Organic Mama Hybrid Alludu Review అవుట్ డేటేడ్ ఫ్యామిలీ డ్రామా.. ఎస్వీ కృష్ణారెడ్డి హిట్ కొట్టాడా?

Rating:
2.0/5
Star Cast: రాజేంద్ర ప్రసాద్, మీనా, సోహెల్, మృణాళిని రవి,
Director: ఎస్వీ కృష్ణారెడ్డి

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, మీనా, సోహెల్, మృణాళిని రవి, వరుణ్ సందేశ్, రష్మీ గౌతమ్, సునీల్, ఆలీ, అజయ్ ఘోష్, సప్తగిరి, ప్రవీణ్, 30 ఇయర్స్ పృథ్వీ, కృష్ణ భగవాన్, రాజ రవీంద్ర, హేమ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి
నిర్మాత: కోనేరు కల్పన
సమర్పణ: అచ్చిరెడ్డి
సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
బ్యానర్: కల్పన చిత్ర, అమ్ము క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-03-03

ఆర్గానిక్ మామ కథ ఏమిటంటే?

ఆర్గానిక్ మామ కథ ఏమిటంటే?

విజయ్ (సోహెల్ సయ్యద్ ర్యాన్) రెండు డిజాస్టర్ సినిమాలు తీసిన డైరెక్టర్. మధ్య తరగతి కుటుంబం (హేమ, సూర్య) కుమారుడైన విజయ్.. బిజినెస్ మ్యాన్ వెంకట రమణ (రాజేంద్ర ప్రసాద్, మీనా) దంపతుల కుమార్తె (హాసిని)తో తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. డబ్బు, సంస్కారానికి ప్రాధాన్యం ఇచ్చే వెంకటరమణ తన కూతురు ప్రేమను నిరాకరిస్తాడు. ఈ క్రమంలో విజయ్‌కి నిర్మాత ముణికొండ అనకొండ ( సునీల్) మూడో సినిమా అవకాశం ఇస్తాడు.

ఆర్గానిక్ మామలో ట్విస్టులు

ఆర్గానిక్ మామలో ట్విస్టులు

రెండు సినిమాలు ఫ్లాఫైన తర్వాత విజయ్ పరిస్థితి ఏమిటి? పగటి కలలు కనే విజయ్‌కి తన తండ్రి చేసిన ఉపదేశం ఏమిటి? హాసినితో పెళ్లికి నిరాకరించిన తర్వాత విజయ్ ఏం చేశాడు? మూడో సినిమా అవకాశం వచ్చిన తర్వాత హిట్ కొట్టాడా? తన ప్రేమను గెలిపించుకోవడానికి విజయ్ ఏం చేశాడు? చివరకు విజయ్, హాసిని ప్రేమను వెంకటరమణ అంగీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు సినిమా కథ.

ఆర్గానిక్ మూవీ ఎలా ఉందంటే?

ఆర్గానిక్ మూవీ ఎలా ఉందంటే?

ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రం రొటీన్‌గా, రెగ్యులర్ సన్నివేశాలతో మొదలవుతుంది. లవ్ స్టోరి, హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాలతో సాగిపోతుంది. తొలి భాగంలో అసలు కథను చెప్పడానికి విషయం లేకపోవడంతో కొండపల్లి బొమ్మలతో సినిమాను సాగదీసే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. హీరోయిన్‌కు పెళ్లి చూపులు ఎపిసోడ్స్‌ను సుదీర్ఘంగా సాగదీయడం.. ఛాన్స్ దొరికితే డైలాగ్స్‌తో క్లాసులు పీకడం అతిగా అనిపిస్తుంది. అమలాపురం ఎపిసోడ్ సహనానికి పరీక్షలాగా ఉంటుంది.

కృష్ణారెడ్డి డైరెక్షన్ ఎలా ఉందంటే?

కృష్ణారెడ్డి డైరెక్షన్ ఎలా ఉందంటే?

దర్శకుడు కృష్ణారెడ్డి గొప్ప సినిమాలను అందించడమే కాకుండా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచిన డైరెక్టర్. కమర్షియల్‌గా కలెక్షన్ల వర్షం కురిపించిన ట్రాక్ రికార్డు ఉంది. అయితే 90 దశకంలో తనకు ఎనలేని కీర్తిని, ప్రతిష్టలను, కమర్షియల్ సక్సెస్‌ను ఇచ్చిన ఫార్ములాతో 9 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఫార్మాట్‌తో అదృష్టం పరీక్షించుకొనేందుకు చేసిన సాహసంగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అని చెప్పవచ్చు. ఎస్వీ కృష్ణారెడ్డి ఇంకా పాతతరం స్క్రీన్ ప్లే, స్టోరి నేరేషన్‌ నుంచి బయటకు రాలేదనే విషయం ఈ సినిమా మరోసారి స్పష్టం చేసింది. పాతికేళ్ల క్రితం నాటు తుపాకితో యుద్దం గెలిచామనే ధీమాతో నేటి తరంలో కూడా అదే ఆయుధం వాడుతానంటే కష్టమే కదా. కాలాన్ని బట్టి ఆయుధాన్ని వాడాలనే తత్వం బోధపడితే పోటీ ప్రపంచంలో గెలవడం కష్టమనేది తెలుసుకోవాల్సిందే.

