twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉన్నవి పాత దెయ్యాలే కానీ.. ('రాజుగారి గది' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ప్రేమ కథా చిత్రం హిట్టైన తర్వాత...వరసపెట్టి దెయ్యిం కథలు ఈ మధ్య కాలంలో తెలుగు తెరను ప్రతీ వారం..అవకాసం ఉంటే ప్రతీ వారం పలకరిస్తూ వస్తున్నాయి. కొద్దిగా ఫామ్ లో ఉన్న హీరోయిన్ ప్రధాన పాత్రగా తీసుకుని లో బడ్జెట్ లో లాగించేయివచ్చనే ఆలోచన ఈ సినిమాలకు ప్రాణం పోస్తోంది. ముఖ్యంగా శాటిలైట్ పరంగానూ ఈ తరహా సినిమాలకు బిజినెస్ ఉండటం, ప్రేక్షకులు సైతం వీటిని ఉత్సుకతతో ఆదరిస్తూండటం ప్లస్ అవుతోంది. ఈ ట్రెండ్ ని గమనించే ఓంకార్ అన్నయ్య..జీనియస్ చిత్రం తర్వాత తన తాజా ప్రయత్నంగా ఈ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ తో నడిచినా సెకండాఫ్ కి వచ్చేసరికి రొటిన్ గా నడిచే పాత దెయ్యాల కథగా మారిపోవటం మైనస్ గా మారింది. దెయ్యాలు సినిమాలు చూడటానికి అలవాటుపడిన జనాలు ఇందులో ట్విస్ట్ లను తేలిగ్గా ఊహించేసే పరిస్ధితి ఏర్పడింది. అయితే పండిన కామెడీతో ఓ సారి చూడదగ్గ హర్రర్ కామెడీగా దీన్ని వీకెండ్ కు ఎంపిక చేసుకోవచ్చు.

    అన్ని దెయ్యాల సినిమాల్లో లాగానే ఈ సినిమాలోనూ ఓ పురాతన భవంతి. అందులోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రారంటూ...భవంతి గురించి భయపెట్టే రకరకాల కథలు. ఈ భవంతి ని బేస్ చేసుకుని మా టీవి ఛానెల్ వారు ...దెయ్యంతో ఏడు రోజులు..గెలిస్తే..3 కోట్లు అనే రియాలటీ షో పోగ్రాం పెడుతుంది. ఆ షో లో పాల్గొనటానికి ఓ ఏడుగురు (అశ్విన్, చేతన్ శ్రీను, బార్బీ,విద్యుర్లేఖ, షకలక శంకర్, ధనరాజ్, ధన్య బాలకృష్ణ) బయిలు దేరి వెళతారు. అక్కడ ఆ భవంతిలోవారికి బొమ్మాళ రాజు ఆత్మగా మారి రాసుకున్న డైరీ కనపడుతుంది. ఇంతకీ ఆ భవంతిలో ఏముంది... లేక అక్కడ జరిగే సంఘటనలు...ఛానెల్ వారు భయపెట్టడానికి ఏర్పాటు చేసినవా...ఇంతకీ బొమ్మాళి(పూర్ణ) ఎవరు...ఆమె కథేంటి... ఆ ఏడుగురు పరిస్ధితి ఏమిటి తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

    Omkar's Raju Gari Gadhi Telugu Movie Review

    ఆట, ఛాలెంజ్ వంటి గేమ్ లు మాత్రమే కాక మాయా ద్వీపం వంటి విభిన్నమైన కాన్సెప్ట్ లతో తెలుగు నాట సుపరిచితం ఓంకార్. ఆయన తొలి చిత్రం జీనియస్ ఫెయిల్యూర్ అయినా ఈ సారి మరింత పట్టుదలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఫస్టాఫ్ లో రాసుకున్నట్లుగా సెకండాఫ్ స్క్రిప్టు పరుగెత్తేలా ప్లాన్ చేసుకోలేకపోయారు.దాంతో చాలా డ్రాగ్ అయిన ఫీల్ వచ్చింది. చాలా హర్రర్ సినిమాలుకు వచ్చే సమస్యే ఈ సినిమాకూ వచ్చింది.ఫ్లాష్ బ్యాక్ రాగానే ప్లాట్ అయ్యిపోయింది. అలాగే క్లైమాక్స్ కు వచ్చేసరికి మరీ నీరసపడిపోయింది. అక్కడున్న ట్విస్ట్ అనుకున్న స్ధాయిలో పేలలేదు.దాంతో జస్ట్ ఓకే సినిమాగా అనిపిస్తుంది.

