మెల్లిగా... ('ఊహలు గుసగుసలాడే' రివ్యూ)

By Srikanya

Rating:
2.5/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

ప్యూర్ రొమాంటిక్ కామెడీలు మనకు తెలుగులో బాగా తక్కువే. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో మసాలా కలుపుతూ రొమాంటిక్ కామెడీలను తెలుగు సినిమా పేరుతో కొత్త జనర్ గా వడ్డించేస్తున్నారు. అయితే అక్కడక్కడా సినిమాని ప్రత్యేకంగా చదువుకుని వచ్చిన శేఖర్ కమ్ముల, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి వారు ప్యూర్ గా రొమాంటిక్ కామెడీలు చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో మరో ప్రయత్నాన్ని నటుడు నుంచి దర్శకుడుగా మారిన అవసరాల శ్రీనివాస్ చేసారు. డైలాగులలో ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక శ్రద్ద తీసుకున్న శ్రీనివాస్ స్టోరీ నేరేషన్ విషయంలో స్లో నేరేషన్ ని ఎన్నుకున్నారు. ఆయన లవ్ స్టోరీ కదా ఫీల్ కోసం అనుకున్నారో...మరేమో కానీ అదే కాస్త ఇబ్బంది పెడుతూంది. దానికి తోడు రెగ్యులర్ సినిమా ప్రేక్షకుడు ఆశించే మసాలాలు లేకపోవటంతో మల్టిప్లెక్స్, ఎ సెంటర్లకే పరిమితంమయ్యేటట్లు ఉంది.

ఎన్. వెంకటేశ్వరరావు అలియాస్ వెంకి (నాగ శౌర్య)కి న్యూస్ రీడర్ కావాలనేది జీవితాశయం (అందుకో సెంటిమెంట్ ప్లాష్ బ్యాక్ ఉంటుందనుకోండి). తన లక్ష్యం కోసం ఓ ఛానెల్ లో పనిచేస్తున్న అతన్ని బాస్ ఉదయ్ భాస్కర్ (శ్రీనివాస్ అవసరాల) ఈ లక్ష్యం తెలుసుకుని,లైఫ్ ఇస్తానంటూ వాడేసుకుంటూంటాడు. అంతేకాక తనుపెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిని ఇంప్రెస్ చేయటానికి సలహాలు ఇచ్చి, పెళ్లి దాకా తీసుకువస్తే, న్యూస్ రీడర్ పోస్ట్ ఇస్తానని ఆశపెడతాడు. దాంతో బాస్ కి సాయపడదామని బయిలుదేరిన వెంకికి ఓ నిజం తెలుస్తుంది. అది...తను గతంలో ప్రేమించి,బ్రేక్ అప్ అయిన అమ్మాయి శిరీష (రాసి ఖన్నా) నే తన బాస్ ...ఇష్టపడుతున్నాడని....ఆ సమయంలో వెంకీ ఏం నిర్ణయం తీసుకున్నాడు. తన బాస్ కి సాయం చేసాడా...తను ప్రేమించుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తప్పకుండా హీరో,హీరోయిన్ కలుస్తారు అని తెలిసినా,ఎలా కలుస్తారు అనే విషయం చాలా ఇంట్రస్టింగ్ గా చెప్పటమే...రొమాంటిక్ కామెడీలో అత్యవసరమైనది. లేకపోతే చాలా ప్రెడిక్టుబుల్ కథని చూసిన ఫీలింగ్ వస్తుంది. అదే సమస్య ఈ కథకు వచ్చింది. కథ బాగా పాతదవటంతో సీన్స్ కూడా అలాంటివే వచ్చాయి.అయితే డైలాగులు చాలా బాగా రాసుకుని ఆ సమస్యని దాటే ప్రయత్నం చేసారు. అలాగే లౌడ్ కామెడీకి అవకాశమున్నా ఎలివేట్ చెయ్యకుండా ఒకే్ టోన్ లో సినిమాని సున్నితంగా నడపటానికి ట్రై చేసారు. అయితే హీరో,హీరోయిన్ల మధ్యన కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లు కనపడదు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్టాఫ్ ప్రారంభమైన కాస్సేపటికి సీన్స్ రిపీట్ అవుతూ,కథ ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది. అలాగే సెకండాఫ్ చాలా ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తుంది.

మిగతా రివ్యూ స్లైడ్ షోలో ...

హైలెట్స్

హైలెట్స్


ఇక హీరోయిన్ ని ఇంప్రెస్ చెయ్యటానికి అవసరాల శ్రీనివసా చేసే సీన్స్ బాగా నవ్వించాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే రెస్టారెంట్ సీన్స్ బాగున్నాయి.

స్క్రిప్టు

స్క్రిప్టు

దర్శకుడే కథ,కథనం, మాటలు సమకూర్చిన ఈ చిత్రం టైట్ స్క్రీన్ ప్లే తో నడపలేకపోయారు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో అసలేమీ జరిగినట్లు ఉండదు. సెకండాఫ్ ని సైతం యావరేజ్ గానే తయారు చేసారు. హీరో,హీరోయిన్స్ మధ్యన బలమైన రొమాంటిక్ థ్రెడ్ ని డవలప్ చేయలేకపోయారు. క్లైమాక్స్ సైతం పెద్దగా ఆకట్టుకోకుండా ముగించినట్లైంది. డైలాగుల మీద పెట్టిన శ్రద్ద సినిమాపై పెట్టినట్లు లేదు.

