Padakkalam Movie Review: పడక్కాలమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సూరజ్ వెంజరామూడు, షరాఫ్ యూ ధీన్, సందీప్ ప్రదీప్, సాఫ్, అరుణ్ అజికుమార్, అరుణ్ ప్రదీప్, పూజా మహరాజ్ తదితరులు
రచన, దర్శకత్వం: మను స్వరాజ్
నిర్మాత: విజయ్ బాబు, విజయ్ సుబ్రమణ్యం
సినిమాటోగ్రఫి: అను మోతెదాత్
ఎడిటింగ్: నిధిన్ రాజ్ అరోల్
మ్యూజిక్: రాజేశ్ మురుగన్
బ్యానర్: ఫ్రైడే ఫిల్మ్ హౌస్, కేఆర్జీ స్టూడియోస్
థియేట్రికల్ రిలీజ్ డేట్: 2025-05-08
ఓటీటీ రిలీజ్: జియో హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-06-10
జితిన్ ( సందీప్ ప్రదీప్), రామ్ జాద్ (అరుణ్ ప్రదీప్), నకుల్ (అరుణ్ అజికుమార్), కన్నన్ (సాఫ్) బీటెక్ చదివే ఇంజినీరింగ్ స్టూడెంట్స్. అదే కాలేజీలో చదివే జీవిక (నిరంజన అనూప్)తో జితిన్‌కు బ్రేకప్ అవుతుంది. ఆ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ షాజీగా ఉంటాడు. అదే కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ రంజిత్ వద్ద ఓ పురాతన గ్రంధం లాంటి అరుదైన పరికరం ఉంటుంది. దాని సహాయంతో ప్రొఫెసర్ షాజీ శరీరాన్ని అదృశ్య శక్తితో రంజిత్ కంట్రోల్ చేస్తుంటాడు.రంజిత్ చేసే మాయాజాలాన్ని జితిన్ చూస్తాడు. తన ముగ్గురి స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకొంటే.. బ్రేకప్ కారణంగా మతిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడని గేలి చేస్తారు. అయితే ఓ సందర్భంలో ఆ పరికరం వల్ల జితిన్ ఆత్మ షాజీలోకి, షాజీ ఆత్మ రంజిత్‌లోకి, రంజిత్ ఆత్మ జితిన్‌లోకి వెళ్తాయి.

జితిన్, జీవిక మధ్య బ్రేకప్ ఎందుకు జరిగింది? రంజిత్ వద్ద ఉన్న పురాతన పరికరం ఏమిటి? దానికి విజయనగర పాలకులకు ఉన్న సంబంధం ఏమిటి? విజయనగర పాలకుల నుంచి టిప్పు సుల్తాన్ ఎందుకు ఆ పరికరాన్ని ఎందుకు దొంగిలించాలని అనుకొన్నాడు? రంజిత్ చేతికి ఆ పరికరం ఎలా దొరికింది? ఆ పరికరాన్ని రంజిత్ ఎలా ఉపయోగించుకొన్నాడు? ఈ ముగ్గురి ఆత్మలు ఒకరి నుంచి మరొకరికి ఎలా మారాయి. ఆత్మలు మారడం వల్ల చోటు చేసుకొన్న పరిస్థితులు ఏమిటి? చివరకు ఎవరి ఆత్మలు వారి దేహంలోకి వచ్చాయా? అనే ప్రశ్నలకు సమాధానమే పడక్కాలమ్ సినిమా కథ.
యూత్‌ఫుల్ కాలేజీ డ్రామాగా, ఎంటర్‌టైనర్‌గా బాడీ స్వాపింగ్ (ఆత్మల మార్పిడి) పాయింట్‌తో దర్శకుడు మను రాజ్ రాసుకొన్న కథ బాగుంది. విజయనగరాన్ని పాలించిన రాజు ఆదిత్య ఓ మాయ వస్తువును ఉయోగిస్తుంటాడు. విచిత్ర విన్యాసాలకు కాకుండా దానిని ప్రపంచాన్ని శాసించే శక్తిమంతమైన వస్తువుగా భావిస్తాడు. ఆ విషయం తెలుసుకొన్న టిప్పు సుల్తాన్ యుద్దం ప్రకటించి విజయనగర రాజును ఓడించి ఆ వింత వస్తువును దక్కించుకొంటాడు. అయితే ఆ వస్తువు గురించి తెలిసిన ట్రావంకోర్ రాజు కార్తీకేయ.. టిప్పు సుల్తాన్‌ను ఓడించి దానిని దక్కించుకొంటాడు. అయితే దాని వల్ల మంచి కంటే ఎక్కువ చెడు ఉందని దానిని ఓ స్థలంలో పాతిపెడుతాడు.
