Paanch Minar Movie Review: పాంచ్ మినార్ మూవీ రివ్యూ

Rating:
2.0/5

నటీనటులు: రాజ్ తరుణ్, రాశీ సింగ్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, మీసాల లక్ష్మణ్, నితిన్ ప్రసన్న తదితరులు
దర్వకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, ఎంఎస్ఎం రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫి: ఆదిత్య జవ్వాడి
ఎడిటర్: ప్రవీణ్ పుడి
స్టంట్స్: రాబిన్ సుబ్బు
ఆర్ట్: సురేష్ భీమగాని
కోరియోగ్రఫి: విజయ్ బిన్ని, శ్రవణ్, కృష్ణా
రిలీజ్ డేట్: 2025-11-21

కృష్ణ చైతన్య అలియాస్ కిట్టూ (రాజ్ తరుణ్) తన స్నేహితుడు (సుదర్శన్)తో కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో జుదాలకు పాల్పడి డబ్బు పోగొట్టుకొంటుంటారు. చెల్లెలి పెళ్లి కోసం తండ్రి (బ్రహ్మాజీ) కూడబెట్టిన 5 లక్షల రూపాయలను కూడా పోగొట్టుకొంటాడు. ఆ తర్వాత చేసేది ఏమీ లేకపోవడంతో చెవిటి వాడిగా నాటకం ఆడుతూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అయితే తన కారులో ప్రయాణించిన ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్.. బిజినెస్ మ్యాన్ (రవివర్మ)ను కాల్చి చంపిన ఘటనలో సాక్షిగా మారిన కిట్టూను కూడా చంపేందుకు ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత డాన్ మూర్తి (అజయ్ ఘోష్), సీఐ అయ్యర్ (నితిన్ ప్రసన్న) కూడా కిట్టూను చంపేందుకు వెంటపడుతుంటారు.

Paanch Minar Review and Rating

ఈజీగా డబ్బు సంపాదించి ఉన్నపళంగా కోటీశ్వరులు కావాలని తన స్నేహితులతో కిట్టూ ఎలాంటి ప్లాన్ చేశాడు? తన చెల్లెలి పెళ్లి కోసం తండ్రి కూడబెట్టిన 5 లక్షల రూపాయలను కిట్టూ ఎలా తగలేశాడు? బిజినెస్ మ్యాన్ రవివర్మను ఎవరు? ఎందుకు కాల్చి చంపారు. బిజినెస్ మ్యాన్ హత్య కేసులో సాక్షిగా మారిన కిట్టూను దుండగులు ఎందుకు చంపాలని ప్లాన్ చేశారు? ఈ వ్యవహారంలో తనకు లభించిన 5 కోట్లను కిట్టూ ఏం చేశాడు? చివరకు రౌడీ మూకలు, కంట్రాక్టు కిల్లర్స్ నుంచి తప్పించుకొన్నాడా? తాను ప్రేమించిన అమ్మాయి (రాశీ సింగ్)ను పెళ్లి చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే పాంచ్ మినార్ సినిమా కథ.

దర్శకుడు రామ్ కడుముల రాసుకొన్న గ్యాంగ్‌స్టర్, మాఫియా ఎలిమెంట్స్‌తో రాసుకొన్న కథకు కామెడీ, ఫన్ జోడంచిన విదానం బాగుంది. అయితే రెగ్యులర్, రొటీన్ డ్రామా కాకుండా ఏదైనా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌తో సన్నివేశాలను రాసుకొని ఉంటే.. బెటర్ యాక్షన్ థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది. దర్శకుడు రామ్ కొత్తవాడైనా యాక్షన్, కామెడీ సన్నివేశాలను బాగా డీల్ చేశాడు. స్క్రీన్ ప్లేలో వైవిధ్యాన్ని చూపించడంతో సినిమాలో కొత్తగా అంశాలు లేకపోయినా.. సన్నివేశాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఒకే పాయింట్‌ చుట్టూ కథ తిరగడం వల్ల.. సినిమా మొత్తం అక్కడక్కడే తిరిగి కొన్నిసార్లు బోర్ కొట్టించేలా చేస్తుంది. కాకపోతే రాజ తరుణ్, రామ్ చేసిన అటెంప్ట్ అభినందించదగినదే.

కృష్ణ చైతన్య అలియాస్ కిట్టూగా నటించిన రాజ్ తరుణ్ చాలా రోజుల తర్వాత తన బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా పాత్రను ఎంచుకొని తనదైన శైలిలో నటించాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఎనర్జిటిక్‌గా కనిపించాడు. కిట్టూ పాత్రలో అలవోకగా ఒదిగిపోయి తన మార్కు డైలాగ్స్‌తో ఆకట్టుకొన్నాడు. బ్రహ్మాజీ మరోసారి కామెడీ సన్నివేశాల్లో చెలరేగిపోయారు. అజయ్ ఘోష్ చక్కటి విలనిజాన్ని పండించారు. చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించే ప్రయత్నం చేశారు.

దర్శకుడు రామ్ రాసుకొన్న రేసీ స్క్రీన్ ప్లే తగినట్టుగా సన్నివేశాలను శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పరుగులు పెట్టించారు. ఆదిత్య జువ్వాడ సినిమాటోగ్రఫి బాగుంది. సరేష్ భీమగాని ఆర్ట్ వర్క్ సినిమాకు రిచ్‌నెస్ తెచ్చిపెట్టింది. యాక్షన్ ప్రధానంగా సాగే థ్రిలర్‌లో రాబిన్ సుబ్బు డిజైన్ చేసిన స్టంట్స్ కూడా బాగున్నాయి. మాధవి, ఎంఎస్ఎం రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. లవ్, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో సాగే రెగ్యులర్ ఎంటర్‌టైనర్. ఇటీవల రాజ్ తరుణ్ నటించిన చిత్రాల్లో బెటర్‌గా ఉంది. ఈ సినిమా అంచనాలు పెట్టుకోకుండా వెళితే.. ఓ రకమైన అనుభూతి ఉంటుంది. యూత్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి. వీలుంటే. ఈ సినిమాను ఓసారి థియేటర్‌లో ట్రై చేయండి..

More from Filmibeat

Read more about: raj tarun brahmaji Paanch Minar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X