twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓరి..నీ టార్చర్‌ పాడుకానూ

    By Staff
    |

    Ori Nee Prema Bangaramkanu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: ఓరి..నీ ప్రేమ బంగారంకానూ
    నటీనటులు: రాజేష్‌, సంగీత, జయప్రకాష్‌ రెడ్డి, ఏవీఎస్‌, బ్రహ్మానందం తదితరులు
    సంగీతం: మణిశర్మ
    నిర్మాణం: మైత్రీ టాకీస్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఏవీఎస్‌

    ఈ సినిమా నవ్వుల పంట అని ఈ చిత్రదర్శకుడు ఏవీఎస్‌ ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ నిజానికి అత్యంత విషాదభరిత చిత్రం. సినిమా ప్రారంభమైన తొలి సన్నివేశం మొదలుకొని చివరి వరకు అన్ని కామెడీ సీన్లే. నిజానికే ఈ సీన్లను బట్టి కథ అల్లుకున్నట్లు కన్పిస్తుంది. అయితే, ఇవి ఏవీఎస్‌ కు మాత్రమే నవ్వు తెప్పిస్తాయి.

    ప్రేక్షకులకు ట్రాజెడీ సీన్లు. రెండు గంటల పాటు ఏవీఏస్‌ చేసిన కామిక్‌-ట్రాజిక్‌ ప్రయత్నాన్ని భరించడం కష్టం. ఈ చిత్రం గురించి అధికంగా రివ్య్యూ చేయడం కూడా దండగ. ఏవీఎస్‌ తన ద్వితీయ దర్శకత్వ ప్రయత్నంలోనూ దారుణంగా ప్లాఫ్‌ అయ్యాడు. కామెడీ యాక్టర్లు ఇలా ప్రేక్షకులకు విషాదాన్ని మిగిల్చే ప్రయత్నాలు ఎందుకు చేస్తారో. గాయకుడు రాజేష్‌ ఈ సినిమాలో హీరో.

    ఆయన 'నటిస్తుంటే' మనం నవ్వుకోవాల్సిందే. అందుకే కెమెరామెన్‌ 'తెలివి'గా చాలా సందర్భాల్లో అతన్ని 'కార్నర్‌' చేశాడు. సంగీత చాలా అందంగా కన్పించింది ఈ చిత్రంలో. ఈ సినిమాలో కళ్ళకు ఇంపుగా ఉన్నది మాత్రం ఫోటోగ్రఫీనే. మణిశర్మ తన స్వంత చిత్రంలాంటి సినిమాకు ఇంత పేలవమైన సంగీతం ఇవ్వడంలోనే ఆయన కమిటిమెంట్‌ అర్థమవుతోంది. టోటల్‌ వేస్ట్‌ మూవీ. మొత్తం కామెడీ యాక్టర్‌ లలో బ్రహ్మనందం నటనే ఒక్కటే చూడముచ్చటగా ఉంది. నవ్వు రాకున్నా.

    కథ: రాజేష్‌, సంగీత ప్రేమించుకుంటారు. రాజేష్‌ ఏమీలేని అనాథ. అయితే, సంగీత తండ్రి జయప్రకాష్‌ రెడ్డి కోటీశ్వరుడు. తన కూతురును చేసుకునేవాడు తన ఆస్తిని కాపాడుతాడో లేదో తెలుసుకోవాలనుకుంటాడు. అందుకని రాజేష్‌ కు కోటి రూపాయలు ఇచ్చి నెల రోజులు దాన్ని కంటికి రెప్పలా కాపాడమని చెప్పుతాడు. ఈ డీల్‌ ఆఖరికి సంగీతకు కూడా తెలియచేయవద్దని చెప్పుతాడు. అలా 31వ రోజున ఈ కోటి రూపాయలు తెస్తే..సంగీతను ఇచ్చి పెళ్ళి చేస్తానంటాడు. ఈ కథ కోసం..రెండు గంటలకుపైగా 'విషాదభరితమైన' కామెడీ సీన్లు పెట్టి సినిమాను నడిపించాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X