twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి జ్ఞాపకం.. (ఓనమాలు రివ్యూ)

    By Bojja Kumar
    |

    పల్లెలు దేశానికి పట్టుకొమ్ములు అని గాంధీజీ ఏనాడో చెప్పాడు. కానీ నేటి తరం పల్లెల్లో ఉండటానికి ఇష్ట పడటం లేదు. అమ్మ ఒడి లాంటి పల్లెలను విడిచి పట్నం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితులను ప్రస్తావిస్తూ వినూత్నమైన కాన్సెప్టుతో రూపుదిద్దుకున్న సినిమా 'ఓనమాలు'. కొబ్బరి చెట్టు నీడ, ఆరు బయట భోజనం, కళకళలాడే లోగిలి... అమ్మ కమ్మదనం ఈ అద్భుతమైన అనుభూతులన్నీ నింపుకుని వచ్చిన సినిమా. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి చిత్రాల్లో గొప్ప పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన నటకిరీటి మరో ఉదాత్తమైన పాత్ర పోషించారు.

    నారాయణ రావు మాస్టారు(రాజేంద్రప్రసాద్)కి తను పుట్టిన ఊరన్నా, పల్లె వాతావరణం అన్నా, అక్కడి జనం మధ్య ఉన్న ఆప్యాయతలు అన్నా మహా ఇష్టం. అయితే పిల్లలు అమెరికా వెళ్లి పోవడంతో వారితో పాటు అక్కడికెళ్లిన మాస్టారు మనసుకు ఇష్టం లేకున్నా అక్కడ కొన్నాళ్లు అయిష్టంగానే గడిపి ఇక ఉండలేక మళ్లీ తన పల్లెబాట పడతాడు. తన పల్లె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఊరుచేరుకున్న మాస్టారు.......అనుకోని పరిస్థితులను చూసి ఖంగుతింటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నారాయణరావు మాస్టారు ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.

    రాజేంద్ర ప్రసాద్ మరోరాసి ప్రేక్షకులను తన నటనతో మైమరిపించాడు. కళ్యాణి, చలపతిరావు, గిరిబాబు, రఘుబాబు వారి వారి పాత్రల మేరకు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పల్లె వాతావరణం, అక్కడి మనుషుల్లో ఉండే ఆప్యాయతలు చాలా గొప్పగా, అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ఖదీర్ బాబు మాటలు సినిమాకు ప్రాణం పోశాయి. హరి అనుమోలు సినిమాటగ్రీఫీ బాగుంది.

    సామాన్యుడి దగ్గర నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ గాంధీ జయంతి రోజు తప్పకుండా పల్లెలకు వచ్చి ఇక్కడ గడపాలి, పల్లె బాగోగులు పట్టించుకోవాలి, పల్లెల అభివృద్ధికి తోడ్పడాలి, అప్పుడే దేశం బాగుపుడుతంది అంటూ ఇచ్చిన మెసేజ్ బాగుంది. ఆనలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాలు ఇష్ట పడే వారికి ఈ చిత్రం మంచి ఆప్షన్. కమర్షియల్ అంశాలతో కూడిన వినోదం ఆశించి వెళితే నిరాశ తప్పదు.

    సంస్థ: సన్ షైన్ సినిమా
    నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, కల్యాణి, గిరిబాబు, చలపతిరావు, రఘుబాబు తదితరలు...
    దర్శకత్వం: క్రాంతి మాధవ్
    కథ: తమ్ముడ సత్యం
    సినిమాటోగ్రఫీ: హరి అనుమోలు
    సంగీతం: కోఠి
    పాటలు: సిరివెన్నెల
    మాటలు: ఖదీర్ బాబు
    ఎడిటింగ్: గౌతం రాజు

    English summary
    Rajendra Prasad and Kalyani starrer film Onamalu has been released today. 'Onamalu' produced and directed by K.Kranthi Madhav on Sunshine cinema banner. Film is based on rural backdrop. Koti tuned melodious music for the film for which lyrics are penned by Sirivennela.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X