twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊల్లాల ఊల్లాల మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    1.5/5

    విలక్షణ నటుడిగా విలనిజం పండించిన సత్య ప్రకాశ్.. దర్శకుడిగా మారి ఊల్లాల ఊల్లాల చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆయన తన కుమారుడు నటరాజ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ.. తీసిన ఈ చిత్రం దర్శకుడిగా సత్య ప్రకాశ్‌కు, హీరోగా నటరాజ్‌కు ఏవిధంగా ఉపయోగపడింది? ఊల్లాల ఊల్లాల చిత్రం వీరిద్దరికి ఎలాంటి ఫలితాన్ని మిగిల్చింది? అన్నది ఓ సారి చూద్దాం.

    కథ

    కథ

    సినిమా దర్శకుడిగా మారాలనే కోరిక, డబ్బుపై వ్యామోహం ఉన్న నటరాజ్ (నటరాజ్)‌ను నూరిన్ (నూరీన్ షెరీఫ్) ప్రేమిస్తూ ఉంటుంది. అయితే అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా ఉన్నట్లే ఉంటాడు. మంచి దర్శకుడిగా పేరు తెచ్చేందుకు తపన పడుతూ ఉండే నటరాజ్ జీవితంలోకి త్రిష (అంకితా మహారాణా), అతిలోక సుందరి (కాలకేయ ప్రభాకర్) లాంటి విచిత్రమైన క్యారెక్టర్స్ వస్తుంటాయి.

    కథలోని ట్విస్టులు..

    కథలోని ట్విస్టులు..

    నటరాజ్‌కు పండు అనే పాత్రలో తనను తాను ఊహించుకుంటాడు? త్రిష, పండు అనే పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి? వీరంతా ఎందుకు మాయమతుంటారు? అసలు వారంతా మనుషుల్లా ఉండే ఆత్మలా.. ఆత్మ రూపంలో ఉన్న మనుషులా? అనే ప్రశ్నలకు సమాధానమే ఊల్లాల ఊల్లాల.

    ఫస్టాఫ్ అనాలిసిస్..

    ఫస్టాఫ్ అనాలిసిస్..

    నూరిన్‌ను రౌడీలు ఏడ్పించడం, నటరాజ్ వచ్చి కాపాడటం లాంటి పరమ రొటీన్ సీన్లతో సినిమాను ప్రారంభిస్తారు. సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఎంత నాసిరకంగా తెరకెక్కించారో అర్థమవుతుంది. అర్థం పర్థం లేని సీన్లు, అతికించినట్టు సంబంధం లేకుండా ఉండే సన్నివేశాలతో ప్రథమార్థం అలా ముందుకు సాగుతూ ఉంటుంది. త్రిష పాత్ర ఎంటరైన తరువాత రొమాంటిక్ సీన్లతో తెరను హీటెక్కిస్తుంది. లెక్క లేనన్ని ముద్దు సీన్లతో ఇద్దరూ రెచ్చిపోతూ ఉంటారు. ఇది మినహా ఫస్టాఫ్‌లో కథ ముందుకు సాగదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. జరిగేది నిజమో కాదోనన్న తికమకలోనే ప్రేక్షకుడు ఉండిపోతాడు.

     సెకండాఫ్ అనాలిసిస్..

    సెకండాఫ్ అనాలిసిస్..

    నటరాజ్‌కు కనిపించే పాత్రలు ఆత్మలా? మనుషులా? అన్న అనుమానంచ అతనితో పాటు ప్రేక్షకుడికి కూడా ఉంటుంది. ప్రథమార్థాన్ని చూసిన ప్రేక్షకుడికి ద్వితీయార్థంపైనా ఎలాంటి అంచనాలుండవేమో అనేట్టు ఉంటుంది. దానికి తగ్గట్టే సెకండాఫ్‌ను మరింత నిరాసక్తంగా మలిచినట్టు కనిపిస్తుంది. త్రిష, పండు, అతిలోక సుందరి అంటూ అవే క్యారెక్టర్ల చుట్టూ కథను తిప్పి తిప్పి ప్రేక్షకులకు సహనం కోల్పోయేట్టు చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అన్ని క్యారెక్టర్లను చూపించి, ఏదో స్టోరీ ఉన్నట్లు సీన్లను క్రియేట్ చివరకు తుస్సుమనిపించిన భావన కలిగే అవకాశం ఉంది. మొత్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలొ ద్వితీయార్థం కూడా విఫలమైనట్లు కనిపిస్తుంది.

