For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పలాస 1978 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, విజయ్ రామ్, తిరువీర్, లక్ష్మణ్ మీసాల
  Director: కరుణ కుమార్.

  స్వతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా కుల వివక్ష దారుణమైన పరిస్థితులను సృష్టిస్తున్నది. అగ్రవర్ణాల, దళితుల మధ్య దాడులు సమాజంపై మాయని మచ్చలు వేస్తున్నాయి. చుండూరు గానీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, దేశంలోని పలు ప్రాంతాల్లో కులాల కుంపట్లు రాజుకుంటూనే ఉన్నాయి. ఎన్నో దారుణాలకు సాక్ష్యంగా నిలిచిన సమాజం ఆ నెత్తుటి మరకలను తుడిచిపెట్టలేకపోతున్నది. ఆ పరిస్థితులే ప్రాంతీయ అసమానతలను పెంచుతూ వర్గాల వారీగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

  అలాంటి సంఘటనల ఆధారంగా ఎన్నో అభ్యుదయ చిత్రాలు వెండితెర మీద ఆవిషృతమయ్యాయి. తాజాగా ఆ కోవలో కుల వివక్షపై సంధించిన సినీ అస్త్రం పలాస 1978. రచయిత కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం ఎలాంటి అనుభూతులను, ఆలోచనలను రేకెత్తించింది? ఎలాంటి అనుభూతులను పంచిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే అసలు పలాస 1978 గురించి సమీక్షించుకోవాల్సిందే.

  పలాస 1978 కథ

  పలాస 1978 కథ

  80 దశకంలో పలాసలో అగ్రవర్ణాల కుటుంబాలకు, నిమ్న వర్గాల మధ్య అసమానతలు తీవ్రంగా నెలకొని ఉంటాయి. నీళ్లు తాకితే మైల పడిపోతుందని చిన్న కులాల వారిపై దారుణంగా దాడులకు పాల్పడుతుంటారు. అలాంటి క్రమంలో పాటలు పాడుకుంటూ జీవనం సాగించే గ్రామ యువకులు మోహన్ రావు (రక్షిత్), రంగారావు (తిరువీర్) గొంతు లెవనెత్తుతారు. దాంతో అగ్రవర్ణాలకు, వెలివేయబడిన కులాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే పెద్ద షావుకారు, చిన షావుకారు గురుమూర్తి (రఘు కుంచె) అన్యాయాలను ఎదురించడం మొదలుపెడుతారు.

  పలాస 1978 కథలో ట్విస్టులు

  పలాస 1978 కథలో ట్విస్టులు

  కళాకారులైన మోహన్ రావు, రంగారావు రౌడీలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? పెద్ద షావుకారుకు, చిన్న షావుకారు మధ్య విభేదాలు ఏ మేరకు ఊరిలో చిచ్చుపెట్టాయి? పెద్ద షావుకారును చంపడానికి ఎలాంటి సంఘటనలు కారణమయ్యాయి? చిన్న షావుకారును ఇద్దరు యువకులు ఎలా ఎదురించారు? ఫ్యాక్షన్‌ను అంతం చేయడానికి ప్రయత్నించిన పోలీస్ ఆఫీసర్ సెబాస్టియన్ (విజయ్ రామ్) పరిస్థితి చివరు ఏమైంది? అగ్రకులాలను ఎదురించే క్రమంలో మోహన్ రావు, రంగారావు ఎలాంటి త్యాగాలకు పాల్పడాల్సి వచ్చిందనే పలు ప్రశ్నలకు సమాధానమే పలాస 1978.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  గ్రామ జాతర జరుగుతుండగా చనిపోయాడనుకొన్న మోహన్ రావు తన ప్రత్యర్థిని చంపడంతో కథ సీరియస్‌ నోట్‌లో మొదలవుతుంది. 80 నాటి పరిస్థితులు, వాతావరణం తెరపై కొత్తగా కనిపించడం, మొదటి నుంచే తెర మీద సన్నివేశాలు పేర్చుకొంటూ పోయిన వైనం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంది. మోహన్ రావు గురించి రిటైర్డు కానిస్టేబుల్ చెప్పడంతో కథ 80 దశకంలోకి వెళ్తుంది. గ్రామ కక్షలు, రాజకీయాలు, ప్రేమ, భావోద్వేగాలను జోడించడంతో సీన్లు తొలిభాగంలో పరుగులు పెడుతుంటాయి. కళను నమ్ముకొన్న ఇద్దరు యువకులు కత్తిపట్టి రౌడీయిజం మారే క్రమం ఆసక్తిగా కనిపిస్తుంది. నటీనటుల అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌, తూటాల్ల పేలే డైలాగ్స్‌తో పవర్ ప్యాక్డ్, ఎమోషనల్ సీన్‌తో తొలి భాగం ముగుస్తుంది.