మరో హైలెట్

మరో హైలెట్

కృష్ణ భగవాన్ వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం విభిన్నంగా ఉంది. రెగ్యులర్ వాయిస్ ఓవర్ లా కాకుండా క్యారెక్టర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ చేయటం బాగుంది. దర్శకుడు టైటిల్స్ దగ్గర నుంచి ప్రత్యేకత చూపించటానికి ప్రయత్నించారు. పోసాని ఉన్నంతసేపూ బాగానే నవ్వించారు.

పాటలు

పాటలు

సాధారణంగా ఇలాంటి రొమాంటిక్ కామెడీ చిత్రాలకు పాటలు బాగా ప్లస్ కావాలి. అలాంటిది సినిమాకి పాటలు ప్లస్ కాలేదు సరికదా అడ్డం అయ్యాయి. కళ్యాణి కోడూరి పాటలు ధియోటర్ నుంచి వచ్చేటప్పుడు హాంట్ చేసేలా లేకపోయింది. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది.

టెక్నికల్

టెక్నికల్

ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరూ బాగా చేసారు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా విజువల్స్ ని చూపెట్టి,ఎక్కడా చిన్న సినిమా చూస్తున్న ఫీల్ రాకుండా చేసింది. ఎడిటింగ్ విషటానికి వస్తే...ఫస్టాఫ్ లో మరింత ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉంది.

దర్శకుడుగా

దర్శకుడుగా

దర్శకుడుగా ఇది అవసరాల శ్రీనివాస్ కి తొలి చిత్రమే అయినా ఎక్కడా ఆ తడబాటు కనిపించదు. తను అనుకున్న సీన్ ని చక్కగా తెరకెక్కించాడు. ముఖ్యంగా అనుభవమున్న దర్శకుడు తరహాలో...ఆర్టిస్టుల నుంచి చక్కటి ఫెరఫార్మెన్స్ తీసుకుని శభాష్ అనిపించాడు. దర్సకుడుగా మంచి మార్కులు వేయించుకున్నాడు.

నిర్మాతలు

నిర్మాతలు

చిన్న సినిమా అన్న ఆలోచన చూసే వారికి కలగకుండా రిచ్ లుక్ వచ్చేటట్లు సినిమాను తెరకెక్కించారు నిర్మాతలు. దర్శకుడు,హీరో,హీరోయిన్స్ కొత్త వారైనా వారిని పూర్తిగా నమ్మి ఖర్చుపెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపించింది.

హీరో,హీరోయిన్, అవసరాల

హీరో,హీరోయిన్, అవసరాల

ఇద్దరూ కొత్తవారైనా ఎక్కడా ఆ ఫీల్ రాకుండా...చాలా బాగా చేసారు లేదా దర్శకుడు చేయించుకున్నాడు.ఇద్దరికీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వస్తాయి. ఇక అవసరాల శ్రీనివాస్ సైతం ఈ చిత్రంలో కీలకమైన ఫుల్ లెంగ్త్ పాత్రని చేసారు. అదీ అద్బుతంగా పండించాడు.

క్లైమాక్స్

క్లైమాక్స్

సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అని ఎవరైనా ఇట్టే చెప్తారు. ముఖ్యంగా ఇలాంటి ప్రెడిక్టుబుల్ రొమాంటిక్ కామెడీలకు అది మరింత అవసరం. అయితే అవసరాల దానిపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. మొక్కుబడిగా తీసి ప్రక్కన పడేసారు.

ఎవరెవరు

ఎవరెవరు

పతాకం : సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్
సినిమా : ఊహలు గుసగుసలాడే
నటీనటులు : నాగ శౌర్య, రాశి ఖన్నా , రావూ రమేష్, సూర్య, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, సి.వి.ఎల్.నరసింహారావు, ప్రగతి, హేమ, సత్యకృష్ణ, విద్యారావు, వెంకట్ ఐమాక్స్, హరీశ్, సతీష్ తదితరులు
పాటలు: సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్,
కెమెరా: వెంకట్ సి.దిలీప్,
సంగీతం: కల్యాణి కోడూరి,
నిర్మాత: రజని కొర్రపాటి,
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల.
విడుదల తేదీ: 20,జూన్, 2014( శుక్రవారం)

ఏదైమైనా మల్టిప్రెక్స్ ని టార్గెట్ చేసినట్లున్న ఈ సినిమా ఆ వర్గాన్ని, అక్కడి యూత్ కి నచ్చే అవకాసం ఉంది. అలాగే 143 నిముషాల ఉన్న ఈ సినిమాకు ఓ ఇరవై నిముషాలు లెంగ్త్ తగ్గిస్తే బాగుంటుందనిపిస్తోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ని ట్రిమ్ చేస్తే మరింత టైట్ గా ఉండి, మరింత ఎక్కువ మందికి నచ్చే అవకాసం ఉంది.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X