Oppenheimer Review క్రిస్టఫర్ నోలన్ నుంచి మరో మాస్టర్ పీస్.. ఒప్పెన్‌హైమర్ మూవీ రివ్యూ!

Rating:
3.5/5

నటీనటులు: సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లారెన్స్ ఫుఫ్ తదితరులు
దర్శకత్వం: క్రిస్టఫర్ నోలన్
నిర్మాతలు: ఎమ్మా థామస్, ఛార్లెస్ రోవెన్, క్రిస్టఫర్ నోలన్
కథ: కై బర్డ్, మార్టిన్ షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమెథస్ పుస్తకం ఆధారంగా
సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయెతేమా
ఎడిటింగ్: జెన్నిఫర్ లామె
మ్యూజిక్ం లడ్విగ్ గోరనస్సాన్
బ్యానర్: సిన్‌‌కాపీ ఇంక్, అట్లాస్ ఎంటర్‌మైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2023-07-21

డాక్టర్, సైంటిస్ట్ రాబర్ట్ జే ఒప్పెన్‌హైమర్ అలియాస్ ఓప్పి జర్మనీలో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసుకొని అమెరికాకు తిరిగి వచ్చి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా చేరుతారు. కమ్యూనిస్టు సానుభూతిపరుడైన ఒప్పెన్‌హైమర్ తనకు పరిచయమైన వివాహిత జీన్ టాట్‌లాక్‌తో రిలేషన్‌షిప్‌ కొనసాగిస్తూ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ క్రమంలో ఒప్పెన్‌హైమర్‌ను యూఎస్ లెఫ్టినెంట్ జనరల్ లెస్లీ గ్రోవ్స్ (మాట్ డామన్) కలిసి అణుబాంబు తయారీ చేయమని కోరుతాడు. దాంతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకొని అణుబాంబును ఒప్పెన్‌హైమర్ తయారు చేయడమే కాకుండా దానిని హిరోషిమా, నాగాసకిలో ప్రయోగిస్తారు.

Oppenheimer Telugu Movie Review and Rating: Another Masterpiece from Christopher Nolan

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు ప్రయోగించిన తర్వాత ఏం జరిగింది? ఒప్పెన్‌హైమర్‌పై అమెరికా ఎలాంటి ఆరోపణలు చేసింది? ఒప్పెన్‌హైమర్‌పై ఎందుకు నేరారోపణలు చేసింది? ఒప్పెన్‌హైమర్‌పై లెవీస్ స్ట్రాస్ (రాబర్ట్ డౌనీ జూనియర్) ఎలాంటి విచారణ చేపట్టారు? అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఈ వివాదంలో ఎందుకు జోక్యం చేసుకొన్నాడు? ఒప్పెన్‌హైమర్‌ తనపై వచ్చిన నేరారోపణలను ఎలా రుజువు చేసుకొన్నాడు? అణుబాంబు ప్రయోగం తర్వాత ఒప్పెన్‌హైమర్ ఎందుకు పశ్చాత్తాపం చెందారు అనే ప్రశ్నలకు సమాధానమే ఒపెన్‌హైమర్ సినిమా కథ.

హాలీవుడ్‌లోనే కాకుండా భారత్‌తో సహా పలు దేశాల్లో దర్శక, నిర్మాత క్రిస్టఫర్ నోలన్‌కు విశేషంగా అభిమానులు ఉన్నారు. నోలన్ సినిమా వచ్చిందంటే.. భాషా, ప్రాంతమనే బేధం అనేది లేకుండా సినిమాను చూసేందుకు ఎగబడుతారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒప్పెన్‌హైమర్ సినిమాకు అదే పరిస్థితి కనిపించింది. ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అలాంటి అంచనాలకు తగినట్టే ఈ సినిమాను అద్బుతంగా తీర్చిదిద్దారు. అయితే గత చిత్రాలతో పోల్చుకొంటే ఈ సినిమా విభిన్నమైనది. డైలాగ్ డ్రామా ఎక్కువగా ఉండటం వల్ల ఓ వర్గం ప్రేక్షకులకు విసుగుపుట్టే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా నింపాదిగా సినిమా చూసే వారికి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది.

