twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూస్తే అశాంతే!! (ఓం శాంతి రివ్యూ)

    By Srikanya
    |
    Om Shanti
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్: త్రీ ఏంజిల్స్ స్టూడియో
    నటీనటులు: మాధవన్, నవదీప్, నిఖిల్, కాజల్, అదితి శర్మ, బిందు మాధవి,
    మురళి మోహన్, రవికాలే, సునీల్, ప్రగతి, రఘుబాబు తదితరులు.
    ఆర్ట్: భూపేష్.ఆర్.భూపతి
    కెమెరా: జై విన్సింట్
    ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
    సంగీతం: ఇళయరాజా
    మాటలు: గంధం నాగరాజు
    సమర్పణ: సి.ధర్మరాజు
    నిర్మాతలు: శేషు ప్రియాంక చలసాని
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దంతులూరి ప్రకాష్
    రిలీజ్ డేట్: జనవరి 14, 2010

    "ఐదు కథలు..ఒక నిజం" అంటూ ఊదరకొట్టి ఏదో గొప్ప చిత్రం రాబోతోంది అన్నంత బిల్డప్ ఇచ్చి మరీ వచ్చింది 'ఓ శాంతి' చిత్రం. కథ చెప్పటం చేతకాక,స్క్రీన్ ప్లే ఇబ్బందితో ప్రేక్షకులకు పూర్తి స్ధాయి అశాంతి నే మిగిల్చింది. మరో ప్రక్క ఈ చిత్రంలో మల్టిఫుల్ నేరేషన్ పక్రియలో కథనం నడుస్తుంది. అయితే దర్శకుడు సరిగా అర్దం చేసుకుని ప్రెజెంట్ చేయకపోవటంతో సినిమా మొత్తం కిచిడి లా తయారై చూసేవారికి దశ,దిశ లేకుండా పోయింది. వీటికితోడు సినిమా ప్రారంభం నుండీ కంటిన్యూగా టెర్రరిస్టులు గోల. దాంతో ఎప్పుడు ఇంటర్వెల్,శుభం పడతాయా..ఎప్పుడు బయిటపడతామా అన్న ఎదురు చూపు.

    మేఘన(కాజల్) ఎప్పుడూ వెరైటీ,ధ్రిల్స్ అంటూ తింగరబుచ్చిలా పనులు మానేసి తిరుగుతూంటుంది.ఆమెకు మ్యాడీ(మాధవన్) అనే రేడియో జాకీ పరిచయం అవుతాడు. ఇక తేజ (నిఖిల్) సినిమా పిచ్చితో హైదరాబాద్ వచ్చి రవితేజ లాంటి పెద్ద హీరో అవ్వాలని ప్రయత్నిస్తూంటాడు. అంతేగాక ప్రెండ్స్ దగ్గర ఓ లక్ష తీసుకుని ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పినవాడి చేతిలో పోసి మోసపోతాడు. ఆనంద్(నవదీప్) సత్యంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి లవర్ అంజలి (అదితి శర్మ). ఆర్దికమాంధ్యం వచ్చి ఆనంద్ ఉద్యోగం ఊడితే ఆమె తండ్రి వేరే సంభందాలు చూస్తూంటాడు.దాంతో ఆ ప్రేష్టేషన్ లో ఆనంద్ నలిగిపోతూంటాడు. నూర్(బిందు మాధవి) పెళ్ళి సెట్ అయి కలలు కంటున్న ముస్లిం యువతి. ఆమె అన్న టెర్రరిస్టులతో కలిసి బాంబులు తయారు చేసి హైదరాబాద్ ని పేల్చేయాలని ప్లాన్ చేస్తూంటాడు. మరో ప్రక్క రియల్ ఎస్టేట్ వారికి పొలాన్ని అమ్మటం ఇష్టం లేక భర్త చనిపోతే కొడుకుతో సిటీ చేరిన రైతు భార్య(ప్రగతి) కథ.

    ఇవన్నీ దేనికదే మరో దానితో సంభందం లేకుండా నడుస్తూంటాయి. ఎవరికి వారే తమదైన సమస్యలతో ఇబ్బందిపడుతూంటారు. అయితే ఓ రోజు వీరందరూ ఓ ఖాళీగా ఉండే బస్ స్టాప్ కు క్యాజువల్ గా చేరుతారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్టు అక్కడ టెర్రరిస్టులు బాంబులు పెడతారు..(అదేంటి అంత ఖాళీగా ఉండే చోట టెర్రరిస్టులు బాంబులు పెట్టి ఏం సాధిస్తారు అనొద్దు). అలాగే టెర్రరిస్టులు తమ బాంబు పేలితో కొన్ని కిలోమీటర్లు మేరకు దెబ్బ తింటుంది అంటారు. కానీ తర్వాత చూస్తే ఆ బాంబు పేలిన ప్రాంతం కూడా పెద్దగా నాశనం కాదు..ఇలాంటి సందేహాలు ప్రక్కన పెట్టితే తర్వాత ఏం జరిగిందిందనేది మిగతా కథ.

