twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పడిపడి లేచె మనసు సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Padi Padi Leche Manasu Movie Review | Filmibeat Telugu

    Rating:
    2.5/5
    Star Cast: శర్వానంద్, సాయి పల్లవి, సునీల్
    Director: హను రాఘవపూడి

    విభిన్నమైన పాత్రలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం పడిపడి లేచె మనసు. ఈ చిత్రానికి అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సక్సెస్‌లను అందించిన హను రాఘవపుడి దర్శకుడు. ఫిదా, ఎంసీఏ లాంటి చిత్రాలతో దుమ్మురేపిన సాయిపల్లవి కథానాయిక. వీరిందరి కలయికలో రూపొందిన అందమైన ప్రేమకథ డిసెంబర్ 21 రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ ముగ్గురికి పడిపడి లేచె మనసు ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    పడిపడి లేచె మనసు స్టోరీ

    పడిపడి లేచె మనసు స్టోరీ

    ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా సరదాగా కాలం గడిపే పుట్‌బాల్ ప్లేయర్ సూర్య (శర్వానంద్) తొలిచూపులోనే వైశాలి( సాయిపల్లవి)తో ప్రేమలో పడుతాడు. వైశాలిని తన ప్రేమను అంగీకరింపజేయడానికి నానా రకాలు ప్రయత్నించి చివరకు సక్సెస్ అవుతాడు? వారిద్దరూ వీడదీయలేనంతగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోతారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు? చివరి నిమిషంలో ఓ బలమైన కారణంగా ప్రేమకు పెళ్లి అడ్డంకి అనే పాయింట్‌తో వైశాలితో ప్రేమకు నిరాకరిస్తాడు. దాంతో నేపాల్‌లో వారి లవ్ బ్రేకప్ అవుతుంది? కానీ ఏడాది తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవాలనుకొనే ఫీలింగ్ కలిగితే వారిద్దరూ అక్కడే కలుసుకోవాలని నిర్ణయించుకొంటారు. కానీ వారిద్దరూ కలువడానికి కొన్ని నిమిషాల ముందు ఓ భారీ ప్రమాదం జరుగుతుంది?

    పడిపడి లేచె మనసు మలుపులు

    పడిపడి లేచె మనసు మలుపులు

    భారీ ప్రమాదం తర్వాత సూర్య, వైశాలి కలుసుకొన్నారా? వారిద్దరి మధ్య మళ్లీ ఎలాంటి అంశాలు చోటుచేసుకొన్నాయి. తనను కలిసిన సూర్యను వైశాలి ఎందుకు దూరం పెట్టింది? తన బావ (సునీల్)తో తల్లిదండ్రులు పెళ్లి చేయాలన్న వైశాలి తల్లిదండ్రులు ప్రయత్నం ఫలించిందా? సూర్య తల్లిదండ్రులు (ప్రియా రామన్, సంపత్ రాజ్) విడిపోవడానికి కారణం ఏమిటి? తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వైశాలితో ప్రేమపై ఎలాంటి ప్రభావం పడింది. విడిపోయిన సూర్య తల్లిదండ్రులు మళ్లీ కలుసుకొన్నారా? ఇలాంటి ట్విస్టుల మధ్య సూర్య, వైశాలి కథకు ఎలాంటి ముగింపు దొరికిందనే ప్రశ్నలకు సమాధానమే ‘పడి పడి లేచే మనసు' సినిమా కథ.

    ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    లవ్ బ్రేకప్ అయిన ఏడాది తర్వాత నేపాల్‌లో కలుసుకోవడానికి వెళ్లిన సూర్య అనుకోకుండా ఓ విషయంలో పోలీసులకు దొరికిపోతాడు. తన ప్రియురాలి వైశాలిని కలుస్తాడా లేదా అనే ఉత్కంఠ ప్రేక్షకుడిని ఉత్సాహపరిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌కు కథ చెప్పడంతో సినిమా కథలోకి వెళ్లిపోతాం. వైశాలిని ప్రేమించాడనికి సూర్య ఆడే డ్రామా రొటీన్‌గా ఉన్నప్పటికీ.. ఆకట్టుకోగలిగింది. తొలి భాగంలో కొంత సాగదీత అనిపించినప్పటికీ శర్వానంద్, సాయిపల్లవి ఫెర్ఫార్మెన్స్‌ ఆ లోపాన్ని సరిదిద్దగలిగింది. ఓ ఆసక్తికరమైన పాయింట్‌ రెండోభాగంపై ఆసక్తిని పెంపొందించడం జరుగుతుంది.

     సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    రెండో భాగంలో సూర్య, వైశాలి కలుస్తారనే ఆసక్తికి ఓ భారీ ట్విస్ట్ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. కానీ మతిమరుపు అనే అంశం ప్రేక్షకుడిని చాలానే ఇబ్బందికి గురిచేసేలా ఉంటుంది. అంతేకాకుండా ఫీల్‌గుడ్‌ను కథను కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోకి నెట్టివేసినట్టు కనిపిస్తుంది. సునీల్ ఎంట్రీతో కథలో ఏదైనా ప్రభావవంతమైన మలుపు తిరుగుతుందా అని ఎదురుచూస్తే కొంత నిరాశే ఎదురవుతుంది. సాగదీత ధోరణిలో, కృత్రిమమైన ట్విస్టులు కథలో ఉండే మ్యాజిక్‌ను దెబ్బ తీశాయనే ఫీలింగ్ సెకండాఫ్‌లో కలుగుతుంది.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    ఈ తరం దర్శకుల్లో బుర్ర పెట్టి సినిమాలు తీస్తాడనే పేరు హను రాఘవపూడికి ఉంది. అదే సమయంలో సాధారణ ప్రేక్షకుడికి అర్ధం కాని విధంగా కథ చెబుతాడనే విమర్శ కూడా ఉంది. కానీ కృష్ణగాడి ప్రేమకథతో ట్రాక్‌లో పడ్డాడనిపించింది. అయితే పడి పడి లేచే విషయానికి వస్తే తొలిభాగంపై పట్టుబిగించిన ఆయన రెండో భాగంలో గందరగోళంలో పడేశాడు. మళ్లీ తన మేథోశక్తిని కొంచెం గట్టిగానే ఉపయోగించడం కథ అదుపు తప్పినట్టు అనిపించింది. సంపత్ రాజ్ ఎపిసోడ్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. తండ్రితో రెండుసార్లు హీరో పడే సంఘర్షణ దర్శకుడిగా అతని ప్రతిభను చెబుతుంది. అలాగే భావోద్వేగమైన ప్రేమకథను మరోసారి సంపూర్ణంగా అందించడంలో తడబాటు కనిపించింది. కాకపోతే యూత్‌ను, ఫ్యామిలినీ ఆకట్టుకొనే అంశాలతో హను నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడనిపిస్తుంది.

    శర్వానంద్ యాక్టింగ్

    శర్వానంద్ యాక్టింగ్

    సూర్య పాత్రలో శర్వానంద్ మరోసారి అద్భుతంగా తెరపైన రాణించాడు. అన్ని రకాలు భావోద్వేగాలను పండించడంలో తనకు తానే సాటి అనిపించాడు. కథలో కన్‌ఫ్యూజన్ వల్ల కొంత సినిమాపై అసంతృప్తి కలిగినా.. సూర్యగా ప్రతీ ఆడియెన్‌ను ఆకట్టుకొట్టాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి తన నటనస్థాయికి తగ్గ ప్రతిభతో మెప్పించాడనే చెప్పవచ్చు.

    సాయిపల్లవి ఫెర్ఫార్మెన్స్

    సాయిపల్లవి ఫెర్ఫార్మెన్స్

    వైశాలి పాత్రతో గ్లామర్ పరంగానే కాకుండా నటనపరంగా సాయిపల్లవి మరోసారి తానేంటో నిరూపించుకొన్నది. తొలిభాగంలో చిలిపిగా, రెండోభాగంలో రెట్రోగ్రేడ్ అమ్నిషియా వ్యాధికి గురైన అమ్మాయిగా అద్బుతంగా నటించింది. డ్యాన్సులతో అదరగొట్టింది. ఎమోషనల్ సీన్లలో ఎప్పటిలానే తన సత్తాను చూపించింది. ఓవరాల్‌గా సినిమాకు వెన్నుముకగా నిలిచిందని చెప్పవచ్చు.

    సునీల్ గురించి

    సునీల్ గురించి

    సునీల్ మరోసారి అతిథి పాత్రకే పరిమితమయ్యాడు. కథలో భాగమయ్యాడే గానీ.. కథను ముందుకు తీసుకెళ్లే భారం తన పాత్రకు లేకపోయింది. దాంతో సినిమాలో ఉన్నాడనిపిస్తాడు తప్ప పెద్దగా ఉపయోగం కనిపించదు. రొటీన్ యాస, నటనతో బోర్ కొట్టించిన ఫీలింగ్ కలుగుతుంది. విలన్ పాత్రలో శత్రు మరోసారి ఆకట్టుకొన్నాడు. నత్తితో శత్రు పలికిన డైలాగ్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌ బాగుంది.

