twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క మగాడు సినిమా సమీక్ష

    By Staff
    |

    ఈ సినిమా కథ శంకర్ ఏనాడో తీసిన భారతీయుడు సినిమాకు దాదాపు కాపీ. సర్దార్ పాపారాయుడు సినిమా అంశ కూడా కొంత ఉంది. మొత్తం మీద బాలకృష్ణ నటన పవర్ ఫుల్ గా ఉంది. కానీ కథా కథనం బాగుండక పోవడంతో ఇంత పెద్ద సినిమా కూడా నీరుగారిపోయింది.

    అనుష్క , నిషా కొఠారి బాలకృష్ణ సరసన చక్కగా సరిపోయారు. కానీ విలన్ ఆసుతోష్ రాణా పాత్ర చిత్రణ సరిగా లేదు. ఆయన ముఖ్యమంత్రి అన్న స్పృహ లేకుండా దర్శకుడు సినిమా తీయడం దారుణం. ఇక హాస్యనటులు కృష్ణ భగవాన్ , రఘుబాబు తమ పరిమిత పాత్రలు చేశారు. రంగనాథ్, విజయ్ చందర్, కోట శ్రీనివాసరావులు అప్రధాన పాత్రల్లో కన్పిస్తారు. అంత ప్రముఖ నటులను అంత అప్రధాన పాత్రలకు ఎంపిక చేసుకోవడంలోని ఔచిత్యమేమిటో అర్ధం కాదు.

    ఈ సినిమాలో హాస్యం గానీ, పాటలు కానీ చాలా పూర్. మొదటి ఆటలోనే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. బాలకృష్ణ అభిమానులు మాత్రం కొంత వరకు ఆనందించగలరు.

    Prev | Next

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X