    'బాణం' వంటి క్రిటికల్ ఎక్లైమ్ చిత్రం నిర్మించిన త్రి ఏంజిల్స్ బ్యానర్ సెకెండ్ వెంచర్ అంటే సహజంగానే అందరిలో ఆసక్తి. మరో ప్రక్క సినిమా వాళ్ళకు సైతం ఆసక్తి కలిగేలా రెగ్యులర్ స్క్రీన్ ప్లే కాకుండా మల్టి ఫుల్ నేరేషన్ ఎటెమ్ట్ చేసారు. కానీ ఆ నేరేషన్ పై పెద్దగా వర్క్ చేయలేదనేలా సీన్స్ తయారయ్యాయి. కథలో క్లైమాక్స్ వరకూ ఐదు పాత్రలను, వారి సమస్యలను పరిచయం చేయటమే సరిపోయింది. క్లైమాక్స్ లో ఆ పాత్రలు ఐదు బాంబు పెట్టిన ప్లేసు కు వస్తాయి. పోని ఆ బాంబు పేలిన తర్వాత ఈ పాత్రల జీవితాల్లో ఏం జరగదు. ఖడ్గం చిత్రంలోలాగ హీరోలంతా కలిసి ఆ బాంబ్ బారి నుంచి అందరినీ రక్షించేయటంతో సినిమా ముగిసిపోయింది.

    అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఈ ఐదుగురు బాంబులు పెట్టిన బస్ స్టాప్ కి ఎలా చేరుకోబోతున్నారు అనేది తర్వాత చూడండి అని వేసారు. నిజానికి వాళ్ళు ఎలా ఆ ప్లేసుకు చేరుకున్నారనే విషయం ప్రేక్షకులకు పెద్దగా పట్టదు. అక్కడ ఏదన్నా సంఘటన జరిగితే తర్వాత ఆ పాత్రలు ఏం చేస్తారో, ఎలా బిహేవ్ చేస్తారో, వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దామని కూర్చుంటారు కానీ..ఎలా అక్కడికి చేరుతారు(అంటే ఆటోల్లో వస్తారా..బస్సులో వస్తారా..ప్లైట్ లో వస్తారా అనే డౌట్ తప్ప ఏమీ అన్పించదు) .అదే ఇలాంటి నేరేషన్ తో వచ్చిన ముంబయి మేరీ జాన్ అనే హిందీ చిత్రంలో కరెక్టుగా ఉంటుంది. అక్కడ బాంబు పేలిన తర్వాత తాము మొదట పరిచయం చేసిన వ్యక్తుల జీవితాల్లో ఏం మార్పు వచ్చిందనే ది దర్శకుడు సుస్పష్టం చేస్తారు. ఎందుకంటే ఏ నేరేషన్ కైనా మినిమం బేసిక్స్ బిగిన్,మిడిల్,ఎండ్ అనేవి ఉంటేనే చూసేందుకు అవకాసం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఆ పాత్రలను పరిచయం చేసి, ఓ బాంబు పేల్చాము అంటే ఇబ్బందే. ఇలాంటి కథతో దర్శక,నిర్మాతలు తమ చిత్రంపై తామే స్వయంగా బాంబు వేసుకున్నట్లయింది.

    ఇక ఈ చిత్రంలో నటీనటులు అందరూ తమ పరిధి మేరకు బాగానే చేసారు. నవదీప్ అయితే చక్కగా పరిణితి చెందినట్లు నటన ప్రదర్శించాడు. అయితే బిందు మాధవి పాత్రే అర్ధం,పర్ధం లేకుండా పోవటంతో ఇబ్బంది అనిపించింది. నిఖిల్ ఎప్పటిలాగే రవితేజను అనుకరిస్తూ తన సహజమైన నటనను ప్రదర్శించాడు. అదితి శర్మ,కాజల్ ని నటనలో డామినేట్ చేసింది. ఇక పోలీస్ గా చేసిన ఆర్టిస్టు బాగా చేసాడు. మురళి మోహన్,తణికెళ్ళ,రవికాలే,శివారెడ్డి లను సరిగా వినియోగించుకోలేదు. రఘుబాబు ఉన్నంతలో సీనియర్ కోడైరక్టర్ పాత్రలో నవ్వించాడు.సునీల్ బాగా చేస్తున్నా చిక్కిన అతని రూపం పోల్చుకోనివ్వటం లేదు..నవ్వు రానివ్వటం లేదు.

    ఇక కొత్త తరహా ప్రయత్నం చేసినందుకు దర్శక,నిర్మాతలను అబినందించాలి. అలాగే తనకు లొంగని నేరేషన్ ని ఎటెమ్ట్ చేసి,స్క్రిప్టు బాగా చేసుకోనందకు,మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నందుకు దర్శకునిదే బ్యాడ్ లక్ అనుకోవాలి. స్క్రీన్ ప్లే నే ఇంతనీరసంగా ఉంటే దానికి తగ్గట్లుగా ఇళయరాజా సంగీతం మరింత డల్ గా సాగింది. అసలు ఆ పాటలు ప్లేస్ మెంటే విచిత్రంగా ఉంది. మిగతా డిపార్ట్ మెంట్ లు సినిమాని డామినేట్ చెయ్యలేదు. అంతవరకూ ఓకే.

    నిక్కిచ్చినగా చెప్పాలంటే ఈ సినిమా చూడటం మాత్రం పరమబోర్. అంతగా ముచ్చటగా ఉంటే టీవిల్లో వచ్చాక చూడటం మేలు. ఎందుకంటే అందులో విసుగు,బోరు అన్పించినప్పుడు ప్రక్క ఛానెల్ కు వెళ్ళే ఫెసిలిటీ ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X