Operation Raavan Review: ఆపరేషన్ రావణ్ రివ్యూ

Rating:
2.5/5

సినిమా: ఆపరేషన్‌ రావణ్‌
నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్ తదితరులు
రచన-దర్శకత్వం: వెంకట సత్య
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
మ్యూజిక్: శరవణ వాసుదేవన్‌
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
విడుదల తేది: 2024-07-26

హైదరాబాద్ నగరంలో అతి క్రూరంగా ఓ సైకో అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా చంపుతుంటాడు. ఆ కేసును కవర్ చేయమని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆమని (సంకీర్తన విపిన్)‌కు బాధ్యత అప్పగిస్తారు. ఆమెకు అసిస్టెంట్‌గా రామ్ (రక్షిత్ అట్లూరి) పంపుతారు. ఆ క్రమంలో తన కూతురు కనిపించడం లేదని సుజాత అనే మహిళ (రాధిక శరత్ కుమార్) ఫిర్యాదు చేస్తుంది. ఈ క్రమంలో ఆమనిని సైకో కిడ్నాప్ చేస్తాడు.

Operation Raavan Movie Review in Telugu

తాను పనిచేసే టెలివిజన్ ఛానెల్‌లో ఆమనిని పొలిటికల్ రిపోర్టర్ నుంచి క్రైమ్ రిపోర్టర్‌గా ఎందుకు బదిలీ చేస్తారు? రాష్ట్ర మంత్రి రఘు కుంచె అవినీతికి టీవీ ఛానెల్ సీఈవో (టీవీ5 మూర్తి) ఎందుకు అండగా ఉంటాడు? రామ్ ఎందు కోసం టీవీ చానెల్‌లో ఉద్యోగంలో చేరుతాడు. ఆమని కిడ్నాప్ చేసిన తర్వాత ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొని రామ్ సాహసం చేస్తాడు? కనిపించకుండా పోయిన సుజాత కూతురు ఏమైంది? ఇంతకు సైకో కిల్లర్ ఎవరు? చివరికి ఈ కిడ్నాప్ డ్రామాకు కారణం ఏమిటి? ఆమని కిడ్నాప్‌కు ముగింపు ఏమిటనే ప్రశ్నకు సమాదానే ఆపరేషన్ రావణ్ సినిమా కథ.

పలాస చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రక్షిత్ అట్లూరి తండ్రి వెంకట సత్య రచన, దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ రావణ్ చిత్రం పక్కా యాక్షన్ ఆధారంగా సాగే క్రైమ్ థ్రిల్లర్. ఫస్టాఫ్‌లో రకరకాల అంశాలతో కథను ముందుకు తీసుకుపోయిన దర్శకుడు తన సత్తాను సెకండాఫ్‌లో చూపించాడు. టీవీ కంపెనీ ఎపిసోడ్ కథకు ఎలాంటి సంబంధం లేకుండా దానికి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారో అర్ధం కాదు. దర్శకుడు ద్వితీయార్థంలో అనుసరించిన స్క్రీన్ ప్లే, ట్విస్టులు చూస్తే.. తొలి చిత్ర దర్శకుడు కాకుండా అనుభవం ఉన్న డైరెక్టర్‌లా అనిపిస్తాడు. ఫస్టాఫ్‌లో కథను క్రిస్పీగా చేసి ఉంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ అయి ఉండేది.

ఇక రక్షిత్ అట్లూరి ఎప్పటిలానే తన మార్కు నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. క్యారెక్టర్ పరంగా ఉన్న మాస్, కమర్షియల్ అంశాలను చక్కగా ఉపయోగించుకొని తనలోని నటుడిని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక రాధిక శరత్ కుమార్ మరోసారి ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయారు. రాజకీయ నేతగా రఘు కుంచె, జర్నలిస్టుగా సంకీర్తన్ విపిన్ తమ నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు.

టెక్నికల్ విషయాలకు వస్తే.. శరవణ వాసుదేవన్ అందించిన మ్యూజిక్ బాగుంది. పలు సన్నివేశాలను బీజీఎం ఎలివేట్ చేసింది, నాని షూట్ చేసిన యాక్షన్ సీన్లు, ఛేజింగ్ సీన్లు ఆయన పనితనం ఏమిటో చూపించాయి. ధ్యాన్ అట్లూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైమ్, యాక్షన్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X