'ఒకేమాట' ఒకే ఆట?

By Staff

Oke Maata
చిత్రం: ఒకేమాట
నటీనటులు: ఉపేంద్ర, రమ్యకృష్ణ, రాశి
నిర్మాత: అంబికా కృష్ణ
దర్శకత్వం: ముత్యాల సుబ్యయ్య

ప్రేమకథలు, వినూత్నమైన కథనంతో వైవిధ్యమైన సినిమాలు వస్తోన్న రోజుల్లో తాతల కాలంనాటి కథతో తీసిన చిత్రం-'ఒకేమాట'. హీరో ఉపేంద్రకున్న మాస్‌ ఇమేజిని దృష్టిలో పెట్టుకొని కాలం చెల్లిన 'ప్రతీకారం' కథాంశంగా నిర్మించిన చిత్రమిది. చిత్రంగా టేకింగ్‌ కూడా 80వ దశకం స్టయిల్లో ఉంది. చిత్రంలో ఎక్కడా ప్రేక్షకులు ఇన్‌ వాల్వ్‌ అయ్యే సన్నివేశాలు లేవు. ఈ సినిమాకు దర్శకుడు ముత్యాలసుబ్బయ్య అంటే నమ్మలేం.

ఉపేంద్ర సముద్రంలో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. తను ఉండే మీనంపేటకు, సాటి మత్స్యకారులకు పెద్దదిక్కు. ఏ ఆపద వచ్చినా, ఎవరికి కష్టమొచ్చిన ఆదుకుంటాడు. ఆ పేటకు తనే ముఠామేస్త్రీ. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రమ్యకృష్ణ సహాయంతో ఆ పేటకు దగ్గరలో ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఓ కెమికల్‌ ఫ్యాక్టరీ పెడుతారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థపదార్ధాలు సముద్రంలో కలవడం వల్ల చేపలు మరణిస్తాయి. దీనివల్ల తాము జీవనాధారం కోల్పోతున్నామని, రసాయనాలు సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఉపేంద్ర ఆ ఫ్యాక్టరీ యాజమానులను అడుగుతాడు. ఇందుకు రమ్యకృష్ట ఒప్పుకోకపోవడంతో గొడవ జరుగుతుంది. దీంతో పోలీసులు ఉపేంద్రను అరెస్ట్‌ చేస్తారు. కోర్టులో కొన్ని ఆవేశపూరిత డైలాగుల తర్వాత తను ఒక లాయరని, రమ్యకృష్ణ తన భార్యని చెపుతాడు. ఇక ప్లాష్‌ బ్యాక్‌........

నాగేంద్రబాబు కూలీ పనిచేసుకుంటూ తన తమ్ముడు ఉపేంద్రని కష్టపడి చదివిస్తుంటాడు. ఉపేంద్ర ఆంధ్రా యూనివర్శిటీ లో లా చదువుతుంటాడు. తన జూనియర్‌ రమ్యకృష్ణను ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు-ఇరువైపుల పెద్దల అంగీకారంతో. నాగేంద్రబాబు మత్స్యకారుల సంఘం ఎన్నికల్లో నిలబడుతాడు. ఆ సందర్భంగా జరిగిన గొడవల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోతారు. దీంతో భయపడి నాగేంద్రబాబు పారిపోతాడు. ఉపేంద్ర తన అన్నని ఒప్పించి పోలీసుల ముందుకు తీసుకువస్తాడు. ఎన్నికల్లో నిలబడ్డ ఎదుటివర్గం వారిని కూడా తీసుకు వస్తానని ఉపేంద్ర బయటికి వెళ్ళగానే పోలీసు ఇన్స్‌ పెక్టర్‌ నాగేంద్రబాబుని చంపేస్తాడు.

ప్రతీకారంగా హీరో ఆ ఇన్స్‌ పెక్టర్‌ ను నరికివేస్తాడు. కానీ అతన్ని చంపింది ఉపేంద్ర కాదనీ, చనిపోయిన నాగేంద్ర బాబు అనీ ఓ కానిస్టేబులు చేత అబద్దపు సాక్ష్యం చెప్పించి తన భర్తను కాపాడుకుంటుంది రమ్యకృష్ణ. అసలు తన అన్నని ఇన్‌స్పెక్టర్‌ చేత చంపించిందెవరో కాదు రమ్యకృష్ణ అన్న అని ఉపేంద్రకి తెలుస్తుంది. ఇంకేముంది అతన్ని కూడా చంపేందుకు ప్రయత్నిస్తాడు. బ్యాలెన్స్‌ తప్పి అతనే డాబా మీది నుంచి కిందపడి మరణిస్తాడు. దీంతో రమ్యకృష్ణ ఉపేంద్రకు గుడ్‌ బై చెప్పి, అతణ్ణి ఉరికంబం ఎక్కించేంతవరకు తాను నిద్రపోనని శపథం చేస్తుంది. కానీ, చివరకు చాల మెలోడ్రామా తర్వాత రమ్యకృష్ణ అసలు విషయం తెలుసుకుంటుంది. ఉపేంద్రతో ఏకమవుతుంది.

నటన పరంగా చూస్తే- రమ్యకృష్ణ చాలా బాగా చేసింది. సినిమా ఆసాంతం గెడ్డం, అడ్డదిడ్డంగా పెరిగిన జుట్టుతో ఉపేంద్ర ప్రేక్షకులను భయపెడుతాడు. అదేంటో స్టూడెంట్‌ గా ఉన్నప్పుడు కూడా అదే గెటప్‌ ఉంచడమేంటో అర్థం కాదు. ఒక పాటకు తప్పిస్తే ఎందుకూ పనికి రాని పాత్ర రాశిది. ఎం.ఎస్‌.నారాయణ, బాబుమోహన్‌ ల హాస్యం ఏ మాత్రం పండలేదు. చిత్రంలోని పాటలూ ఎవరికీ అర్థం కావు. ప్రేక్షకులకు తలనొప్పి తప్పా వినోదం అణుమాత్రం పంచని చిత్రమిది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X