Oppenheimer Telugu Movie Review and Rating: Another Masterpiece from Christopher Nolan

ఒప్పెన్‌హైమర్ సినిమా ఫస్టాప్ విషయానికి వస్తే.. చాలా నిదానంగా డాక్టర్, సైంటిస్ట్ ఒప్పెన్‌హైమర్ వ్యక్తిగత జీవితాన్ని విపులంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఒప్పెన్‌హైమర్ పర్సనల్ లైఫ్, రొమాంటిక్ లైఫ్‌ను టచ్ చేస్తూ అసలు కథలోకి వెళ్లేందుకు కాస్త సమయమే తీసుకొన్నాడనిపిస్తుంది. ఇక ఆటం బాంబు తయారీ, ప్రయోగం తర్వాత అసలు కథ మొదలవుతుంది.

ఇక సెకండాఫ్‌లో కమ్యూనిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం ఒప్పెన్‌హైమర్‌ను అనుమానంగా చూస్తూ దోషిగా ముద్ర వేసే ప్రయత్నంతో ఇంటెన్స్ డ్రామా మొదలవుతుంది. ప్రభుత్వ అధికారుల విచారణ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. చివర్లో మానవ వినాశకారిగా మారిన అణుబాంబు తయారీపై ఒప్పెన్‌హైమర్ పశ్చాత్తాపం చెందడంతో కథ భావోద్వేగంగా ముగుస్తుంది. రష్యా, జర్మన్, జపాన్ దేశాలతో అమెరికా వైరం లాంటి అంశాలు ఆకట్టుకొంటాయి.

Oppenheimer Telugu Movie Review and Rating: Another Masterpiece from Christopher Nolan

ఒప్పెన్‌హైమర్ సినిమాలో నటీనటులు గురించి మాట్లాడుకొంటే.. ఒప్పెన్‌హైమర్‌గా సిలియన్ మర్ఫీ అద్బుతంగా ఒప్పెన్‌హైమర్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా కథను, భారాన్ని మొత్తం తానే మోసే ప్రయత్నం చేయడం సినిమాకు హైలెట్. రొమాంటిక్ సీన్లతోపాటు ఎమోషనల్ సీన్లతో అతడు చూసిన బాడీ లాంగ్వేజ్, హావభావాలు ఆకట్టుకొంటాయి. ఈ సినిమాలోని ఆయన పెర్ఫార్మెన్స్‌కు అభిమానులు జేజేలు పలకడం ఖాయం. అవార్డులు కూడా అందుకోవడం తప్పదనే మాట వినిపిస్తున్నది. లెస్లీ గ్రోవ్స్‌గా ఎమిలి బ్లంట్, లెవీస్ స్ట్రాస్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్ ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన వారు కూడా గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే..సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పలు సన్నివేశాలను సజీవంగా మార్చింది. 1940 సంవత్సరానికి ముందు ఆ తర్వాత సాగే కథకు తగినట్టుగా వాతవారణాన్ని క్రియేట్ చేయడంలోను, గొప్ప ఫీల్ కల్పించే పనిలో సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగాలు సక్సెస్ అయ్యాయి. నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయి.

Oppenheimer Telugu Movie Review and Rating: Another Masterpiece from Christopher Nolan

ఒప్పెన్‌హైమర్ సినిమా విషయానికి వస్తే.. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, సైన్ సబ్జెక్టుల ఆధారంగా సాగే అణుబాంబును సృష్టించిన సైంటిస్ట్ బయోపిక్. విజువల్ పరంగా కంటే. డైలాగ్ డ్రామాగా సాగడం సగటు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఫస్టాఫ్‌‌లో కథకు సంబంధించి డిటైయిలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. సెకండాఫ్‌ గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రాసిక్యూషన్ డ్రామా సినిమాకు హైలెట్ అనిస్తుంది. భగవద్గీత, విష్ణు దేవుడి గురించి ప్రస్తావన ఆకట్టుకొంటుంది. సైన్స్ సినిమాలను, హిస్టరీ ఆధారంగా రూపొందే బయోపిక్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఓపిక, ప్రశాంతంగా, డైలాగ్స్‌ను ఫాలో అయ్యే మూడ్‌ను సెట్ చేసుకొని సినిమాకు వెళ్తే మంచి అనుభూతికి గురయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X