For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Paagal Movie Review: ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాగల్‌గా విశ్వక్ సేన్!

  |

  Rating:
  2.5/5
  Star Cast: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరీ, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ
  Director: నరేష్ కుప్పిలి

  సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం పాగల్. సక్సెస్‌పుల్ చిత్రాలను అందిస్తున్న బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. అయితే రిలీజ్‌కు ముందు జరిగిన ఈవెంట్‌లో పాగల్ సినిమాపై అతి విశ్వాసం వ్యక్తం చేసినట్టు అనిపించిన విశ్వక్ సేన్.. తన సినిమా హిట్ కాకపోతే పేరు మార్చుకొంటానని వేదికపై తొడగొట్టినంత పనిచేశాడు. అయితే పాగల్ రిలీజ్ తర్వాత విశ్వక్ సేన్ పేరు మార్చుకొనే పరిస్థితి ఎదురైందా? లేదా అనేది తెలుసుకోవాలంటే పాగల్ సినిమా సినీ ప్రేమికులను ఏ మేరకు ప్రేమలో ముంచేసిందనే విషయాన్ని తెలుసుకొందాం...

  పాగల్ కథ ఏమిటంటే..

  పాగల్ కథ ఏమిటంటే..

  ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి (భూమిక) క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో చిన్నతనంలోనే ప్రేమ్ (విశ్వక్ సేన్) అనాధగా మారిపోతాడు. ప్రేమను పంచే వారు కరువు కావడంతో నిర్వేదానికి గురి అవుతాడు. దాదాపు 1000 మందికిపైగా ప్రేమించినా.. తల్లి లాంటి ప్రేమను కురిపించే.. తల్లిలా చూసుకొందామనే ప్రియురాలు దొరకదు. ఇలాంటి పరిస్తితుల్లో కాబోయే ఎమ్మెల్యే రాజీ (మురళీశర్మ)ను ప్రేమిస్తాడు. ఆయన ఐ లవ్ యూ చెప్పకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తాడు.

  పాగల్‌‌లో కన్‌ఫ్యూజన్ ఇలా..

  పాగల్‌‌లో కన్‌ఫ్యూజన్ ఇలా..

  కాబోయే ఎమ్మెల్యేను ప్రేమ్ ఎందుకు ప్రేమించాడు? రాజీతో ఎందుకు ఐ లవ్ యూ చెప్పించుకొన్నాడు. మగవాడితో ఎందుకు తేడాగా వ్యవహారించాడు. కథలో తీరా (నివేదా పేతురాజ్‌)కు ప్రేమ్‌కు రిలేషన్ ఏమిటి? తల్లిలా ప్రేమను కురిపించే ప్రియురాలు ప్రేమ్‌కు దొరికిందా? అనాధగా ఫీలైన ప్రేమ్‌ తన తోడును ఎలాంటి పరిస్థితులను ఎదురించి దక్కించుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే పాగల్ సినిమా కథ.

  దర్శకుడు నరేష్ కుప్పిలి గురించి

  దర్శకుడు నరేష్ కుప్పిలి గురించి

  దర్శకుడు నరేష్ కుప్పిలి ఎత్తుకొన్న పాయింట్ బాగుంది. తల్లి సెంటిమెంట్‌తో కథను ప్రారంభించి సరైన ట్రాక్‌లో వెళ్తున్నట్టు కనిపించారు. కథ వైజాగ్‌కు చేరిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ను నమ్ముకోవడంతో కాస్త రిలాక్స్ అనిపిస్తుంది. ఎంటర్‌టైన్ కోసం రన్ చేసిన లవ్ ట్రాక్స్‌ను బాగా రన్ చేసి ఆకట్టుకొన్నాడు. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి అసలు పాయింట్‌కు కథను సాగదీసినట్టు అనిపించాడు. చివరకు కథను ముగించే ప్రయత్నంలో రొటీన్‌గా మార్చేసి.. అసలు ఎమోషన్స్‌ను తుస్పుమనిపించాడు. తనంటే ప్రాణం.. ఆమె కళ్లలో నీళ్లు తిరిగితే.. నా గుండెలో రక్తం చిందుతుంది అనే విధంగా చెప్పిన డైలాగ్ కథను, కథనాన్ని నడిపించడం బాగుంది. తొలి చిత్ర దర్శకుడు అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. సెకండాఫ్‌లో అక్కడక్కడ తడబడినట్టు కనిపిస్తుంది.

  ఎన్టీఆరా? విశ్వక్ సేనా?

  ఎన్టీఆరా? విశ్వక్ సేనా?

  ఇక గత సినిమాలో మాదిరిగా విశ్వక్ సేన్ ఎక్కడా కనిపించడు. తెరపైనా ఊసరవెల్లిలో ఎన్టీఆర్‌ను చూస్తున్నామా అనే ఫీలింగ్ వెంటాడుతుంది. అందుకే ఏమో విశ్వక్ సేన్‌ను కనెక్ట్ కాలేకపోయామనిపిస్తుంది. కాకపోతే ప్రేమ్ పాత్ర మాత్రం అక్కడక్కడ భావోద్వేగాన్ని పండించింది. డ్యాన్స్, బాడీ లాంగ్వేజ్ కూడా యంగ్ టైగర్‌ను అనుకరించినట్టే కనిపించింది. ప్రేమ్ పాత్రలో విశ్వక్ సేన్ తన ఒరిజినాలిటీని కోల్పోయాడనిపిస్తుంది. కాకపోతే లవర్ బాయ్‌గా డిఫరెంట్‌గా కనిపించాడు. ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకోవడమే కాకుండా ఈసారి వినోదాన్ని కూడా పంచడం కెరీర్ పరంగా విశ్వక్ సేన్‌కు పాజిటివ్ అంశం.

