నుంచి వర్తమాన పరిస్థితులకు రావడానికి ఈ ముగ్గురికి ఎదురైన సమస్యలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఒకే ఒక జీవితం.

  దర్శకుడు ప్రతిభ గురించి

  దర్శకుడు ప్రతిభ గురించి


  టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ ద్వారా అమ్మ ప్రేమను పొందాలని ఆరాటపడే యువకుడి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను ఓ పాయింట్‌గా ఆలోచించడం దర్శకుడు శ్రీ కార్తీక్ ఓ స్థాయిలో సక్సెస్ సాధించడానే చెప్పవచ్చు. కానీ ఆ పాయింట్‌ను కథగా విస్తరించడం, వాటికి భావావేశాలు, భావోద్వేగాలు జోడించడంలో తడబాటు కనిపిస్తుంది. చనిపోయిన తల్లి వద్దకు వెళ్లడమనే పాయింట్‌ను ఎమోషనల్‌గా దర్శకుడు కార్తీక్ చెప్పడంలో కొంత వరకే సఫలమయ్యాడు. కాకపోతే చిన్ననాటి క్యారెక్టర్లకు, ప్రస్తుత క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీని పండించడంలో ఒకే అనిపిస్తాడు. తల్లి, కొడుకుల మధ్య బంధం, అనుబంధాలు హృదయాన్ని పిండేసే రేంజ్‌లో కనిపించకపోవడం మైనస్ అని చెప్పవచ్చు.

  ఫస్టాఫ్.. సెకండాఫ్ ఎనాలిసిస్

  ఫస్టాఫ్.. సెకండాఫ్ ఎనాలిసిస్


  తల్లి అండలేని కారణంగా ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొలేని ఆది తన ప్రేయసి ( రీతూ వర్మ) అసరాతో జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. అలాంటి సమయంలో ఊహించని విధంగా తల్లిని కలుసుకొనే విధంగా సైంటిస్ట్ ఎదురుపడటం గత జీవితంలోకి వెళ్లడం చకచకా జరిగిపోతాయి. గతంలోకి టైమ్ మిషన్ ద్వారా వెళ్లడం లాజిక్స్ లేకుండా నాసిరకంగా లాగించే ప్రయత్నం కన్విన్స్ చేయలేకపోతుందని చెప్పవచ్చు. ఇంటర్వెల్‌లో హిట్లర్, సైరా సినిమాల రిలీజ్ బ్యాక్ డ్రాప్‌తో మంచి ట్విస్టుతో ప్రథమార్థం ముగిస్తారు. అయితే సెకండాఫ్‌లో స్లో నేరేషన్, కథను సాగదీసినట్టు ఉండటం సినిమాకు మైనస్‌గా మారిందనిపిస్తుంది

  శర్వానంద్ ఫెర్ఫార్మెన్స్ గురించి

  శర్వానంద్ ఫెర్ఫార్మెన్స్ గురించి


  ఇక ఆదిగా శర్వానంద్ తెరపైన ఎమోషనల్‌గా కనిపించాడు. క్లైమాక్స్‌లో 15 నిమిషాలు శర్వా క్యారెక్టర్ బాగా పండింది. పలు రకాల ఎమోషన్స్‌తో కూడిన పాత్రను తన వంతుగా మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. చాలా రోజుల తర్వాత తెరపైన కనిపించిన అమల ఒకే అనిపించారు. ఇక ఆది ప్రేయసి వైష్ణుగా రీతూ వర్మ అతిధి పాత్రకే పరిమితమయ్యారు. పిల్లలతో డీల్ చేసే సమయంలో రీతూ ఆకట్టుకొన్నారు. ఫ్లాట్ నేరేషన్‌లో సాగుతున్న కథను చైతుగా ప్రియదర్శి, శ్రీనుగా వెన్నెల కిషోర్ ఫీల్‌గుడ్‌గా, వినోదాత్మకంగా మార్చడం కాస్త ఉపశమనంగా ఉంటుంది. నాజర్ పాత్ర సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా అనిపిస్తుంది.

  బాలనటులు హితేష్, నిత్యరాజ్, ఆదిత్య

  బాలనటులు హితేష్, నిత్యరాజ్, ఆదిత్య


  ఇక బాల్యంలో ఆది అలియాస్ కుట్లుగా జయ్ ఆదిత్య, చైతూగా హితేష్, శ్రీనుగా నిత్యరాజ్ అద్బుతంగా నటించారు. ముఖ్యంగా నిత్యరాజ్ పెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్ హైలెట్ అనిచెప్పవచ్చు. ఓ దశలో వెన్నెల కిషోర్‌తో పోటాపోటీగా నిత్యరాజ్ నటించాడనే ఫీలింగ్ కలుగుతుంది. హితేష్, జయ్ ఆదిత్య తమ పాత్రలకు న్యాయం చేశారు.

  టెక్నికల్ అంశాల గురించి

  టెక్నికల్ అంశాల గురించి


  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే. ఒకే ఒక జీవితం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి, జేక్స్ బిజోయ్ మ్యూజిక్. సుజిత్ సారంగ్ ఈ సినిమాను బ్యూటిఫుల్ క్వాన్వాస్‌గా మారిస్తే.. బీజీఎంతో జేక్స్ బిజోయ్ అదరగొట్టాడు. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్‌కు ఇంకా పని ఉందనిపిస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

  ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  తల్లి, కొడుకు మధ్య ఉండే భావోద్వేగాలతో రూపొందిన చిత్రం ఒకే ఒక జీవితం. టెక్నాలజీ ఎంత పెరిగినా జీవితంలో విధిరాతను ఎవరూ తప్పించలేరనే పాయింట్‌తో అండర్ కరెంట్‌గా ఈ సినిమా రూపొందింది. అయితే టైమ్ ట్రావెల్ పాయింట్‌ను సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం, ఎమోషనల్‌గా కథకు ఆడియెన్‌ను కనెక్ట్ చేయలేకపోవడం మైనస్‌గా కనిపిస్తుంది. శర్వానంద్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ అయితే.. ఎమోషన్స్ హై రేంజ్‌లో పండకపోవడం మైనస్‌గా మారింది. అయితే ఇటీవల కాలంలో ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించడం సానుకూలమైన అంశం. అక్కడక్కడ కంటతడి పెట్టించే అంశాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చితే కమర్షియల్‌గా ఏ రేంజ్‌ సక్సెస్ అనేది స్పష్టమవుతుంది. వీకెండ్‌లో ఓసారి ఫ్యామిలీ అంతా చూడటానికి ఆస్కారం ఉన్న క్లీన్, గ్రీన్ చిత్రం ఒకే ఒక జీవితం.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  శర్వానంద్ ఫెర్ఫార్మెన్స్
  ఆకట్టుకొన్న బాల నటులు
  మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఇతర సాంకేతిక అంశాలు

  మైనస్ పాయింట్స్

  స్లో నరేషన్
  లాజిక్స్ లేకుండా

  English summary
  Actor Sharwanand's latest movie is Oke Oka Jeevitham released on september 09th. Here is the exclusive revview from filmibeat Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X