For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ooriki Uttharana movie review.. భావోద్వేగమైన ప్రేమకథ

  |

  Rating: 2.75/5

  నటీనటులు: నరేన్ వనపర్తి, దీపాళ్లీ శర్మ, ఆనంద చక్రపాణి, రామరాజు, అంకిత్ కొయ్య, జగదీష్, ఫణి తదితరులు
  దర్శకత్వం: సతీష్ పరమవేద
  స్టతోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ఉదయ్ శర్మ, నాగమణి రాజు
  నిర్మాతలు: వెంకటయ్య వనపర్తి, రాచల యుగేందర్ గౌడ్
  సినిమాటోగ్రఫి: శ్రీకాంత్ అరుపుల
  మ్యూజిక్ డైరెక్టర్: భీమ్స్ సెసిరోలియో
  లిరిక్స్: సురేష్ గంగుల, పూర్ణ చారి
  ఎడిటింగ్: శివ శ్రావణి
  బ్యానర్: ఈగల్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్ డేట్: 2021-11-19

  వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామ పెద్ద పర్వతనేని శంకర్ పటేల్ (రామరాజు)‌ను ఎదురించి ప్రేమ వివాహం చేసుకోవాలని తన సోదరి డిసైడ్ అవుతుంది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సోదరి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకొంటాడు. సోదరి ప్రేమించిన యువకుడిని కాకతీయ తోరణానికి కట్టి ఉట్టి కొట్టిస్తాడు. ఇక ముందు పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకొనే ప్రతీ ఒక్కరికి ఇలాంటి శిక్షే అంటూ శాసనం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన మేనకోడలు శైలు ( దీపాళీ శర్మ) పక్క ఊరికి చెందిన బాధ్యత అంటే తెలియని ఓ పోకిరి కరెంట్ రాజు (నరేన్ వనపర్తి)ని ప్రేమిస్తుంది. పీకల్లోతు ప్రేమలో ఉన్న శైలు, రాజు ఓ కారణంగా ఊరు విడిచి హైదరాబాద్‌కు పారిపోతారు.

  తండ్రి కరెంట్ నారాయణ ( ఆనంద చక్రపాణి) మాటలను పెడచెవిన పెట్టి కరెంట్ రాజు అల్లరి చిల్లరిగా ఎందుకు తిరిగాడు? 30 ఏళ్ల వయసులో కరెంట్ రాజు కాలేజీలో స్టూడెంట్‌గా ఎందుకు చేరాడు? కాలేజీలో సహ విద్యార్థిని శైలుతో ఎలా ప్రేమలో పడ్డాడు. శంకర్ పటేల్ గురించి తెలిసినా వారిద్దరు ప్రేమలో ఎలా మునిగిపోయారు? హైదరాబాద్‌కు పారిపోయిన కరెంట్ రాజు, శైలుకు ఎదురైన సమస్య ఏమిటి? శైలుకు ఎదురైన సమస్యను కరెంట్ రాజు ఎలా పరిష్కరించాడు? కరెంట్ రాజు, శైలు ప్రేమను శంకర్ పటేల్ అంగీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఊరికి ఉత్తరాన సినిమా కథ.

  Ooriki Uttharana movie review and rating: Naren Vanaparthi, Satish Paramvedas emotional love story

  పర్వతగిరి గ్రామంలో తన సోదరిని లేపుకెళ్లిన యువకుడిని శిక్షించే ఎమోషనల్ సన్నివేశంతో ఊరికి ఉత్తరాన ప్రారంభమవుతుంది. భావోద్వేగాలతో కూడిన కథతో ఆరంభించడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కథలో విషయం ఉందనే అభిప్రాయం ఆదిలోనే కలుగుతుంది. ఇక ఫస్టాఫ్‌లో కరెంట్ రాజు క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. తండ్రి (ఆనంద చక్రపాణి)తో కరెంట్ రాజు మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉండటం సినిమాకు మరింత పాజిటివ్‌గా అనిపిస్తుంది. అసలు కథను చెప్పడానికి ఎక్కువగానే సమయం తీసుకొన్నాడనిపించే సమయంలోనే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

  సెకండాఫ్‌లో రాజు, శైలు ప్రేమ కథ‌ ఫన్‌, ఇంటెన్స్‌ అంశాలతో సాగుతున్న సమయంలో ఇంట్రెస్టింగ్‌ ట్విస్ట్‌ సినిమా కథను మలుపు తిప్పుతుంది. శైలు జీవితంలో చోటు చేసుకొన్న సంఘనలు, వాటిని రాజు పరిష్కరించిన విధానం భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇక తల్లిదండ్రుల ఇష్టానికి భిన్నంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్న ప్రేమికులను కాకతీయ తోరణానికి ఉట్టి కొట్టాలని తాను రాసిన శాసనం ప్రకారం రామరాజు తీసుకొన్న తీర్పు సినిమాను ఫీల్‌గుడ్‌గా మారుస్తుంది.

