Oppenheimer first Review: సిల్వర్ స్క్రీన్‌పై పేలిన అణుబాంబు.. క్రిస్టఫర్ నోలన్ ది బెస్ట్
ప్రముఖ నిర్మాత, దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హీమెర్ (Oppenheimer). అణు యుగంలో మాన్ హట్టన్ ప్రాజెక్టుగా పేర్కొనే అణుబాంబు తయారీ చుట్టు అల్లుకొన్న కథలో సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్,లెస్లీ గ్లోవ్ లాంటి నటీనటులు అద్బుతంగా నటించారు. జూలై 21వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇటీవల పలు దేశాల్లో ప్రీవ్యూ ప్రదర్శించారు. ప్రీమియర్ల తర్వాత నెటిజన్ల అభిప్రాయాలు, ట్వీట్స్ వివరాల్లోకి వెళితే..
విధ్వంసకర చరిత్రను..:ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం ఈ దశాబ్దపు అత్యుత్తమ చిత్రం. ఆటంబాబు తయారీకి సంబంధించిన విధ్వంసకమైన స్టోరీని అద్బుతంగా చెప్పారు. సిలియన్ మర్ఫీ కెరీర్‌లోనే ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్. స్క్రీన్‌పై ఎమోషన్స్‌ను క్రిస్టఫర్ నోలన్ పండించిన తీరు అద్బుతం. అన్ని రకాల అవార్డులను గెలుచుకొనేందుకు ఈ సినిమా జైత్రయాత్రను మొదలుపెట్టింది

చరిత్ర చీకటి కోణాన్ని..:ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం క్రిస్టఫర్ నోలన్ కెరీర్‌లోనే మాస్టర్ పీస్. చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటనను, విషాదంతో కూడిన చీకటి కోణాన్ని చాలా ధైర్యంగా చూపించే ప్రయత్నం చేశారు. నటీనటుల పెర్ఫార్మెన్స్ వరల్డ్ క్లాస్. సినిమాలోని ప్రతీ ఎమోషన్స్ హృదయాన్ని భారంగా మారుస్తుంది. కేవలం ఇది బయోపిక్ మాత్రమే కాదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా. ఈ సినిమా ముగింపు అద్బుతంగా ఉంది.
ఎమోషన్స్‌ను అద్బుతంగా :క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం మాస్టర్ పీస్. డీటెయిల్, డెప్త్‌తో కూడిన మర్ఫీ నటన స్క్రీన్ మీద పేలింది. చరిత్రలో చీకటి కోణంగా మారిన టైం బాంబు కథా నేపథ్యంా రూపొందిన ఈ సినిమాలో ఎమోషన్స్ అద్బుతంగా పండాయి. రాబర్ట్ డౌనీ జూనియర్ ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎమిలీ బ్లంట్ తన పాత్రలో అద్బుతంగా రాణించారు. టెక్నికల్‌గా ది బెస్ట్‌గా ఉంది. సినిమా చూసి గొప్ప అనుభూతికి గురయ్యాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

3 గంటలపాటు భావోద్వేగం:ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం చూసిన తర్వాత వావ్ అనే ఫీలింగ్ కలిగింది. క్రిస్టఫర్ నోలన్ కెరీర్‌లోనే ది బెస్ట్. ప్రతీ యాక్టర్ అద్బుతంగా నటించాడు. మూడు గంటలపాటు భావోద్వేగం ఊగిసలాడింది. కథ చెప్పడంలో, సినిమాను నడిపించడంలో క్రిస్టఫర్ నోలన్ తనకు తానే సాటి అనిపించుకొన్నారు.

3 గంటల థ్రిల్ రైడ్.. :ఫిల్మ్ మేకింగ్‌లో తనకు తానే దిట్ట అని క్రిస్టఫర్ నోలన్ మరోసారి నిరూపించుకొన్నారు. మూడు గంటలపాటు ఒక థ్రిల్ రైడ్‌కు గురయ్యాను. సిలియన్, డౌనీ ఆస్కార్ మించిన పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. సాంకేతిక విభాగాలు కూడా ఆస్కార్ లెవెల్ పెర్పార్మెన్స్ ఇచ్చాయి.

చరిత్రను లోతుగా అధ్యయనం :దర్శక,నిర్మాత క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం సినిమా చరిత్రను లోతుగా అధ్యయనం చేసిన సినిమా. డన్ కిర్క్ మాదిరిగానే చరిత్ర ఆధారంగా, అధికంగా డైలాగ్స్‌తో కూడిన చిత్రంగా రూపొందింది. రెండోసారి కూడా చూడాలి అనేంతగా ఈ సినిమాను నోలన్ తెరకెక్కించారు. డైరెక్షన్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, సౌండ్ ట్రాక్ లాంటి అంశాలు అద్బుతమైన అనుభూతిని కలిగించాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
ఆస్కార్ అవార్డు లెవెల్:ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం ఈ దశాబ్దపు అత్యుత్తమ చిత్రం. ఆస్కార్ అవార్డుల అందుకోవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న సినిమా ఇది. సిలియన్ మర్ఫీ పెర్ఫార్మెన్స్ గ్రేట్, రాబర్ట్ డౌనీ జూనియర్, బ్లంట్ నటన బాగుంది. ఆస్కార్ రావడం గ్యారెంటీ అంటూ ఓ నెటిజన్ తన రివ్యూను అందించారు.


Click it and Unblock the Notifications