    ఇతర పాత్రల్లో

    ఇతర పాత్రల్లో

    మిగితా పాత్రల్లో సాయిపల్లవికి తండ్రిగా మురళీ శర్మ, శర్వానంద్‌కు తండ్రిగా సంపత్ రాజ్ నటించాడు. మురళీ శర్మ పాత్ర కథకు బలమైందే కానీ పెద్దగా స్కోప్ లేకపోయింది. ఇక సంపత్ రాజ్ పాత్ర కేవలం మూడు నాలుగు సీన్లకే పరిమితమైనా తనదైన నటనతో అదరగొట్టాడు. ఎమోషన్‌తో సాగే సీన్లలో సంపత్ రాజ్ అద్భుతమైన హావభావాలను పలికించాడు.

    సినిమాలో కొన్ని సీన్లకు

    సినిమాలో కొన్ని సీన్లకు

    హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రియదర్శి ఇతరులు నటించారు. సినిమాలో కొన్ని సీన్లకు సపోర్టింగ్‌గా కనిపిస్తారు. వారందరి యస్‌బాస్ లాంటి క్యారెక్టర్లే. ఇక వెన్నెల కిషోర్ రెండు, మూడు సీన్లకే పరిమితమవ్వడంతో తన మార్కు కామెడీ పండించలేకపోయాడు. అలాగే సత్యం రాజేశ్ పాత్ర కూడా అలానే ఉంది. కథలో డిమాండ్ వేరేది ఉండటం కారణంగా కామెడియన్ల క్యారెక్టర్లు అసంపూర్తిగానే కనిపిస్తాయి.

    సాంకేతిక విభాగాల పనీతీరు

    సాంకేతిక విభాగాల పనీతీరు

    సాంకేతిక విభాగాల్లో జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫి బాగుంది. తొలిభాగంలో కోల్‌కతాను మరింత అందంగా చూపించాడు. హౌరా బ్రిడ్జి, పాత నగరంలో కొన్ని పురాతన భవనాలను అందంగా కెమెరాలో ఒడిసిపట్టుకొన్నారు. నేపాల్‌లో భూకంపం సీన్లు బాగున్నాయి. ఆర్ట్ విభాగం పనితీరు సినిమాటోగ్రఫికి మరింత ఉపయోగంగా మారింది. సంగీతం విషయానికి వస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. తెర మీద పాటలు గొప్పగా అనిపించలేదు. ఎడిటింగ్ విభాగానికి చాలా పని మిగిలే ఉంది. ఫస్టాఫ్‌లో పది, పదిహేను నిమిషాలు మొహమాటం లేకుండా యదేచ్ఛగా కోత పెట్టవచ్చు.

    ప్రొడక్షన్ వాల్యూస్

    ప్రొడక్షన్ వాల్యూస్

    శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై తెరకెక్కిన ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కథకు కావాల్సిన లోకేషన్ల విషయంలోనూ, క్వాలిటీ విషయంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. నేపాల్, కోల్‌కతా లోకేషన్ల ఎంపిక బాగుంది. సంపత్ రాజ్, మురళీ శర్మ లాంటి పాత్రల ఎంపిక సినిమాకు సానుకూలంగా మారింది. కథపై మరికొంత కసరత్తు చేయాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    యూత్‌కు, ఫ్యామిలికి నచ్చే అంశాలతో రూపొందిన చిత్రం పడిపడి లేచె మనసు. కానీ సంపూర్ణంగా తెరపైన వండి వార్చడంలో దర్శకుడి తడబాటు కనిపిస్తుంది. సినిమా సగటు ప్రేక్షకుడికి చేరకపోతే హను రాఘవపూడి ఇంటెలెక్చువాలిటే ప్రధాన కారణం అవుతుంది. వీకెండ్‌లో, ఫెస్టివల్ హాలిడేస్‌ ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం. ఏ సెంటర్లు, మల్లిప్లెక్స్ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన ఉండొచ్చు. బీ,సీ సెంటర్లలో జెండా ఎగురవేస్తే ఈ సినిమా హిట్ రేంజ్‌ను అంచనా వేయడం కష్టమే అని చెప్పవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    శర్వానంద్, సాయిపల్లవి పెర్ఫార్మెన్స్
    కథ
    సినిమాటోగ్రఫి
    ఫస్టాఫ్

    మైనస్ పాయింట్స్
    కథనం
    పాటలు, సంగీతం
    సెకండాఫ్
    కథలో అతిగా కన్‌ఫ్యూజన్

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    శర్వానంద్, సాయిపల్లవి, ప్రియా రామన్, సునీల్, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు
    దర్శకత్వం: హను రాఘవపుడి
    నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి
    మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
    సినిమాటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి
    ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
    రిలీజ్: 2018-12-21

    English summary
    Padi Padi Leche Manasu has been unveiled a week prior to the film’s release and it is garnering enough attention already. The Hanu Raghavapudi directorial Padi Padi Leche Manasu stars Sharwanand and Sai Pallavi as the lead pair. It is all set for release on December 21.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X