సోహెల్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

సోహెల్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

నటీనటులు విషయానికి వస్తే.. రొటీన్, రెగ్యులర్‌గా హీరో క్యారెక్టర్‌ను సోహెల్ తన టాలెంట్‌తో నిలబట్టే ప్రయత్నం చేశారు. డైలాగ్ డెలివరీ, ఫెర్ఫార్మెన్స్, డ్యాన్సులు విషయంలో మంచి ఈజ్‌ను మాత్రమే కాకుండా కథను పూర్తిగా తన భుజాలపై మోసే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సోహెల్‌లో టాలెంట్‌కు కొదవలేదు. కానీ మంచి కథలను, యూత్‌కు కనెక్ట్ అయ్యే దర్శకులతో పనిచేసే అవకాశాలను పరిశీలిస్తే.. మంచి యాక్టర్ అనిపించుకోవడానికి, స్థిరంగా ఇండస్ట్రీలో నిలబడటానికి ఛాన్స్ ఉంటుంది.

మిగితా పాత్రల్లో ఎవరెవరంటే?

మిగితా పాత్రల్లో ఎవరెవరంటే?

ఇక మిగితా నటీనటులు విషయానికి వస్తే.. రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఈ సినిమాను నడిపిస్తుంది. నటకిరిటీ ప్రతిభను, పెర్ఫార్మెన్స్‌ను కొలమానంగా ఈ సినిమాను భావించలేం. పాత్ర పరిధి మేరకు రాజేంద్ర ప్రసాద్ న్యాయం చేశాడనే చెప్పవచ్చు. పరిమితమైన పాత్రలో మీనా కనిపించింది. ఆ పరిధిలోనే ఎంత వరకు వీలైతే అంత జస్టిఫికేషన్ చేసింది. సునీల్, సప్తగిరి, పృథ్వీ, కృష్ణ భగవాన్ తమకు అవకాశం దక్కిన సీన్లలో ఫర్వాలేదనిపించారు. వరుణ్ సందేశ్, రష్మీ గౌతమ్ ఒకే అనిపించారు. సూర్య, హేమ కథకు సపోర్టింగ్‌గా నిలిచే పాత్రల్లో అలరించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే..

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే..


సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు సినిమాకు అత్యంత బలం సినిమాటోగ్రఫి. రాంప్రసాద్ పనితనం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. లైటింగ్, కలర్ ప్యాలెట్‌తో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దారనిపిస్తుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కొరియోగ్రఫి డిపార్ట్‌మెంట్ పనితనం బాగుంది. కొరియోగ్రాఫర్ల కష్టానికి సోహెల్ కూడా పూర్తిగా న్యాయం చేశాడనిపిస్తుంది. ఇక కృష్ణారెడ్డి అందించి మ్యూజిక్ మెలోడిస్‌గా ఉంది. కృష్ణారెడ్డి అందించిన డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల అవసరానికి మించి క్లాస్ పీకాడనిపిస్తుంది. కల్పన చిత్ర, అమ్ము క్రియేషన్స్ అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిర్మాత కల్పన కథ వినకుండానే సినిమా చేసినట్టుందా అనిపిస్తుంది. కథ, కథనాలపై కసరత్తు చేస్తే.. కొంతలోకొంత సినిమా గౌరవప్రదంగా ఉండేదనిపిస్తుంది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా కథ విషయానికి వస్తే.. పాత సీసాలో కొత్త సారా లాంటిది. కథ లేకుండా కాస్టింగ్‌తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారనిపిస్తుంది. పెద్దింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం.. దానిని అమ్మాయి తండ్రి అంగీకరించకపోవడం వల్ల వచ్చే సమస్యల చుట్టూ వినోదం కోసం తెచ్చి పెట్టుకొన్న కామెడీ ట్రాక్‌లు చుట్టేసి ప్రేక్షకులకు వడ్డించేందుకు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రయత్నం చేశాడని ఈ సినిమా చూసిన తర్వాత అనిపించే ఫీలింగ్. ఈ సినిమా చూస్తే.. ఎస్వీ కృష్ణారెడ్డి బయోగ్రఫిలా అనిపిస్తుంది. సక్సెస్‌ఫుల్ దర్శకుడిని కథ అడిగితే ఉండే ఇగో సోహెల్ పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలా? అనే అభిప్రాయం కలుగుతుంది. ఈ సినిమాకు సుదీర్ఘంగా సాగే సన్నివేశాలు టెలివిజన్ సీరియలా? అనే అనుమానం కలుగుతుంది.. పాత్రలు అతిగా బిహేవ్ చేయడం సినిమాకు మైనస్‌. పాతతరం వాసనలుండే సినిమాలను ఆదరించే వారికి నచ్చుతుంది. వారాంతంలో ఏదైనా ఫ్యామిలీ తరహా సినిమాలు చూడాలనుకొనే వారికి, వేరే గత్యంతరం లేకపోతే ఈ సినిమాకు వెళ్లమని సలహా ఇవ్వవచ్చు. కృష్ణారెడ్డి గతంలోని కీర్తీ ప్రతిష్టలను గౌరవించి.. ఈ సినిమాకు ఫిల్మీబీట్ ఇచ్చే రేటింగ్ 2/5.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X