Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ

Rating: 2.25/5

నటీనటులు: చైతన్యరావు, సునీల్, శ్రద్దా దాస్, మాళవిక సతీషన్, హర్ష చెముడు, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి తదితరులు
దర్శకత్వం: కంభంపాటి సంతోష్
నిర్మాతలు: మహిధర్ రెడ్డి, దేవేష్
మ్యూజిక్ డైరెక్టర్: రీ
సినిమాటోగ్రాఫర్: బాల సరస్వతి
ఎడిటర్: శశాంక్ ఉప్పుటూరి
రిలీజ్ డేట్: 2024-04-19

తెలుగు సినిమా పరిశ్రమలో డైరెక్టర్‌గా రాణించాలని కలలు కనే చైతన్య (చైతన్యరావు) తన స్నేహితుడు హర్ష (హర్ష చెముడు)ను హీరోగా పెట్టి సినిమా చేయాలని అనుకొంటాడు. కానీ తాను చెప్పిన కథ నచ్చుతుంది అయితే హర్షను హీరోగా సినిమా చేయడానికి ఇష్టపడరు. ఆ క్రమంలో తమను తీవ్రంగా అవమానించిన నిర్మాత శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) భార్యను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. కిడ్నాప్ డ్రామాలో బార్ శ్రీను (సునీల్) ఎంట్రీ ఇచ్చి.. శెట్టి భార్యను కిడ్నాప్ చేస్తారు. చైతన్య మాత్రం నిర్మాత పనిమనిషి (శ్రద్దాదాస్)ను ఎత్తుకెళ్తారు.

శెట్టి రెండో భార్యను కిడ్నాప్ చేయాలని చైతన్య చేసిన ప్లాన్ వెనుక అసలు విషయం ఏమిటి? శెట్టి భార్యను ఎందుకు బార్ శ్రీను టీమ్ ఎందుకు కిడ్నాప్ చేశారు. శెట్టి భార్యను కిడ్నాప్ చేయాలనుకొన్న చైతన్య ఆయన వంట మనిషిని ఎందుకు ఎత్తుకెళ్లారు. గందరగోళంగా మారిన కిడ్నాప్ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే పారిజాత పర్వం సినిమా కథ.

Paarijatha Parvam Review and Rating  Chaitanya Rao s Crime Comedy

పారిజాత పర్వం సినిమా గుడ్ మూడ్, నోట్‌లోనే ప్రారంభమవుతుంది. అయితే కిడ్నాప్ ఎపిసోడ్ వరకు కొంత ఆసక్తిని రేకెత్తించేలా దర్శకుడు సంతోష్ నడుపుతున్నాడనే ఫిలింగ్ కూడా కలుగుతుంది. కానీ కిడ్నాప్ తర్వాత కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం.. అటు క్రైమ్ కాకుండా.. ఇటు కామెడీ సినిమా కాకుండా పోవడంతో ప్రేక్షకుడికి ఏం చూస్తున్నామో అర్ధం కాని పరిస్థితి. కథను సాగదీసి.. అక్కడక్కడే తిప్పి.. విసుగుపుట్టించేలా చేస్తాడు. కానీ క్లైమాక్స్‌ విషయానికి వచ్చే సరికి సరైన ట్రాక్ ఎక్కాడని అనిపించే లోపే సినిమాకు కావాల్సిన డామేజ్ జరిగిపోయిందనిపిస్తుంది.

ఔత్సాహిక సినీ దర్శకుడి చైతన్య రావు పాత్రలో ఒదిగిపోయాడు. దర్శకులు కావాలనుకొనే వారు ఎలాంటి కష్టాలకు గురి అవుతారనే విషయాన్ని తన హావభావాలతో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఫెర్ఫార్మెన్స్ పరంగా కొంత మెచ్యురిటీ కనిపించింది. ఇక ప్రధానమైన పాత్రలో సునీల్ నటించాడు. కానీ ప్రతీ సినిమాలో డిఫరెంట్ రోల్స్‌కు ఒకే రకమైన యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ తప్ప వేరియేషన్ కనిపించడం లేదు. ఆ విషయాన్ని గ్రహిస్తే.. మరో మంచి నటుడిని సునీల్ రూపంలో చూడొచ్చు. శ్రద్దాదాస్, సురేఖ వాణి లాంటి గ్లామర్ పంట పండించడానికి అవకాశమున్నా.. ఆ దిశగా ప్రయత్నం కనిపించలేదు. మాళవిక ఆటలో అరటిపండుగా కనిపిస్తుంది. ఇతర పాత్రల్లో కనిపించిన వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి.

Paarijatha Parvam Review and Rating  Chaitanya Rao s Crime Comedy

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే బలమైన కథ, సన్నివేశాలు లేకపోవడంతో ఆ విభాగం తమ పనితనాన్ని చూపించుకొనే స్కోప్ లేకపోయింది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు బెస్ట్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. క్రైమ్, కామెడీ సినిమాలను ఆదరించే వారు చూడటానికి అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X