Om Shanti Shanti Shantihi First Review: ఓం శాంతి శాంతి శాంతి: మూవీ ఫస్ట్ రివ్యూ
టాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్, యంగ్ హీరోయిన్ ఇషా రెబ్బా, బ్రహ్మజీ తదితరులు నటించిన ఫ్యామిలీ డ్రామా ఓం శాంతి శాంతి శాంతి: ఈ సినిమాకు ఏఆర్ సంజీవ్ రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు వహించారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ శ్రీనివాసవరపు రూపొందించారు. మలయాళంలో విజయవంతమైన జయ జయహే మూవీకి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచి, నేటివిటికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరక్కించారు.
ఈ మూవీకి మ్యూజిక్: జయ్ క్రిష్, సాహిత్యం: భరద్వాజ్, సినిమాటోగ్రాఫర్: దీపక్ యరగెరాగా వ్యవహరించారు. ఈ సినిమా జనవరి 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. మూవీ వెర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ అధికారులు వీక్షించారు. ఈ సినిమాపై సెన్సార్ ప్రతినిధులు చేసిన రివ్యూ ఏమిటి? వారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

ప్రశాంతి (ఇషా రెబ్బా) తన జీవితంలోని ప్రేమను తన భర్తకే పంచి పెట్టాలని కలలు కంటుంది. ఓ లెక్చరర్‌తో సాగిన అఫైర్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) అనే బిజినెస్‌మ్యాన్‌తో వివాహం జరుగుతుంది. కానీ వారి మధ్య అన్యోన్యత లేకపోవడం వల్ల ప్రతీ నిత్యం గొడవలు, తగువులతో జీవితం సాగుతుంది. ఆ క్రమంలో గర్బస్రావం కూడా జరుగుతుంది. ఓంకార్ వేధింపులపై కోర్టులో ప్రశాంతి ఫిర్యాదు చేస్తుంది. కానీ విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి జీవితంలో ఏం జరిగిందనేది సినిమా కథ.
ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్ అధికారులకు పెద్దగా కంటెంట్‌పై అభ్యంతరాలు తెలియజేయడానికి కారణాలు లేకపోయాయి. కొన్ని చిన్న సలహాలు, సూచనలు ఇచ్చి డైలాగ్స్, సన్నివేశాలను మార్చాలని సూచించారు. ఆ మేరకు చిత్ర యూనిట్ తగిన మార్పులు చేసి బోర్డుకు సమర్పించారు. దాంతో సంతృప్తి చెందిన అధికారులు, ప్రతినిధులు ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చిత్ర యూనిట్ తెలిపింది.
ఓం శాంతి శాంతి శాంతి: సినిమాకు సెన్సార్ అధికారులు యూఏ (UA13+) సర్టిఫికెట్ ఇచ్చారు. దాని ప్రకారరం.. 13 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఈ సినిమాను నిరభ్యంతరంగా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో వీక్షించాల్సి ఉంటుంది అని సెన్సార్ బోర్డు అధికారులు తమ సర్టిఫికెట్‌లో వెల్లడించారు. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 11 నిమిషాలు అంటే.. 131 నిమిషాల రన్ టైమ్ అని తెలిపారు.
ఇక మూవీ విషయానికి వస్తే.. గోదావరి నేటివిటితో సాగే ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా. గోదావరి యాస, భాష ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఒరిజినల్‌గా మలయాళం సినిమా అయినప్పటికీ.. తెలుగు నెటివిటీకి అనుగుణంగా అనేక మార్పులు చేశారు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాలకు నచ్చుతుంది. వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాలో భావోద్వేగాలు కూడా ఉన్నాయి. బీ, సీ ఆడియెన్స్‌తోపాటు మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు నచ్చితే.. ఈ సినిమా విజయాన్ని అందుకోవడం గ్యారెంటీ అనే టాక్ రిలీజ్‌కు ముందు వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