  సెకండాఫ్ ఎనాలిసిస్

  సెకండాఫ్ ఎనాలిసిస్

  ఇక సెకండాఫ్‌లో ఓ మర్డర్ సీన్‌తో సినిమా మరో లెవెల్‌‌కు వెళ్లినట్టు కనిపిస్తుంటుంది. కానీ సెకండాఫ్ తర్వాత సినిమా రొటీన్ ఫార్మాట్‌లోకి మారినట్టు కనిపిస్తుంది. కాకపోతే ట్విస్టులు, యాక్షన్ సీన్లు, భావోద్వేగమైన సన్నివేశాలు, డైలాగ్స్ సెకండాఫ్‌‌ను డ్రాప్ కాకుండా కాపాడాయని చెప్పవచ్చు. చివర్లో సెబాస్టియన్ పాత్రను హైలెట్ చేస్తూ కథలో సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు జరిగాయి. గ్రామ కూడలిలో ఒక చేతిలో పుస్తకం పట్టుకొని.. మరో చేతిని మనం ఎక్కడికి పోవాలో చూపించే మహానుభావుడు స్ఫూర్తితో అంటూ సెబాస్టియన్ చేత చెప్పించిన మాటలు ఆలోచింపజేస్తాయి. అలాగే వినాయకుడి మెడను అతికించే దేవుడు ఉన్నప్పుడు? ఏకలవ్యుడు బ్రొటన వేలిని అతికించే దేవుడిని ఎందుకు సృష్టించలేదు అంటూ దర్శకుడు సంధించిన విమర్శనాస్త్రం సినిమాను పరిపూర్ణం చేసేందుకు ఉపయోగపడిందని చెప్పవచ్చు. చివర్లో మోహన్ రావు పాత్ర ద్వారా ఇచ్చిన ట్విస్టు సినిమా ప్రతీ ప్రేక్షకుడిని కదిలించేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడి ప్రతిభ

  తన కళ్లముందు ఉత్తరాంధ్రలో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు కరుణ కుమార్ తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసిన తీరు అభినందనీయం. ప్రతీ ఫ్రేమ్‌లో ప్రేక్షకుడిని ఆలోచింపజేసే విధంగానూ, ఆనందం నింపే విధంగా కమర్షియల్, ఆర్ట్స్ ఫార్మాట్లను తొలి భాగంలో మేలవించిన తీరు ప్రశంసనీయం. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి ఆ మ్యాజిక్ కొంత నీరుగారినట్టు అనిపించినా.. పతాక సన్నివేశాల్లో భావోద్వేగ, నాటకీయ సన్నివేశాలతో ఆ లోటును భర్తీ చేశాడని చెప్పవచ్చు. పలాస 1978 సినిమా చూస్తే కరుణ కుమార్ తొలి చిత్ర దర్శకుడనే ఫీలింగ్ ఎక్కడా కలుగదు. ప్రతీ సీన్‌ను తెరకెక్కించిన విధానం కళలపై ఉన్న మక్కువ కనిపిస్తుంది. సమాజంపై దర్శకుడికి ఉన్న అసహనం, అసంతృప్తి తెరమీద స్పష్టంగా కనపడుతుంది. దర్శకుడిగా ఎంత సక్సెస్ అయ్యాడో.. రచయితగా కూడా అంతే రేంజ్‌లో మెప్పించాడు.

  రక్షిత్, తిరువీర్, నక్షత్ర గురించి

  రక్షిత్, తిరువీర్, నక్షత్ర గురించి

  ఇక పలాస 1978 మూవీకి వెన్నెముకగా నిలిచింది మోహన్ రావు పాత్ర. ఈ పాత్రలో రక్షిత్ పరకాయ ప్రవేశం చేశాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. పలు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను మంచి నీళ్లు తాగినంత తేలికగా చేసేశాడు. హావభావాలు పలికించంలోను, డైలాగ్స్ చెప్పడంలోను, ప్రేమ సీన్లను పండించడంలోను ఆల్ రౌండ్ ప్రతిభను చాటుకొన్నాడు. ఆ తర్వాత రంగారావు పాత్రను తిరువీర్ కూడా అద్బుతంగా పోషించాడు. ఆవేశం కలిగిన యువకుడిగా రక్షిత్‌తో పోటాపోటీగా నటించి మెప్పించాడు. నక్షత్ర పాత్ర కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది, ఆమె అందంతోపాటు, అభినయంతో ఆకట్టుకొన్నారు.