  ఆకట్టుకొన్న ఇంద్రజా శంకర్ కామెడీ

  ఆకట్టుకొన్న ఇంద్రజా శంకర్ కామెడీ

  పాగల్ చిత్రంలో ఇంద్రజా శంకర్, మేఘా లేఖ, సిమ్రాన్ చౌదరీ పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. విశ్వక్ సేన్, ఇంద్రజా శంకర్ మధ్య లవ్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా మారాయి. మణిరత్నం సినిమాలో మాదిరిగా అరిచి అరిచి చెప్పే డైలాగ్స్‌తో ఇంద్రజా శంకర్ అద్బుతంగా నటించింది. రానున్న రోజుల్లో ఇంద్రజా శంకర్‌కు కమెడియన్‌గా మంచి భవిష్యత్ ఉండటం ఖాయం. ఇంద్రజా శంకర్‌ ఫ్రెష్ హ్యుమర్‌ను పంచింది. రాహుల్ రామకృష్ణ, మహేష్ ఆచంట బ‌ృందాల కామెడీ బాగుంది.

  నివేదా పేతురాజ్ ఫర్వాలేదనిపించే విధంగా

  నివేదా పేతురాజ్ ఫర్వాలేదనిపించే విధంగా

  ఇక తీరగా నివేదా పేతురాజ్ తన పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌ కొంతలో కొంత ఫీల్‌గుడ్‌గా సాగడానికి నివేదా పేతురాజ్ పాత్రనే కారణమని చెప్పవచ్చు. నటనపరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా తన వంతు సహకారాన్ని అందించింది. నివేదా పేతురాజ్ క్యారెక్టర్‌ను బాగా డిజైన్ చేసి ఉంటే సినిమాకు మరింత బలంగా మారి ఉండేది. భూమిక పాత్ర చిన్నదైనా గుర్తుండి పోతుంది.

  టెక్నికల్ విభాగాలు

  టెక్నికల్ విభాగాలు

  సాంకేతిక విభాగాల పనితీరు విషయంలో సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ప్రధానంగా కీలక పాత్రలను పోషించాయి. వైజాగ్‌ను అందంగా చూపించడంలో మణికందన్ సక్సెస్ అయ్యాడు. రధన్ మ్యూజిక్ బాగుంది. సింగిల్ చిన్నోడే మాస్‌గా ఆకట్టుకొన్నది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది.

  పాగల్ మూవీ ఎలా ఉందంటే..

  పాగల్ మూవీ ఎలా ఉందంటే..

  పాగల్ సినిమా తల్లి సెంటిమెంట్‌తో మంచి స్టార్టప్ అందించినా అది సినిమాకు ఎక్కడా ప్లస్ కాలేకపోయింది. ఆ ఫీల్ క్యారీ చేస్తూ... ప్రేమ కథను నడిపించే విషయంలో తడబాటు కనిపిస్తుంది. సెంటిమెంట్‌ను వదిలేసి దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టడం కారణంగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ దెబ్బతిందనిపిస్తుంది. కనీసం సెకండ్ హాఫ్‌లోనైనా కాస్త ఎమోషనల్ కంటెంట్‌పై దృష్టి పెట్టి ఉంటే ఫస్టాఫ్‌లో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్‌కు జస్టిఫికేషన్ ఉండేదేమో అనిపిస్తుంది. నిర్మాతగా బెక్కం వేణుగోపాల్ మరో మంచి ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు. కానీ పూర్తిస్తాయిలో అంది సాధించలేదనే విషయం క్లైమాక్స్‌తో స్పష్టమవుతుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ముందుకొచ్చిన చిత్రం పాగల్. కథ, కథానాల్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఎక్కడో కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. కాకపోతే ప్రస్తుత సమయాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేయడానికి ఉన్న కొన్ని అంశాలు ఈ సినిమాకు పాజిటివ్‌గా మారాయి. రిలీజ్‌కు ముందు ఏర్పడిన కొంత అటెన్షన్‌ సినిమాకు ఓపెనింగ్స్ తెప్పిస్తాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అవి వారాంతం తర్వాత నిలబడితే పాగల్ చిత్రం బెక్కం వేణుగోపాల్, విశ్వక్ సేన్ ఖాతాలో హిట్ పడటం ఖాయం. పాగల్ చిత్రం హిట్ రేంజ్‌ను అందుకొంటుందా లేదా వేచి చూడాల్సిందే. అయితే విశ్వక్ సేన్ పేరు మార్చుకొంటారా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలుతుంది.

  Adivi Sesh To Play AP Police Officer In HIT 2 | Nani | Vishwak Sen
  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరీ, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, మహేస్ ఆచంట, మేఘా లేఖ, ఇంద్రజా శంకర్ తదితరులు
  కథ, దర్శకత్వం: నరేష్ కుప్పిలి
  రచన: చంటి కరాణి
  నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
  మ్యూజిక్: రధన్
  సినిమాటోగ్రఫి: ఎస్ మణకందన్
  ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
  ప్రొడక్షన్ డిజైన్: లతా తరుణ్ దాస్యం
  రిలీజ్ డేట్: 2021-08-14

  English summary
  Paagal Movie Review: Vishwak sen and nivetha pethuraj in the lead roles Paagal movie has finally hits the screen today. Read Here to know about Paagal Movie review
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X