For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pakka Commercial Movie Review: గోపీచంద్ మారుతి కాంబో సినిమా ఎలా ఉందంటే?

  |

  రేటింగ్: 2.75/5

  Recommended Video

  పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia

  నటీనటులు: గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి, శియ, చిత్రా శుక్లా తదితరులు
  సమర్పణ: అల్లు అరవింద్
  నిర్మాత: 'బన్నీ' వాసు
  కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి
  సినిమాటోగ్రఫీ: క‌ర్మ్‌ చావ్లా
  సంగీతం: జేక్స్ బిజాయ్

  చాలా కాలం నుంచి సాలిడ్ హీట్ కోసం ఎదురుచూస్తున్న మ్యాచ్ స్టార్ గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. చిన్న సినిమాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మారుతి గీత ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ ఆసక్తి రేకెత్తించడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అది కాకుండా సీరియల్ నటిగా రాశి ఖన్నా పెర్ఫార్మన్స్ అదిరిపోయింది అనే విషయం ట్రైలర్ టీజర్ల ద్వారా క్లారిటీ వచ్చేసింది. మరి ఈ సినిమా నిజంగా ప్రేక్షకులు ఆశించిన మేర ఆకట్టుకుందా? లేదా? అనే వివరాల్లోకి వెళితే

  పక్కా కమర్షియల్ కథ ఏమిటంటే?

  పక్కా కమర్షియల్ కథ ఏమిటంటే?

  సూర్య నారాయణ(సత్య రాజ్) రాజ్ ఒక నిజాయితీ గల జడ్జి. అనుకోకుండా ఒక రోజు ఒక కేసులో తన తీర్పు వల్ల ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో తనకు ఈ న్యాయవృత్తి సరికాదని చెప్పి జడ్జి పదవికి రాజీనామా చేసి కిరాణా షాపు పెట్టుకుని కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. తాను చేసిన తప్పు తన కొడుకు లక్కీ(గోపీచంద్) ద్వారా సరిదిద్దుకోవాలని భావించి అతనిని లాయర్ చదివిస్తాడు. అన్యాయం జరిగిన వారి వైపు నిలబడి లాభాపేక్ష లేకుండా కేసులు వాదించమని చిన్నప్పటి నుంచి అతనికి నూరిపోస్తూ ఉంటాడు. అయితే ఆ కొడుకు తండ్రి ముందు అందరి దగ్గర న్యాయంగా ఉన్నట్లు నటిస్తూనే పక్కా కమర్షియల్ లాయర్ గా మారతాడు. దానికి తోడు ఎవరి వల్ల తన తండ్రి అయితే జడ్జి పదవికి రాజీనామా చేసి సామాన్య జీవితం గడుపుతున్నాడో అతనికోసమే కొన్ని తప్పుడు కేసులు వాదిస్తూ ఉండడంతో సూర్యనారాయణ మళ్లీ లాయర్ కోటు వేసుకునేందుకు సిద్ధమవుతాడు. అలా తండ్రి కొడుకుల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? మధ్య లాయర్ ఝాన్సీ రాణి(రాశి) పాత్ర ఏమిటి? ఈ యుద్ధంలో తండ్రి గెలిచాడా? లేక కొడుకు గెలిచాడా? నాన్ కమర్షియల్ తండ్రి కొడుకుని ఓడించడం కోసం ఏం చేశాడు? పక్కా కమర్షియల్ కొడుకు తండ్రిని ఓడించడం కోసం ఏం చేశాడనేది సినిమా.

  ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే

  ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే


  సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి అసలు కథ ఏమిటి అనే విషయం మీద దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.. న్యాయం కోసం నిలబడే జడ్జి, డబ్బుతో ఏమైనా చేయగలను అనుకునే నేటి సమాజపు మోడరన్ క్రిమినల్ మధ్య కథగా ఉండబోతుందనే విషయం సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి క్లారిటీ వచ్చేస్తుంది. నిజాయితీగల జడ్జిగా పనిచేసే దానికి దూరమై కిరణా షాప్ పెట్టుకొని పేదలకు సేవ చేస్తూ కాలం వెళ్ళదీయాలని భావించే సూర్యనారాయణ తన కొడుకు తనను మాయ చేస్తున్నాడు అనే విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలా కొడుకు నిజస్వరూపం తెలుసుకోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. అన్యాయానికి అండగా నిలబడుతున్న కొడుకు మీదే ధర్మ యుద్ధం ప్రకటిస్తాడు సూర్యనారాయణ.

  సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే

  సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే


  సినిమా రెండో భాగం ప్రారంభమైనప్పటినుంచి తండ్రి కొడుకుల మధ్య పోరు ఆసక్తికరంగా మారుతుంది. కొడుకు ఆలోచనలను ముందుగానే పసిగట్టి కొడుకు ఆలోచనలను తండ్రి చిత్తు చేయడం, తండ్రి ఆలోచనలను కొడుకు పసిగట్టి కౌంటర్ ఇవ్వడం వంటి ఆసక్తికరమైన కథనంతో రెండో భాగం సాగుతుంది. అయితే కథ కాస్త రొటీన్ గా ఉండడంతో జరగబోయే సన్నివేశాలు ఏమిటి అనే విషయం మీద ప్రేక్షకులు ఈజీగా ఒక క్లారిటీకి వచ్చేస్తారు. అయితే తండ్రి కోసం కొడుకు ఇలా కూడా చేయవచ్చా అనే విధంగా దర్శకుడు మారుతి రెండో భాగాన్ని డిజైన్ చేశాడు ఎప్పటికప్పుడు తండ్రి మీద గెలవాలనుకునే కొడుకు చివరికి తండ్రికి ఎలా సాయం చేసి తండ్రిని గెలిపించాడు అనే పాయింట్ మాత్రం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది.. ఆ పాయింట్ డిస్కస్ చేయడం కంటే తెరమీద చూస్తేనే కాస్త బాగుంటుంది.

  గోపీ చంద్ - రాశి నటన విషయానికి వస్తే

  గోపీ చంద్ - రాశి నటన విషయానికి వస్తే

  గోపీచంద్ ఎప్పటిలాగే తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాడు. పూర్తిస్థాయి స్టైలిష్ లాయర్ గా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తనదైన డైలాగ్ డెలివరీతో కామెడీ టైమింగ్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. కమెడియన్లు వైవాహర్ష, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి చమ్మక్ చంద్ర, వేణు వంటి వారితో ఎక్కడికక్కడ పోటాపోటీగా కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా నటన విషయంలో రాశి ఖన్నా కూడా ఎక్కడికక్కడ తనదైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది కానీ ఆమె పాత్ర డిజైన్ చేసిన విధానమే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఒక సీరియల్ ఆర్టిస్ట్ కావడంతో ఆ పాత్రకు తగినట్లు ఆమె నటించారు కానీ పాత్ర డిజైన్ చేయడమే కాస్త ఇబ్బందికరంగా అనిపించింది.

  సత్యరాజ్ ఇతర నటీనటుల విషయానికి వస్తే

  సత్యరాజ్ ఇతర నటీనటుల విషయానికి వస్తే


  సినిమాలో గోపీచంద్ తండ్రి పాత్ర అయిన సూర్యనారాయణ అనే జడ్జి పాత్రలో నటించిన సత్యరాజు ఎప్పటిలాగే తనదైన శైలిలో మిగతా నటీనటులను డామినేట్ చేస్తూ నటించాడు.. ఇక ఎప్పటిలాగే రావు రమేష్ కూడా ప్రేక్షకులందరినీ అలరించే ప్రయత్నం చేశారు. రావు రమేష్, అజయ్ ఘోష్ ల నటన సినిమాకు అదనపు ఆకర్షణ. కనిపించింది కొన్ని సీన్లలోనే అయినా చమ్మక్ చంద్ర, వేణు, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, వైవాహర్ష, ప్రవీణ్ వంటి వారు తమదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కెరియర్ మొదట్లో హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన చిత్ర శుక్ల మరీ చిన్న పాత్ర ఎలా ఒప్పుకుంది అనేది ఆమెకే తెలియాలి.

  మారుతీ టేకింగ్ విషయానికి వస్తే

  మారుతీ టేకింగ్ విషయానికి వస్తే

  రొటీన్ కథే అయినా మారుతి తనదైన శైలిలో కథను నడిపించి ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విషయంలో కొంతమేర సఫలమయ్యాడు. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా డైలాగులు రాయడంలో తనకు తానే సాటి అని మరోసారి మారుతి నిరూపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధానుల వ్యవహారాన్ని ఒక సరదా సంభాషణగా సాగిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశాడు. మారుతీ మార్క్ సినిమా మొత్తం కూడా కనిపిస్తుంది. సీరియస్ పాయింట్ అయినా సరదాగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేసిన మారుతి దాదాపు ఈ ప్రయత్నంలో సఫలం అయ్యాడు అనే చెప్పాలి.

  సాంకేతిక వర్గం విషయానికి వస్తే

  సాంకేతిక వర్గం విషయానికి వస్తే

  ఈ సినిమాకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు జోక్స్ బిజాయ్ అన్ని పాటలతో మెప్పించ లేకపోయినా కొన్ని పాటలతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. ఇక ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా ఎక్కడికి అక్కడ బాగా సెట్ అయ్యాయి. గీతా ఆర్ట్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా మొత్తం కనిపించాయి. ఎక్కడా ఓవర్ అనిపించకుండా, సినిమా మొత్తాన్ని సాంకేతిక వర్గం ఆసక్తికరంగా తీర్చిదిద్దింది అనే చెప్పాలి.

  ఫైనల్ గా చెప్పాలంటే

  ఫైనల్ గా చెప్పాలంటే

  పక్కా కమర్షియల్ సినిమా ఒకపక్క రొటీన్ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం చాలా వరకు సఫలం అయింది అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా థియేటర్లకు వెళ్లి చూడగలిగే ఈ సినిమాకు యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  English summary
  here is the gopichand, rashi khanna starrer pakka commercial's exclusive telugu review and rating from telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X