Om Shanti Shanti Shanti Movie Review: ఓం శాంతి శాంతి శాంతి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా, బ్రహ్మానందం, బ్రహ్మజీ, సురభి ప్రభావతి, రోహిణి తదితరులు
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏఆర్ సంజీవ్
నిర్మాతలు: సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ శ్రీనివాసవరపు
మ్యూజిక్: జయ్ క్రిష్
సాహిత్యం: భరద్వాజ్
సినిమాటోగ్రాఫర్: దీపక్ యరగెరా
రిలీజ్ డేట్: 2026-01-30

తల్లిదండ్రుల ఆంక్షలు, కుటుంబ సభ్యుల పరిమితుల మధ్య పెరిగిన ప్రశాంతి (ఇషా రెబ్బా)కి జీవితంపై అసహనంతో ఉంటుంది. తన ఇష్టాలకు భిన్నంగా పరిస్థితులు బాల్యం గడవడంతో స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం కోసం పరితపిస్తూ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటుంది. కాలేజీలో లెక్చరర్‌తో ప్రేమాయణం బెడిసి కొట్టడంతో కొన్ని పరిస్థితుల్లో చేపల వ్యాపారి ఓంకార్ నాయుడు అంబటి (తరుణ్ భాస్కర్)తో వివాహం జరుగుతుంది. అయితే ప్రేమను పంచుతాడని భావించిన భర్త కూడా తనతో మూర్ఖంగా ప్రవర్తించడంతో మరింత అసంతృప్తితో రగలిపోతుంది. తనను శారీరకంగా వేధిస్తున్న భర్త ఓంకార్‌పై ప్రశాంతి తిరుగుబాటు చేసి.. ఎదురుదాడి చేస్తుంది.

బాల్యంలో ప్రశాంతి ఎలాంటి పరిస్థితుల మధ్య పెరిగింది? జీవితంలో తల్లితండ్రులు విధించే ఆంక్షలు ఆమెను మానసికంగా ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టాయి? కాలేజీలో లెక్చరర్‌తో అఫైర్ బ్రేకప్ ఎందుకు జరిగింది? ఎలాంటి పరిస్థితుల్లో ఓంకార్ నాయుడిని ప్రశాంతి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? భర్త ఓంకార్ నాయుడు మూర్ఖంగా ప్రవర్తిస్తే ప్రశాంతి స్పందన ఏమిటి? ఏ పరిస్థితుల్లో భర్త ఓంకార్‌పై ఎదురుదాడికి దిగింది? భర్తను చితకబాదిన ప్రశాంతికి ఫ్యామిలీ నుంచి వచ్చిన రియాక్షన్ ఏమిటి? కోర్టులో భర్తకు విడాకులు ఇవ్వడానికి ఎందుకు నిరాకరించింది? భర్తపై పోరాటం చేసిన ప్రశాంతికి చివరకు లభించిన ఉపశమనం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఓం శాంతి శాంతి శాంతి సినిమా కథ.

Om Shanti Shanti Shanti Hi Movie Review

మధ్య తరగతి కుటుంబంలోని కట్టుబాట్లు, పరిమితుల మధ్య పెరిగిన ఓ అమ్మాయి..స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం కోసం పరితపిస్తూ భర్త నుంచి ప్రేమను పొందాలనుకొనే యువతి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. వాస్తవానికి మలయాళంలోని జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటికి మార్చిన విధానం బాగుంది. అయితే పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు సజీవ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సినిమా సాదాసీదాగా, రొటీన్‌గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో స్టోరీ టేకాఫ్‌కు ఎక్కువ సమయం తీసుకొన్నప్పటికీ.. బలమైన కామెడీ సీన్లు రాసుకొని ఉంటే.. ఫీల్‌గుడ్ సినిమా ముందుకు సాగిన ఫీలింగ్ కలిగేది. ఎప్పడైతే భార్య, భర్తల మధ్య సమస్య చోటు చేసుకొంటుందో.. సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ప్రశాంతి, ఓంకార్ మధ్య గొడవలు చాలా ఫన్‌గా సాగుతాయి. దర్శకుడు ఈ విషయంలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది.

అయితే సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులు ఏమైనా కథను మలుపుతిప్పుతాయని ఆశించిన ప్రేక్షకులకు భార్య, భర్తల గొడవల పాయింట్‌ సాగదీసి సాగదీసి చెప్పడం వల్ల కథలో కొత్తదనం చూపించడానికి స్కోప్ లేకపోయింది. చివరల్లో కోర్టు రూమ్ డ్రామా అటు ఆలోచింపజేసే విధంగాను, ఇటు కామెడీతో బలంగా మారలేకపోయింది. దాంతో కథకు ముగింపు కూడా సమస్యగానే కనిపిస్తుంది. దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకొంటున్నాడో క్లారిటీ లేకపోవడం కథలో ప్రశాంతికి ఉండే అసంతృప్తి, అసహనమే ప్రేక్షకుడికి మిగిలిందా? అనే ఫీలింగ్ కలుగుతుంది.

భార్య, భర్తలు ప్రశాంతి, ఓంకార్‌గా తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. ఆ రెండు పాత్రల చుట్టూ ఉండే సపోర్టింగ్ రోల్స్ నుంచి పెద్దగా సహకారం కనిపించదు. సినిమాను ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా లేకపోవడం వల్ల తరుణ్, ఇషా తమ పరిధిలోనే, లిమిటెడ్ స్పేస్‌లో నటించారు. ఇక ఈ సినిమాను కొంతలో కొంత ఫీల్‌గుడ్‌గా మార్చడంలో బ్రహ్మాజీ ఫుల్ మార్కులు కొట్టేశాడు. శివ నారాయణ, గోపరాజు తదితరులు ఫర్వాలేదనిపిస్తారు. చివర్లో బ్రహ్మానందం తన మార్కు నటనతో ఫినిషింగ్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

డ్రామాకు తక్కువ స్కోప్ ఉన్న ఫ్యామిలీ డ్రామాతో వచ్చే సినిమా మరో రేంజ్‌లో ఉండాలంటే.. భావోద్వేగాలను పండించే విధంగా కథ ఉండాలి లేదా బ్రహ్మండమైన కామెడీని పండించే పాత్రలైనా ఉండాలి. అప్పడే ఆడియెన్స్ కనెక్ట్ కావడానికి, సినిమాను భుజాల మీద మోసే అవకాశం ఉంటుంది. ఈ కథలో ఇలాంటివి లోపించడం వల్ల స్క్రీన్ మీద జరగాల్సిన మ్యాజిక్ కనిపించకుండా పోయిందనిపిస్తుంది. జయ క్రిష్ మ్యూజిక్ కొంత ప్రెష్‌గా ఉంది. దీపక్ సినిమాటోగ్రఫి గోదావరి అందాలను కొత్తగా చూపించే ప్రయత్నం చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథపై మరింత లోతుగా కసరత్తు చేసి.. సెకండాఫ్‌లో ఏదైనా డిఫరెంట్ పాయింట్ జోడించి ఉంటే.. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X