    నటీనటులు..

    నటీనటులు..

    విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సత్య ప్రకాశ్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే అందరికీ ఓ మోస్తరు అంచనాలుంటాయి. యాక్షన్ పరంగా సత్య ప్రకాశ్ రేంజ్‌లో ఉంటుందని అందరూ భావించడం సహజం. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో నటరాజ్ కాస్త తడబడినట్టు కనిపిస్తుంది. అయితే డ్యాన్సుల్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. ఇక నూరీన్ కనిపించింది కొద్దిసేపే అయినా.. నటనతో ఆకట్టుకుంది. అయితే మేకప్ విషయంలో కాస్త జాగ్రత్త పడితే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. త్రిష పాత్రలో నటించిన అంకితా స్కిన్ షోకే పరితమైన భావన కలుగుతుంది. కేవలం రొమాంటిక్ సన్నివేశాలను చేయించడానికే ఆమెను తీసుకున్నారేమోనని అనిపిస్తుంది. అతిలోక సుందరిగా కనిపించిన కాలకేయ ప్రభాకర్ తన మేకప్‌తో ప్రేక్షకులకు చిరాకు పుట్టించినట్టు అనిపిస్తుంది. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.

    దర్శకుడి పనితీరు..

    దర్శకుడి పనితీరు..

    విభిన్న భాషల్లో దాదాపు 500 చిత్రాలకు పైగా చిత్రాల్లో నటించిన సత్య ప్రకాశ్‌.. దర్శకుడిగా మొదటి అడుగులో తడబడినట్టు కనిపిస్తుంది. ఏ ఒక్కరి పాత్ర నుంచి ఎమోషన్‌ను పండించలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఊల్లాల ఊల్లాల చిత్రంలోని పాత్రలతో ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమైనట్టు కనిపిస్తుంది.

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    ఈ చిత్రానికి సంగీతం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ ఇలా ఏ ఒక్కటి కూడా బలంగా మారలేకపోయింది. సంగీతం, నేపథ్య సంగీతం మరింత నాసిరకంగా ఉన్నట్టు కనిపిస్తుంది. తెరపై సినిమాను అందంగా చూపించడంలో సినిమాటోగ్రఫీ విభాగం విఫలమైంది. ఎడిటింగ్ విభాగం ఈ చిత్రాన్ని అతుకుల బొంతగా మార్చేసినట్టు అనిపిస్తుంది. ఓ ఫ్లో అంటూ లేకుండా సన్నివేశాలను అతికించిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.

    బలం బలహీనతలు

    బలం బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    నూరీన్, అంకిత

    మైనస్ పాయింట్స్
    కథ, కథనం
    ఎడిటింగ్
    దర్శకత్వం

    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    రొటీన్ సీన్స్‌తో తెరకెక్కించిన ఊల్లాల ఊల్లాల కథ, కథనాలను కూడా అంతగా పట్టించుకోలేదన్న ఫీలింగ్ కలుగుతుంది. రొమాంటిక్ సీన్లతో హీటెక్కించిన ఊల్లాల ఊల్లాల చిత్ర విజయం.. బీ, సీ సెంటర్లలోని ప్రేక్షకాదరణపై ఉంటుంది.

    నటీనటులు

    నటీనటులు

    నటీనటులు : రాజ్ తరుణ్, షాలినీ పాండే, నాజర్, రోహిణి తదితరులు
    దర్శకత్వం : సత్య ప్రకాశ్
    నిర్మాత : ఏ గురురాజ్
    బ్యానర్ : సుఖీభవ మూవీస్
    మ్యూజిక్ : జాయ్ రాయరాల
    సినిమాటోగ్రఫి : జే.జీ. కృష్ణ, దీపక్
    ఎడిటింగ్ : ఉద్దవ్

    English summary
    Oollala Oollala is an Telugu language Love And Comedy Drama written and directed by Sathiya Prakash. The film stars Nataraj, Noorin Sheref, Anketha Maharana. This movie released on January 1st 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X