  రఘు కుంచె, లక్ష్మణ్ మీసాల గురించి

  రఘు కుంచె, లక్ష్మణ్ మీసాల గురించి

  నటీనటులు విషయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే.. గురుమూర్తి పాత్రలో రఘు కుంచె అద్బుతంగా మెప్పించాడు. ఇప్పటి వరకు గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హోస్ట్‌గానే తెలిసిన రఘులో మరో మంచి నటుడు కూడా ఉన్నాడని గురుమూర్తి పాత్రతో రుజువైంది. రకరకాలు వేరియేషన్స్‌ను పలికించిన విధానం బాగుంది. అలాగే పెద షావుకారుగా మరో నటుడు లైవ్లీగా ఉన్నారు. ఇటీవల కాలంలో తెలుగు తెరపై విలక్షణ నటనను ప్రదర్శిస్తున్న లక్ష్మణ్ మీసాల మరోసారి తన ప్రతాపం చూపించాడు. పాత్రకు అనుగుణంగా బాడీ ల్వాంగ్వేజ్‌ను మలుచుకొని సినిమాకు ఎస్సెట్‌గా మారారని చెప్పవచ్చు. తమిళ నటుడు విజయ్ రామ్ (సెబాస్టియన్), ప్రవీణ్ ఎండమూరి ఇలా ప్రతీ పాత్ర సినిమాకు కీలకంగా మారినవే.

  టెక్నికల్ విభాగం పనితీరు

  టెక్నికల్ విభాగం పనితీరు

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. పలాస 1978ను అద్భుతమైన చిత్రంగా నిలబెట్టింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. కొన్ని సీన్లను రీరికార్డింగ్ మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. కథలో ఉండే టెంపోను, ఎమోషన్స్‌ను నిలకడగా ఉండేలా మ్యూజిక్ దోహదపడింది. ఈ సినిమాకు మరో బలం డైలాగ్స్. దర్శకుడు కరుణ కుమార్ రాసుకొన్న మాటలు ఆలోచింపజేస్తాయి. హాస్యాన్ని పండించాయి. హృదయంలో ఓ ఆర్ధతను మిగులుస్తాయి. 80 నాటి పరిస్థితులను తెర మీద కనిపించేలా చేసిన అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫి మరో స్పెషల్ ఎట్రాక్షన్. లైటింగ్ చాలా ఫర్‌ఫెక్ట్‌గా ఉండటంతో సన్నివేశాల మూడ్ చాలా ఎలివేట్ అయింది. ఎడిటింగ్‌తో ప్రతీ విభాగం చక్కగా పనిచేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే కథ మొత్తం ఒకే ఫార్మాట్‌లో ఉండటం వల్ల సినిమా నిడివి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన పలాస 1978 చిత్రంలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. ఇటీవల కాలంలో రంగస్థలం తర్వాత ఇంత రిచ్‌గా తెరకెక్కించిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించవు. కథ, నటీనటులు ఎంపిక సినిమాపై నిర్మాతలకు ఉన్న అభిరుచిని తెలియజేస్తుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  గ్రామ రాజకీయాలు, సమాజంలోని కుల వివక్ష, అగ్రవర్ణాల దాడులు తదితర అంశాలను ఆధారంగా చేసుకొని సంధించిన సినీ విమర్శనాస్త్రం పలాస 1978. సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ప్రధాన బలం. ఆలోచింప జేసే డైలాగ్స్, కథనం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సమాజిక అంశాలు అద్దిన ఆర్ట్ సినిమాగా అనిపించినా.. కమర్షియల్ పుష్కలంగానే ఉన్నాయి. బీ, సీ సెంటర్లతోపాటు మల్టీప్లెక్స్ ప్రేక్షకుల ఆదరణకు లభిస్తే కమర్షియల్‌గా మరో రేంజ్‌కు వెళ్లడం ఖాయం.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  కథ, కథనాలు
  నటీనటుల ఫెర్ఫార్మెన్స్
  ఫస్టాఫ్
  సినిమాటోగ్రఫి, మ్యూజిక్
  క్లైమాక్స్

  మైనస్ పాయింట్స్
  రోటీన్ కథ
  సెకండాఫ్‌లో కొంత
  సినిమా నిడివి

  Palasa 1978 Movie Official Teaser Rakshit | Karuna Kumar | Raghu kunche | Filmibeat Telugu
  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, విజయ్ రామ్, తిరువీర్, లక్ష్మణ్ మీసాల, ప్రవీణ్ ఎండమూరి, జగదీష్ ప్రతాప్ బండారి, మిర్చి మాధవి, షణ్ముఖ్ తదితరులు
  పాటలు: భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల,
  ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు,
  సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్,
  సంగీతం: రఘు కుంచె,
  కో ప్రొడ్యూసర్: మీడియా 9 మనోజ్
  నిర్మాత: ధ్యాన్ అట్లూరి.
  రచన- దర్శకత్వం: కరుణ కుమార్.
  రిలీజ్ డేట్: 2020-03-06

  English summary
  Palasa 1978 movie review: Karuna Kumar as director debut movie is Palasa 1978. North andhra nativity is This movie back drop. This movie hit the screen on March 6th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X