Ooru Peru Bhairavakona Review ఊరు పేరు భైరవకోన సినిమా రివ్యూ.. సందీప్ కిషన్ హిట్టుకొట్టాడా?

Rating: 2.75/5

నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వైవా హర్ష, వెన్నెల కిషోర్, పీ రవిశంకర్, వడివుక్క రాశి తదితరులు
దర్శకత్వం: వీఐ ఆనంద్
నిర్మాతలు: అనిల్ సుంకర, రాజేశ్ దండా
మ్యూజిక్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫి: రాజ్ తోట
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
బ్యానర్: హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2024-02-16

సినిమా ఇండస్ట్రీలో స్టంట్ మాస్టర్‌గా పనిచేసే బసవలింగం (సందీప్ కిషన్) పెళ్లి ఇంటిలో వధువు నగలు దొంగతనం చేసి మిస్టీరియస్‌గా ఉండే భైరవకోన అనే గ్రామంలోకి ప్రవేశిస్తారు. భైరవకోన విలేజ్‌లోకి ప్రవేశించడానికి ముందు భూమి (వర్ష బొల్లమ్మ), గీత (కావ్య థాపర్) ఎదురుపడుతారు. గ్రామంలోకి వెళ్లిన బసవలింగంకు ఎదురైన విచిత్ర పరిస్థితుల మధ్య దోచుకొన్న బంగారాన్ని అక్కడి వ్యక్తులు కొట్టేస్తారు. అక్కడ కనిపించిన భయంకర పరిస్థితుల నుంచి బయటపడుతారు. కానీ బంగారాన్ని తెచ్చుకోవడానికి మళ్లీ భైరవకోనకు వెళ్తారు.

Ooru Peru Bhairavakona Movie Review in Telugu: Sundeep Kishan, VI Anand feel Good Fantasy Thriller

స్టంట్ మాస్టర్‌గా పనిచేసే బసవలింగం ఎందుకు దొంగలా మారాడు? భారీగా డబ్బును ఎందుకు కూడబెట్టాలని అనుకొంటాడు? దొంగతనాలకు పాల్పడే గీత కలిసిన తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది? తన స్నేహితుడు జాన్ వల్ల బసవలింగం ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు? భూమికి బసవకు ఉన్న రిలేషన్ ఏమిటి? భూమి కోసం బసవ జీవితాన్ని రిస్క్‌లో పడేసుకొన్నాడు? భైరవకోనకు గరుడపురాణానికి సంబంధం ఏమిటి? బసవ తాను అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఊరు పేరు భైరవకోన.

భైరవకోనలో జరిగే కొన్ని సంఘటనల మధ్య సందీప్ కిషన్ దొంగతనం చేసే సన్నివేశాలతో మూవీ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. దర్శకుడు ఏదో కొత్త కథ చెప్పబోతున్నాడనే ఫీలింగ్ అయితే కల్పించాడు. కథా ప్రయాణంలో కొన్ని చిక్కు ముడులను ప్రేక్షకుల ముందు ఉంచి ఆసక్తిని రేకెత్తించడంలో సక్సెస్ అయ్యాడు. తన కథకు తగినట్టుగా క్రియేట్ చేసిన ఓ కొత్త ప్రపంచం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఆ ప్రపంచంలో జరిగే సంఘటనలకు వీఎఫ్ఎక్స్ జోడించి కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం కూడా బాగుంది. కానీ బలమైన కథ లేకుండా, ఎమోషనల్ కంటెంట్ లేకుండా ఫస్టాఫ్‌లో రిస్క్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది.