ఆ మాయ వస్తువు ప్రస్తుత కాలంలో ప్రొఫెసర్ రంజిత్‌కు చేతికి వస్తుంది. ఆ మాయ వస్తువుతో రంజిత్ చేసిన దుష్ట కార్యక్రమాలు జితిన్ దృష్టికి వస్తాయి. అయితే ఆ వస్తువు చుట్టు కథ ఆసక్తిగా సాగడం ఫస్టాఫ్‌కు హైలెట్‌గా నిలుస్తుంది. ఎప్పుడైతే ఆ వింత వస్తువుతో ఆడిన గేమ్‌తో జితిన్, షాజీ, రంజిత్ బాడీలు స్వాప్ అవ్వడం సినిమాలో భారీ ట్విస్ట్‌తో ఆ తర్వా కథపై ఆసక్తిని రేపేలా దర్శకుడు చేస్తాడు. ఇక సెకండాఫ్‌లో ఆత్మల మార్పిడి తర్వాత కథను ఫుల్లుగా ఎంటర్‌టైనింగ్‌గా నడిపేందుకే దర్శకుడు మొగ్గు చూపడంలో ఇంటెన్సిటీ మిస్ అయిందనిపిస్తుంది. మాయ వస్తువుతో కథను ఇంకా బెటర్‌గా చెప్పడానికి అవకాశం ఉన్నా ఆ దిశగా ప్లాన్ చేయకపోవడంతో సెకండాఫ్ రొటీన్‌గా మారుతుంది. బాడీ స్వాప్ తర్వాత తిరిగి ఆత్మలు ఎలా చేరాయనేది కొంత ఆసక్తిగా ఉంటుంది.
అయితే కాలేజీ విద్యార్థిా జితిన్ చుట్టూ కథ తిరగడంతో ఆ అవకాశాన్ని సందీప్ ప్రదీప్ చక్కగా ఉపయోగించుకొన్నాడు. తన క్యారెక్టర్‌లో వేరియేషన్స్‌ను చక్కగా పలికించాడు. ఆత్మల మార్పిడి తర్వాత తన పాత్ర ద్వారా వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ రంజిత్‌గా షరాఫ్ యూ ధీన్ నెగిటివ్ టచ్ ఉన్న సాఫ్ట్ విలనిజాన్ని పండించాడు. షాజీ అమాయక ప్రొఫెసర్ పాత్రలో కామెడీని వర్కవుట్ చేశారు. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్‌కు ఉన్న స్కోప్ ఉండటంతో ఆ రెండు విభాగాలు కథను రిచ్‌గా ప్రజెంట్ చేశాయి. అను మూథేదాత్ సినిమాటోగ్రఫి సినిమాను ఇంటెన్స్‌గా మార్చింది. రాజేశ్ మురుగేశన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజయ్ బాబు, విజయ్ సుబ్రమణ్యం అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా డిఫరెంట్‌గా ట్విస్టులు, టర్నులతో ఎమోషనల్‌గా రూపొందించిన విధానం, కథను చాలా ఇంటెన్సివ్‌గా చెప్పిన తీరు బాగుంది.
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో బాడీ స్వాపింగ్ అనే కొత్త పాయింట్‌తో కాలేజీ డ్రామాగా రూపొందించారు. ఈ సినిమాలో దర్శకుడి టేకింగ్, విజన్, సినిమాటోగ్రఫి, యాక్టర్ల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ ప్లస్ పాయింట్. అయితే ఫీల్ గుడ్ పాయింట్‌తో ఫస్టాఫ్‌ను పకడ్బందీగా కథను నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో స్టోరీలో ఉండే అడ్వాంటేజ్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోయాడనిపిస్తుంది. సెకండాఫ్‌ను మరింత బెటర్‌గా ప్రజెంట్ చేసి ఉంటే.. మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారి ఉండేది. అయితే మాయ వస్తువు గురించిన కన్ క్లూజన్ సరిగా ఇవ్వకపోవడం మైనస్. ఈ సినిమా జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ ఫన్ డ్రామాను మిస్ చేయకుండా చూడండి.. డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారు.


Click it and Unblock the Notifications