  కరెంట్ రాజు క్యారెక్టర్‌లో నరేన్ ఒదిగిపోయాడు. గ్రామీణ యువకుడిగా, అల్లరి చిల్లరిగా, బాధ్యత తెలియని యువకుడిగా, ప్రేమికుడిగా, మధ్య వయసు కాలేజ్ స్టూడెంట్‌గా పలు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌ను అవలీలగా పోషించాడు. రొమాంటిక్ సీన్లలో శైలుతో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మంచి ఫెర్ఫార్మెన్స్ చూపించాడు. తండ్రి, కొడుకుల మధ్య సీన్లలో ఎమోషనల్‌గా కనిపించాడు. వర్షంలో వంతెనపై తడుస్తూ ఉంటే సీన్ చాలా బాగుంది. శైలుగా దీపాళీ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకొన్నారు. సెకండాఫ్‌లో కథను మలుపుతట్టే సీన్లలో దీపాళీ నటన బాగుంది. కొత్త వారైనా ఇద్దరు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న యాక్టర్లుగా తెరపైన కనిపించారు.

  మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. కరెంట్ నారాయణగా మరోసారి ఆనంద చక్రపాణి తన నటనతో ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేస్తారు. మల్లేశం, అనగనగా ఒక అతిథి తర్వాత మరో మంచి పాత్రలో కనిపించారు. ఊరికి ఉత్తరాన కాదు.. ఊరే ఉత్తరానకు వెళ్తుంది అంటూ సినిమాకు జస్టిఫికేషన్ ఇచ్చే పాత్రలో నటించడమే కాకుండా మెప్పించారు. ఇక పర్వతనేని శంకర్ పటేల్ పాత్రలో రామరాజు సరికొత్తగా కనిపించారు. భారమైన పాత్రలో ఒదిగిపోయారు. కథకు రామరాజు తన పాత్రతో బలంగా మారాడని చెప్పవచ్చు. తిమ్మరుసు సినిమా తర్వాత యువ నటుడు అంకిత్ కొయ్య మరోసారి మంచి రోల్‌లో కనిపించాడు. ఇక మల్లేశం ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారీ కమెడియన్‌గా తెలంగాణ యాస, భాషతో అదరగొట్టాడు. జబర్దస్త్ ఫణి తన పాత్రతో మరోసారి ఆకట్టుకొన్నాడు.

  ఊరికి ఉత్తరాన సినిమాకు దర్శకుడు సతీష్ పరమవేద పనితీరు, ప్రతిభ స్పెషల్ ఎట్రాక్షన్. హీరో, హీరోయిన్ల పాత్రలను యూత్ టేస్ట్‌కు తగినట్టుగా, రామరాజు, ఆనంద చక్రపాణి పాత్రలను ఎమోషనల్‌గా తీర్చిదిద్దిన తీరు అందర్నీ ఆకట్టుకొంటుంది. సాంకేతిక విభాగాలను వాడుకొన్న విధానం అతడి ప్రతిభకు అద్దం పట్టింది. భారీ బడ్జెట్ చిత్రాలనే కాకుండా స్టార్ హీరోలను కూడా లీడ్ చేసే సత్తాను తన తొలి చిత్రంతోనే నిరూపించుకొన్నారు.

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. శ్రీకాంత్ అరుపుల
  సినిమాటోగ్రఫి బాగుంది. కాకతీయ తోరణం సెట్టింగును తెరపైన అద్బుతంగా ప్రొజెక్ట్ చేశాడు. ఎమోషనల్ సీన్లతోపాటు కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సురేష్ గంగుల, పూర్ణాచారి రాసిన పాటలు కథకు తగినట్టుగా ఉన్నాయి. శివ శ్రావణి ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో కొన్ని నిమిషాలు, సెకండాఫ్‌లో డిటేయిలిటిని కాస్త తగ్గిస్తే సినిమా మరింత క్రిస్పీగా ఉంటుంది. నిర్మాతగా వెంకటయ్య వనపర్తి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా హై స్టాండర్డ్స్‌తో రిచ్‌గా ఉన్నాయని చెప్పవచ్చు.

  Tollywood : ఒకేరోజు రిలీజ్ కానున్న 8 సినిమాలు.. తెలుగు సినీ ప్రేమికులకు పండగే..! || Filmibeat Telugu

  ప్రేమ, ఫ్యామిలీ, యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో తెరకెక్కిన చిత్రం ఊరికి ఉత్తరాన. తెలంగాణ వాతావరణం, యాస, భాష మిమల్ని ఆకట్టుకొంటుంది. పరువు, ప్రతిష్టతో కాదు ప్రేమతో బతకాలనే చక్కటి సందేశాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి ఫీల్‌ను ఊరికి ఉత్తరాన అందిస్తుంది. కొత్తవాళ్లు చేసిన తొలి ప్రయత్నం కాబట్టి లోపాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు అనే మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం.

  English summary
  Ooriki Uttharana is a movie debutant talent. Hero Naren, Director Satish attempted emotiona love story. This movie hits theatres on November 19th. In this occassion, Filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X