డైలాగ్‌ ల బ్రహ్మనాయుడు

By Staff

Palanatibrahamanaidu
-జలపతి గూడెల్లి
చిత్రం: పలనాటి బ్రహ్మనాయుడు
నటీనటులు: బాలకృష్ణ, ఆర్తి అగర్వాల్‌, సోనాలి బెంద్రే, ముఖేష్‌ రుషి, తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: మేడికొండ వెంకటమురళీకృష్ణ
దర్శకత్వం: బి.గోపాల్‌

ఒక హీరో ఒకే స్లాట్‌ లోకి నెట్టి దాన్ని క్యాష్‌ చేసుకోవాలన్ని ఆరాటం తెలుగులో అధికంగా కన్పిస్తుంటుంది. బాలకృష్ణ ఆవేశపూరితమైన డైలాగ్‌ లతో కూడిన చిత్రాలకు తిరుగులేని హీరో అనిపించుకోవడంతో కొన్ని డైలాగ్‌ లు, ఆ డైలాగ్‌ ల కోసం సన్నివేశాలు సృష్టించడం తప్ప సరైన కథ లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందంటే ఇలా పలనాటి బ్రహ్మనాయుడులా ఉంటుంది. బాలకృష్ణ ఈ చిత్రానికి పనిచేసిన టీంతో నే నరసింహనాయుడు చిత్రం రూపొందించారు. ఆ సినిమాలో హీరోయిజం ఎలివేట్‌ కావడానికి కారణం హీరో ప్రతీకారానికి 'బలమైన మోటివ్‌' ఉండడం, సామాజిక పరిస్థితులు (రాయలసీమ ఫ్యాక్షనిజం) తోడ్పడం.

కానీ ఈ సినిమాలో హీరో విలన్‌ ను చితకబాదాడానికి గానీ, ఆవేశంగా డైలాగ్‌ లు చెప్పడానికి బలమైన పరిస్థితులు ఏమీ ఉండవు. దీంతో ఈ సినిమాలో ఏవీ పెద్దగా ఆకట్టుకోవు. ఆలనాటి పల్నాడు కథను సోషలైజ్‌ చేయాలన్న ఒక సింగిల్‌ పాయింట్‌ ఆలోచనకు బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌ ను కలిపి సినిమా తీసినట్లుగా కన్పిస్తుంది. సినిమ కథలో పస లేనందున గత చిత్రాల మాదిరిగానే భారీగా సుమో ఛేజ్‌ దృశ్యాలు, ట్రైన్‌ దృశ్యాలు, హెలికాప్టర్‌ దృశ్యాలు, కోడిపుంజుల పోరాటాలు...ఇంకా బాలకృష్ణ వ్యక్తిగత అభిరుచులైన దైవం, పూజాశక్తి వంటి దృశ్యాలతో సినిమా నడిపించాలని ప్రయత్నించారు. కథకు ఇవి తోడు కావాలి కానీ వీటిని పట్టుకొని కథ రూపొందిస్తే అలరించదన్ని కనీస అవగహనను మర్చి సినిమా తీయడం బాధాకరం. బాలకృష్ణ వీరాభిమానులకు తప్ప నచ్చని చిత్రం ఇది.

ఎస్‌.ఎస్‌.ఎస్‌.భవానీ ప్రసాద్‌ అనే యువకుడు (బాలకృష్ణ) అంటే పలనాడులో అందరికీ గౌరవం. ఈయన ఏమీ పనిచేస్తాడు, ఎందుకు గౌరవం అనేవీ మనకు తెలియవు. ఎందుకంటే ఆయన బాలకృష్ణ కాబట్టి అని సర్దుకోవాలి. ఈయన చెల్లెలి పెళ్ళికి ఆర్తి అగర్వాల్‌ వస్తుంది. ఈయన చెల్లెలును ముఖేష్‌ రుషి కొడుకు ప్రేమిస్తాడు. పెళ్ళి వేరే వాళ్ళతో కుదిరినా చేసుకుంటానని అంటాడు. దీంతో హీరో వచ్చి ముఖేష్‌ కుటుంబానికి దేహశుద్ది చేస్తాడు. మరోవైపు, ఆర్తికి, ప్రృథ్వీరాజ్‌ కు పెళ్ళి కుదురుతుంది. కానీ పృథ్వీ ఆర్తికి వర్జిన్‌ టెస్ట్‌ చేయిస్తాడు.

దీంతో పాటు కొన్ని సంఘటనలు తోడవ్వడంతో ఆర్తి బాలకృష్ణను ప్రేమిస్తుంది. పృథ్వీరాజ్‌ బాలకృష్ణపై పగతీర్చుకునేందుకు ముఖేష్‌ కుటుంబంతో చేతులు కలుపుతాడు. వీళ్ళు వెళ్ళి జయప్రకాష్‌ రెడ్డి సాయం అడుగుతారు. జయప్రకాష్‌ రెడ్డి కూతురు శివనాగేశ్వరి (సోనాలి బెంద్రె) బాలకృష్ణ పెళ్ళి ఆర్తితో జరగకుండా ఆపుతుంది.

ఇక్కడ ప్లాష్‌ బ్యాక్‌.. కాలేజ్‌ లో చదువుకుంటుండగా శివనాగేశ్వరికి ఒక వ్యక్తి ప్రేమలేఖ రాస్తాడు. ఆమె సోదర బృందం పొరపాటున బాలకృష్ణ అనుచరుడుకు చెందిన కుమారుణ్ణి(జతిన్‌) చితకబాదుతారు. దీంతో హీరో రెచ్చిపోయి, సోనాలికి, జతిన్‌ కి పెళ్ళి చేస్తానని వాగ్ధానం చేస్తాడు. ఇంతలో జతిన్‌ వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. మరి నన్ను ఎవరు చేసుకుంటారు అని సోనాలి బాలకృష్ణను నిలదీస్తుంది. క్లైమాక్స్‌ లో హీరో సోనాలి నిజరూపం బయటపడేలా చేయడంతో సినిమా ముగుస్తుంది.

ఇందులో నిజంగా ఎవరు విలన్‌ లు ఎవరికీ అర్థం కాదు. అలనాటి నాగమ్మ అనే పాత్రలో సోనాలిని విలన్‌ అనుకున్నా, ఆమె పగకు బలం లేదు. హీరో లక్ష్యానికి బలం లేదు. బాలకృష్ణ నటన ఇందులో మరీ పేలవంగా ఉంది. సినిమా ఆద్యంతం అందంగా ఉండడం ఒక కారణం కావచ్చు. ఆ పాత్రలో రఫ్‌ నెస్‌ లేకపోవడం వల్ల పెద్దగా పండలేదు. సోనాలి ఫర్వలేదు. ఆర్తి పాటలకు తప్ప పెద్ద పాత్ర లేదు. మణిశర్మ రీరికార్డింగ్‌ బాగుంది.

ఓల్డ్‌ మ్యాన్‌ వి.ఎస్‌.ఆర్‌ స్వామి ఎప్పటిలాగే ఛేజింగ్‌ దృశ్యాలు బాగా చిత్రీకరించారు. ఈ సినిమాలో నిజమైన విలన్‌ కథారచయిత పోసాని కృష్ణమురళి అనే చెప్పాలి. దర్శకుడు బి.గోపాల్‌ కు ఎప్పటికైనా, ఇప్పటికైనా 'తనకంటూ ఒక స్టైల్‌' వచ్చేనా? ఆయన హిట్‌ చిత్రాలకు, ఇలాంటి చిత్రాలను పోల్చితే..అన్ని గాలివాటం విజయాలే అనిపిస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X