    అప్పటికీ షకలక శంకర్, విద్యుల్లేఖ రామన్ తమదైన కామెడీతో సినిమాను లాక్కొచ్చారనే చెప్పాలి. ముఖ్యంగా బాత్రూం సీన్ లో దానం గా.. దెయ్యంతో అతను పడే పాట్లు బాగా నవ్విస్తాయి. అలాగే ...క్యారక్టరైజేషన్స్ మరికొంత బలంగా రాసుకోవాల్సింది అనిపిస్తుంది. చేతన్ పాత్ర అప్పటివరకూ మామూలుగా ఉండి..ట్విస్ట్ రివీల్ అయ్యాక ప్రవర్తలో మార్పు వచ్చి సైకోలాగ బిహేవ్ చేయటం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓంకార్ తమ్ముడు అశ్విన్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. అతని కోసమే ఈ సినిమా తీసినప్పటికి అతని కెరీర్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూడాలి.

    సినిమా హైలెట్స్ లో ... ఆర్ట్ డైరక్టర్ సురేష్ సాహి దే ప్రధమ తాంబూలం. సినిమాకు అదే ప్లస్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రాఫర్ జ్ఞానం ఆ వర్క్ ని హైలెట్ చేసాడు. అలాగే సాయి మాధవ్‌ బుర్రా రాసిన డైలాగులు చాలా చోట్ల అర్దవంతంగా సాగాయి. సాయి కార్తీక్ ..పాటల కన్నా రీరికార్డింగ్ బాగా ఇచ్చాడు.

    Omkar's Raju Gari Gadhi Telugu Movie Review

    ఫైనల్ గా... లారెన్స్ 'గంగ ' (ముని 3) ని గుర్తు చేస్తూ మొదలయ్యే ఈ చిత్రం రీసెంట్ గా వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం ' చంద్రకళ', 'గీతాంజలి' తరహాలో ఈ సినిమా అలరిస్తుంది. అయితే ఫస్టాఫ్ ఉన్నట్లు సెకండాఫ్ కూడా ఉంటే మరో ప్రేమ కధా చిత్రమ్ వచ్చి ఉండేదనటంతో సందేహం లేదు.

    బ్యానర్: ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: అశ్విన్‌బాబు, చేతన్‌, ధన్య బాలకృష్ణన్‌, పూర్ణ, విద్యుల్లేఖ రామన్‌, శకలక శంకర్‌, పోసాని, పవిత్రా లోకేశ్‌, ధనరాజ్‌, సప్తగిరి, విద్యుల్లేఖ రామన్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు
    మాటలు: సాయి మాధవ్‌ బుర్రా,
    సంగీతం:సాయికార్తీక్‌,
    ఎడిటర్‌: నాగరాజు,
    కెమెరా: జ్ఞానం,
    లైన్‌ ప్రొడ్యూసర్లు: ఆర్‌.దివాకరణ, ప్రవీణ.ఎస్‌,
    ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కల్యాణ్‌ చక్రవర్తి.
    సమర్ఫణ: వారాహి చలనచిత్రం, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఓంకార్
    విడుదల తేదీ: 22 అక్టోబర్ 2015.

    English summary
    Raju Gari Gadhi is an telugu movie directed by famous telugu anchor ‘Omkar’.This is a complete horror-comedy movie released today( 22nd october 2015) in telugu with average talk. Omkar is famous for his dance show ‘Aata’ and several other small screen shows like ‘Maayadweepam’ and ‘100 percent luck’ etc. He entered into silver screen with the movie ‘Genius’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X