ఒక్క మగాడు సినిమా సమీక్ష

By Staff
Rating
సినిమా: ఒక్క మగాడు
విడుదల తేదీ: 11-1-08
నటీనటులు: బాలకృష్ణ, నిషా కొఠారి, అనుష్క, సిమ్రన్, అశుతోష్ రాణా, కోట శ్రీనివాసరావు, కృష్ణభగవాన్,
రఘుబాబు, చలపతిరావు తదితరులు
సమర్పణ: యలమంచిలి గీత
సంగీతం: మణిశర్మ
నిర్మాత, దర్శకుడు: వైవిఎస్ చౌదరి

ఎంతో కాలం పాటు నిర్మాణంలో ఉండి, వార్తల్లో వెలిగిన ఈ సినిమా నిస్సందేహంగా ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తోంది. అరిగిపోయిన, తుప్పు పట్టిన స్క్రీన్ ప్లే, పనికిమాలిన గ్రాఫిక్స్, బాలకృష్ణకు నప్పని గెటప్స్, చెవికి ఇంపుగా లేని పాటలు సినిమాను దారుణంగా దెబ్బతీశాయి. పదును లేని దర్శకత్వం మరో పెద్ద మైనస్ పాయింట్.

కథ: అది వెంకటాపురం గ్రామం. వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్ అలియాస్ రాము ( బాలకృష్ణ) ఆ గ్రామస్ధులకు అచ్చంగా దేవుడు. ఆయనను దేవాది దేవుడిగా వారు పరిగణిస్తారు. కానీ బాలకృష్ణ మాత్రం వారికి తాను మామూలు మనిషినని చెబుతూ ఉంటాడు. కానీ ఆయన వారికి ఆపద్బాంధవుడు. ప్రభుత్వ యంత్రాంగానికి హీరో గారంటే హడల్. ఒకరోజు హీరో గారు ఒక ప్రేమ జంటకు పెళ్ళి చేస్తాడు. పెళ్ళి కొడుకు చాలా గొప్ప కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి సాక్షాత్తూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి (అశుతోష్ రాణా).

అదే సమయంలో "భారతీయుడు" వంటి వృద్ధుడు అవినీతిపరుల మీద విరుచుకుపడి అంతం చేస్తూ ఉంటాడు. రాము (బాలకృష్ణ)కు , ఆ వృద్ధుడికి ఉన్న పోలికలను పోలీసులు గుర్తిస్తారు. ఆ వృద్ధుడిని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తారు. అతను యువ బాలకృష్ణ కాదని, వృద్ధ బాలకృష్ణ అని, ఆయన బ్రిటీష్ పాలకుల మీద పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడని తెలుసుకుంటారు. దీనితో ముఖ్యమంత్రికి, వృద్ధ బాలకృష్ణకు మధ్య సంఘర్షణ ప్రారంభమౌతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X