Ooru Peru Bhairavakona Movie Review in Telugu: Sundeep Kishan, VI Anand feel Good Fantasy Thriller

ఇక సెకండాఫ్‌లో కంటెంట్‌లో ఎమోషన్స్ జోడించిన తీరు బాగుంది. బసవ, భూమి మధ్య ఉండే ట్విస్టుతో థ్రిల్లింగ్ క్రియేట్ చేశాడు. కానీ ఆ ట్విస్ట్ రివీల్ తర్వాత ఆ పాయింట్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం, భావోద్వేగానికి గురిచేసేలా లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది. కొన్ని మంచి మూమెంట్స్ మధ్య సినిమా అర్ధాంతరంగా ముగించారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా ఒక డిఫరెంట్ వరల్డ్‌లో కొంత ఎక్సైట్‌మెంట్‌ను క్రియేట్ చేయడంలో దర్శకుడు వీఐ ఆనంద్ తన సత్తాను మరోసారి చాటుకొన్నాడు.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. డిఫరెంట్ కథలను, కాన్సెప్ట్‌లను ఎంచుకొంటూ సినిమా పట్ల తన అభిరుచిని చాటుకొనే సందీప్ కిషన్ మరోసారి మంచి పాత్రతో ఆకట్టుకొన్నాడు. రెగ్యులర్, రొటీన్‌గా కాకుండా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో క్యారెక్టర్‌కు తగిన యాటిట్యూడ్‌తో మెప్పించారనే చెప్పాలి. భూమిగా వర్ష బొల్లమ్మకు తనకు తాను కొత్తగా రుజువు చేసుకొనే పాత్రలో ఒదిగిపోయింది.

Ooru Peru Bhairavakona Movie Review in Telugu: Sundeep Kishan, VI Anand feel Good Fantasy Thriller

గెస్ట్ పాత్రకు కొద్దిగా ఎక్కువగా ఉండే రోల్‌లో సినిమాను ఇంపాక్ట్ చేశారని చెప్పవచ్చు. క్యూట్‌గా ఎమోషనల్‌ పాత్రలో వర్ష ఆకట్టుకొన్నారు. కావ్య థాపర్‌ గ్లామర్ పంట పడించింది. స్క్రీన్‌లో నిండుగా కనిపించి ప్రేక్షకులకు అందాల విందు పంచే పనిని సక్రమంగా చేసింది. వెన్నెల కిషోర్, హర్ష ఎప్పటిలానే వినోదాన్ని తమదైన శైలిలో పంచారు. రవిశంకర్ భావోద్వేగమైన పాత్రలో కనిపించారు. మిగితా వారందరూ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

ఊరు పేరు భైరవకోన కథాపరంగా లోపాలు ఉన్నప్పటికీ.. టెక్నికల్‌గా బ్రిల్లియెంట్‌గా కనిపిస్తుంది. గ్రాఫిక్ వర్క్, డిఫరెంట్ వరల్డ్‌లో క్రియేట్ చేసిన ఎన్విరాన్‌మెంట్ సినిమాను మరింత రిచ్‌గా చేసింది. రాజ్ తోట సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సన్నివేశాలు చాలా రిచ్‌గా మంచి ఫీల్ క్రియేట్ చేసేలా చిత్రీకరించారు. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ శేఖర్ చంద్ర మ్యూజిక్. పాటలు ట్రెండ్ సెట్ చేశాయనే తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోరు చాలా సీన్లను బాగా ఎలివేట్ చేసింది. బ్యానర్‌కు తగిన విధంగా నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. కథపై మరికొంత దృష్టిపెట్టి ఉంటే డెఫినెట్‌గా ఫాంటసీ జోనర్‌లో ట్రెండ్ సెట్ చేసే సినిమా అయి ఉండేదనిపిస్తుంది.

Ooru Peru Bhairavakona Movie Review in Telugu: Sundeep Kishan, VI Anand feel Good Fantasy Thriller

ఓ ఫాంటసీ లోకంలో లవ్, తండ్రి కూతుళ్ల ఎమోషన్స్‌తో సాగిన మిస్టీరియస్ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన. సాంకేతిక అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూస్తున్న సేపు కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మంచి అంశాల మధ్య మూవీకి ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసే కథ లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. డిఫరెంట్ జోనర్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి. అంచనాలు లేకుండా వెళితే మంచి సినిమా చూశామనే ఫీల్‌తో బయటకు రావొచ్చు. జాంబీ, ఘోస్ట్ తరహా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X